అరటిగెల.. ఆరడుగులు!
సాధారణంగా కూరటి గెలలు రెండు నుంచి మూడు అడుగుల పొడవుండి, మహా అయితే 80 నుంచి 150 మధ్య కాయలుంటాయి.
	ఒక్కో గెలకు 630కి పైగా కాయలు
	సాధారణంగా కూరటి గెలలు రెండు నుంచి మూడు అడుగుల పొడవుండి, మహా అయితే 80 నుంచి 150 మధ్య కాయలుంటాయి. కాని శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శేషాద్రిపురం గ్రామంలో నంబాళ్ళ అప్పలాచార్యులు ఇంటి పెరడులోని అరటి చెట్లు ఆరడుగులకు పైగా పొడవున్న అరటి గెలలు వేస్తున్నాయి. ఒక్కో గెలకు దాదాపు 630కి పైగా కాయలతో పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ రైతు పెరడులో వేసిన అరటిమొక్కల్లో మూడు మొక్కలు ఇలాంటి గెలలు వేశాయి. ఇటీవల ఒక గెల కోయగా మిగిలిన రెండు కోతకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి వేశామని, ఎనిమిది నెలల వయస్సు ఉంటుందని రైతు అప్పలాచార్యులు అన్నారు.  -శేషాద్రిపురం(సంతకవిటి)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
