గుంటూరులో భోగి మంటల్లో అపశ్రుతి | Bhogi Fire Celebrations: Man catches Fire in guntur ntr stadium | Sakshi
Sakshi News home page

గుంటూరులో భోగి మంటల్లో అపశ్రుతి

Jan 13 2017 9:22 AM | Updated on Sep 5 2017 1:11 AM

గుంటూరులో భోగి మంటల్లో అపశ్రుతి

గుంటూరులో భోగి మంటల్లో అపశ్రుతి

భోగి మంటల్లో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే...భోగి సందర్భంగా శుక్రవారం ఉదయం

గుంటూరు :  భోగి మంటల్లో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే...భోగి సందర్భంగా  శుక్రవారం ఉదయం గుంటూరులోని ఎన్టీఆర్‌ స్టేడియంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి కూడా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో భోగి మంటల్లో కిరోసిన్‌ పోస్తుండగా అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు ఓ వ్యక్తి శరీరానికి అంటుకున్నాయి.  అతడిని కాపాడేందుకు ఎమ్మెల్యే మోదుగుల ప్రయత్నించారు. ఆయన పాదాలకు కూడా మంటలు అంటుకున్నాయి. గాయపడిన వ్యక్తిని స్టేడియం నిర్వాహకులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement