breaking news
mla modugula venugopal reddy
-
గుంటూరులో భోగి మంటల్లో అపశ్రుతి
గుంటూరు : భోగి మంటల్లో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే...భోగి సందర్భంగా శుక్రవారం ఉదయం గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భోగి మంటల్లో కిరోసిన్ పోస్తుండగా అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు ఓ వ్యక్తి శరీరానికి అంటుకున్నాయి. అతడిని కాపాడేందుకు ఎమ్మెల్యే మోదుగుల ప్రయత్నించారు. ఆయన పాదాలకు కూడా మంటలు అంటుకున్నాయి. గాయపడిన వ్యక్తిని స్టేడియం నిర్వాహకులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మోదుగుల ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు
బెంగళూరు ఆఫీస్‌లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం గుంటూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆస్తులపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాలపై ఐటీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఐటీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి మధ్యాహ్నం నుంచి సోదాలు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బెంగళూరులోని ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. బుధవారం మోదుగులకు చెందిన హైదరాబాద్, గుంటూరు కార్యాలయాల్లో కూడా ఈ దాడులు నిర్వహించనున్నట్లు తెలిసింది. మోదుగుల బెంగళూరులో అందుబాటులో లేని సమయంలో ఈ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయా, లేక రాజకీయకోణంలో జరిగాయా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మోదుగుల అందుబాటులో లేకపోవడంతో ఐటీ అధికారులు ఆయన భార్య వద్ద నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. -
టీడీపీ ఎమ్మెల్యే నివాసంపై ఐటీ దాడులు