విద్యార్థుల ప్రాణాలు కాపాడిన 'విద్యుత్ కోత' | Bus collision with Current Transformer in Guntur city | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రాణాలు కాపాడిన 'విద్యుత్ కోత'

Sep 19 2014 11:46 AM | Updated on Nov 9 2018 4:45 PM

దాదాపు 50 మంది విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

గుంటూరు : దాదాపు 50 మంది విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టింది. అయితే అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాలలో విద్యుత్ కోతతో సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు.

ఆ ఘటన గుంటూరు నగరంలోని నవభారత్ నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.  అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులతో ఇంటికి పంపించేశారు. అలాగే బస్సు ఢీ కొనడంతో ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయింది. దీనిపై విద్యుత్ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement