మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు పెళ్లి కోసం ఓ వివాహిత ఆందోళన చేసింది.
పెళ్లైన తర్వాత కూడా శ్రీధర్ ప్రసన్నకు నువ్వు లేకపోతే ఉండలేను అంటూ పెళ్లి చేసుకుంటానని తెలపడంతో ఆ మాటలు నమ్మిన ప్రసన్న పెళ్లైన భర్తను వదిలి వచ్చేసింది. పెళ్లి చేసుకుంటానని తెలిపిన శ్రీధర్ మొహం చాటేయడంతో కుటుంబసభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి వద్ద ఆందోళన చేసింది. తనకు న్యాయంగా చేయాలంటూ వాపోయింది. లేనిపోని మాటలతో తమ కుమార్తెకు మాయమాటలు చెప్పడంతో కాపురం వదిలి వచ్చిందని, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే కుమార్తె జీవితం వీధిన పడుతుందని ప్రసన్న తల్లిదండ్రులు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగేందుకు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సదరు ప్రియుడు శ్రీధర్‌కు వివాహం కావడంతో భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.