
ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి, అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ముంబయి నుంచి హైదరాబాద్ చేరుకుని ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రామ్ చరణ్ సైతం మైసూర్లో నుంచి నగరానికి వచ్చేశారు. శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అత్తమ్మ కనకరత్నం గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆమె బతికి ఉన్నప్పుడే తన కళ్లు దానం చేయాలని మాతో చెప్పిందని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఆమె చెప్పిన మాటలు గుర్తొచ్చి వెంటనే ఐ బ్యాంక్కు ఫోన్ చేసి కళ్లను దానం చేశామని వెల్లడించారు. ఓ ఈవెంట్కు హాజరైన చిరంజీవి ఈ విషయాన్ని తెలిపారు.
మెగాస్టార్ మాట్లాడుతూ..'తెల్లవారుజామున రెండున్నర గంటలకు ఆమె లేరని వార్త తెలిసింది. అరవింద్ అప్పటికే బెంగళూరులో ఉన్నారు. నేనే అక్కడికి ముందు వెళ్లాను. ఆమె చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చి.. మూడు గంటల సమయంలో ఐ బ్యాంక్కు ఫోన్ చేశా. ఐ డొనేషన్కు ఏర్పాటు చేయమన్నా. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న అల్లు అరవింద్కు ఫోన్ చెప్పాను. ఆయన వెంటనే ఓకే చెప్పారని' అన్నారు. ఆమె నేత్ర దానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మెగాస్టార్ పేర్కొన్నారు.
A timely gesture of compassion by Megastar❤️
With a timely and thoughtful decision, #Chiranjeevi garu facilitated the eye donation of his mother-in-law #AlluKanakaratnamma garu, turning sorrow into a light of hope for others 👏🏼#MegastarChiranjeevi @KChiruTweets pic.twitter.com/aztOzdH0rf— Team Megastar (@MegaStaroffl) August 30, 2025