బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కొత్తపార్టీ | Byreddy rajasekhara reddy to launch new Seema party | Sakshi
Sakshi News home page

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కొత్తపార్టీ

Aug 9 2013 2:44 AM | Updated on Sep 1 2017 9:44 PM

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కొత్తపార్టీ

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కొత్తపార్టీ

రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

 రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భావం
 తిరుపతి, న్యూస్‌లైన్: రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో గురువారం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భావ  సభ జరిగింది. ఈ సందర్భంగా బెరైడ్డి మాట్లాడుతూ ఎక్కడి నుంచో వచ్చిన తెల్లదొరసాని నలుగురు పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను వెంటపెట్టుకుని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తోందని మండిపడ్డారు. ఇక్కడి రాజకీయ దొంగలేమో తమ జిల్లాను తెలంగాణ లో కలపాలంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ఈ ఆవిర్భావ సభకు రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీలో క్రియాశీలక పాత్ర పోషించే భూమన్, దశరథరామిరెడ్డి, వెంకటశివారెడ్డి, ఎన్‌వి రమణారెడ్డి, శరత్ చంద్రారెడ్డి హాజరుకాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement