పాల పోటీల్లో మండపేట భళా | Bravo milk in the prison | Sakshi
Sakshi News home page

పాల పోటీల్లో మండపేట భళా

Jan 13 2014 12:35 AM | Updated on Sep 2 2017 2:34 AM

రాష్ట్రస్థాయి పాల పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా మండపేట పశువులు హవా ప్రదర్శించాయి. మూడు విభాగాల బహుమతుల్లో సింహభాగాన్ని దక్కించుకున్నాయి.

  • జంక్షన్‌లో ముగిసిన పోటీలు
  •  పశుపోషకులకు బహుమతుల ప్రదానం  
  • హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : రాష్ట్రస్థాయి పాల పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా మండపేట పశువులు హవా ప్రదర్శించాయి. మూడు విభాగాల బహుమతుల్లో సింహభాగాన్ని దక్కించుకున్నాయి. ఏపీ పశు గణాభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హనుమాన్‌జంక్షన్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పాల పోటీలు ఆదివారంతో ముగిశాయి. పోటాపోటీగా తలపడిన పశువుల చివరి వరకు ఉత్కంఠను రేపాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అరుదైన పశుజాతిని చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు ఉత్సాహం చూపారు.

    పోటీల ప్రాంగణం తిరునాళ్లను తలపించింది. ఆదివారం ఉదయం మూడో విడత పాల సేకరణ చేసిన అనంతరం పశు సంవర్ధక శాఖ అధికారులు విజేతలను ప్రకటించారు. ఏపీ పశు గణాభివృద్ధి సంస్థ సీఈవో కొండలరావు, కృష్ణావేణి మిల్క్ యూనియన్ చైర్మన్ దేవభక్తుని రామకృష్ణాప్రసాద్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్ చేతుల మీదుగా పశుపోషకులులకు షీల్డ్‌తో పాటు నగదు బహుమతులను అందజేశారు.

    ముర్రా జాతి గేదెలు, ఒంగోలు, సంకర జాతి ఆవులవిభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులుగా సుమారు రూ. 4 లక్షల మొత్తాన్ని అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ సభలో సీఈవో కొండలరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువుల పెంపకంపై ఆసక్తి, అవహగాన పెంచేందుకు పాల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  
     
    ముర్రాజాతి విభాగంలో ....
     
    మండపేటకు చెందిన వల్లూరి సత్యనారాయణ చౌదరి (టాక్టర్ సత్తిబాబు), బాపులపాడు మం డలం వీరవల్లికి చెందిన చిలకపాటి రాజీవ్ కు చెందిన గేదెల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. స్వల్ప వ్యత్యాసంతో సత్తిబాబుకు చెందిన గేదె సగటున రోజుకు 20. 503 లీటర్ల పాల ఉత్పత్తిని అందించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆయన షీల్డ్‌తో పాటు రూ. 70 వేల నగదు బహుమతిని అందుకున్నారు. చిలకపాటి రాజీవ్ గేదె 19.787 లీటర్లుతో ద్వితీయ స్ధానం, మండపేటకు చెం దిన వల్లూరి శ్రీనివాస్ గేదె 19.566 లీటర్లుతో తృతీయ స్థానం దక్కించుకున్నాయి. మండపేట వాసి ముత్యాల సత్యనారాయణకు చెందిన గేదె 18.950 లీటర్లతో ప్రోత్సాహక బహుమతిని సొంతం చేసుకుంది.
     
    ఒంగోలు ఆవుల విభాగంలో...
     
    మండపేటకు చెందిన చుండ్రు సుబ్బారావు ఆవు 10.060 లీటర్లతో అగ్రస్థానంలో నిలిచి షీల్డ్, రూ. 50 వేల నగదు కైవసం చేసుకుంది. బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఇపర్ల వెంకటేశ్వర్లు ఆవు 10.050 లీటర్లు, గుమ్మిలేరుకు చెందిన కోరా వీరభద్రరావు ఆవు 9.997 లీటర్లుతో ద్వితీయ, తృతీయ బహుమతులను పొందాయి. మండపేట వాసి వల్లూరి సతీష్‌కుమార్‌కు చెందిన ఆవు 9.597 లీటర్లు ఇచ్చి ప్రోత్సాహక బహుమతిని దక్కించుకుంది.
     
    సంకర జాతి ఆవుల విభాగంలో...
     
    బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన చిలకపాటి రాజీవ్‌కు చెందిన ఆవు 29.457 లీటర్లు పాలు దిగుబడితో ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. మండపేటకు చెందిన వల్లూరి సత్యనారాయణ చౌదరి ఆవు 29.260 లీటర్లు, విశాఖపట్టణం జిల్లా పాయకారావు పేటకు చెందిన చిట్లూరి నరసింహరావు ఆవు 23.023 లీటర్ల పాల దిగుబడితో రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గుమ్మిలేరుకు చెందిన రెడ్డి అఖిలకు చెందిన ఆవు 14.693 లీటర్ల పాలను ఇచ్చి ప్రోత్సాహక బహుమతిని పొందింది. పాల పోటీల అనంతంర జరిగిన ముర్రా జాతి పాల పళ్ల దూడల అందాల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిలకపాటి రాజీవ్, చుండ్రు సుబ్బారావు దూడలు ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్నాయి. పశుసంవర్ధక శాఖ జేడీ దామెదర నాయుడు, ఏడీ డాక్టర్ యం.ఎస్.ఎ.దివాకర్, పలువురు పశు వైద్యులు పాల్గొన్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement