కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కొమరోలు(ప్రకాశం): కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీలోని పొట్టిపల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తుర్రా వెంకట కుమార్(28) బెంగళూరులో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్న కుమార్ శుక్రవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.