
భూమా శోభానాగిరెడ్డి నేత్రదానం
రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్సార్ సీసీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి కళ్లను దానం చేశారు.
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్సార్ సీసీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి కళ్లను దానం చేశారు. శోభానాగిరెడ్డి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె కళ్లను దానం చేశారు. శోభానాగిరెడ్డి పార్థీవదేహం నుంచి నయనాలను సేకరించి వైద్యులు భద్రపరిచారు. శోభానాగిరెడ్డి కళ్లతో ఇద్దరికి వెలుగు ప్రసాదించనున్నారు. శోభానాగిరెడ్డి మరణించినా తన కళ్లను దానం చేసి చీకటి జీవితాల్లో వెలుగు నింపారు. శోభానాగిరెడ్డి కళ్లు దానం చేయడాన్ని సామాజికవేత్తలు, వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశంసించారు. నేత్రదానం చేసి శోభానాగిరెడ్డి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభానాగిరెడ్డి సంతాపసభ నిర్వహించారు. శోభానాగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ఆర్ సీపీ నేతలు, అభిమానులు నివాళి అర్పించారు. శోభానాగిరెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర వాప్తంగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.