'చంద్రబాబే ముద్దాయి' | chandrababu responsible for bhuma nagi reddy death, says desai thippa reddy | Sakshi
Sakshi News home page

'చంద్రబాబే ముద్దాయి'

Mar 14 2017 1:04 PM | Updated on May 29 2018 2:33 PM

'చంద్రబాబే ముద్దాయి' - Sakshi

'చంద్రబాబే ముద్దాయి'

భూమా నాగిరెడ్డి మరణానికి ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబే కారకుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఆరోపించారు.

అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణానికి ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబే కారకుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబే ముద్దాయని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని ప్రలోభపెట్టి నాగిరెడ్డిని చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని, ఏడాది గడిచినా పదవి ఇవ్వకపోవడంతో ఆయన ఒత్తిడి గురయ్యారని చెప్పారు. నాగిరెడ్డి చనిపోవడానికి 24 గంటల ముందు చంద్రబాబుతో తీవ్ర వాగ్వాదం జరిగిందని వెల్లడించారు. దీంతో మనస్తాపం చెంది నాగిరెడ్డి ఆస్పత్రి పాలయ్యారని ఆరోపించారు. అసెంబ్లీలో సంతాపం పేరుతో టీడీపీ సభ్యులు ఏవేవొ మాట్లాడి రాజకీయ సభ చేశారని తిప్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసనసభను చంద్రబాబు అపవిత్రం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ ధ్వజమెత్తారు. ఫిరాయింపులు ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానించారని, ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement