అసెంబ్లీలో ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన బుగ్గన

Buggana Rajendranath presents AP Budget 2019-20 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ అంచనా రూ.2,27,974.99 కోట్లు కాగా..రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు అని మంత్రి తెలిపారు. మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు కాగా అలాగే వడ్డీ చెల్లింపుల నిమిత్తం రూ.8,994 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 19.32 శాతం పెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు.

రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు, ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58 కోట్లు జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు సుమారు 3.3 శాతం, జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతంగా ఉందని తెలిపారు మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ...‘మహాత్ముని లక్ష్యాన్ని సాధించే దిశగా మా బడ్జెట్‌ ఉంది. పేదల కన్నీళ్లు తుడిచే దిశగా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. ధృడమైన మార్పు రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. న్యాయపరమైన నియమాలకు లోబడే రాజకీయాలు చేస్తాం.

రాష్ట్రంలో అన్ని వర్గాలు, అందరు ప్రజలకు మేలు చేసే దిశగా చర్యలు చేపట్టాం. కృష్ణ ఆయుకట్టు స్థిరీకరణ చేస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం. మ‍్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తాం. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు.’ అని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను ఏకో ఫ్రెండ్లీగా మారుస్తాం. ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తాం. అన్ని రంగాల సమగ్ర అభివృద్థే మా లక్ష్యం’ అని అన్నారు.

నవరత్నాలకు పెద్దపీట
రాష్ట్రాభివృద్ధే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నవరత్నాలకే పెద్ద పీట వేస్తున్నాం. గోదావరి నీళ్లను శ్రీవైలంకు తీసుకురావడం మా లక్ష్యం. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం. అన్ని కాంట్రాకుల్లో పారదర్శకత పాటిస్తాం. అవినీతి రహిత పాలనే మా లక్ష్యం. ప్రతి పనిని ఆన్‌లైన్‌లో ఉంచుతాం. ప్రజలు కోరిన పాలన కోసం సీఎం కృషి చేస్తున్నారు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతం ఉంది అని మంత్రి బుగ్గన తెలిపారు.

 • వ్యవసాయం, అనుబంధ సంస్థలకు రూ. 20, 677.08 కోట్లు
 • వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.20677 కోట్లు
 • సాగునీరు, వరద నివారణకు రూ.13139 కోట్లు
 • వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రూ.8750 కోట్లు
 • రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ.4525 కోట్లు
 • ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు
 • ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002 కోట్లు
 • వైఎస్సార్‌ రైతు బీమాకు రూ.1163 కోట్లు
 • ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీకి రూ.475 కోట్లు
 • రైతులకు ఉచిత బోర్లకు రూ.200 కోట్లు
 • విత్తనాల పంపిణీకి రూ.200 కోట్లు
 • గ్రామీణాభివృద్ధికి రూ..29, 329.98 కోట్లు
 • విద్యుత్‌కు రూ.6,861 కోట్లు
 • పారిశ్రామిక రంగానికి రూ.3,986.05 కోట్లు
 • రవాణా రంగానికి రూ.6,157.25 కోట్లు
 • విద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత రూ.32,618.46 కోట్లు
 • క్రీడలకు రూ.329.68 కోట్లు
 • గృహ నిర్మాణానికి రూ.3617 కోట్లు
 • వైద్య రంగానికి రూ.11,388 కోట్లు
 • సంక్షేమ రంగానికి రూ.14, 142 కోట్లు
 • పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1500 కోట్లు
 • మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు
 • ఒంటరి మహిళల పెన్షన్లకు రూ.300 కోట్లు
 • వికలాంగుల పెన్షన్లకు రూ.2133.62 కోట్లు
 • ఏపీఎస్‌ ఆర్టీసీకి రూ.1000 కోట్లు
 • వృద్దులు, వితంతువుల పెన్షన్లుకు రూ. 12801 కోట్లు
 • అమ్మ ఒడి పథకానికి రూ.6,455 కోట్లు
 • ప్రణాళిక విభాగానికి రూ.1439.55 కోట్లు
 • డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు రూ.1,140 కోట్లు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top