వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు న్యాయం

BC Study Committee Conference in tirupati - Sakshi

సాక్షి, తిరుపతి:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో సోమవారం బీసీ అధ్యయన కమిటీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూమనతో పాటు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. భారతదేశ నిర్మాణంలో బీసీలది ప్రధాన పాత్ర అన్నారు. దేశంలో మొదట నుంచి బీసీలకు మంచి స్థానం ఉండేదన్నారు. బంగారు పాలెం సంస్ధానాన్ని పరిపాలించింది కూడా బీసీలనే గుర్తుచేశారు. కుండలు తయారు చేసే చక్రం, నాగలి కనిపెట్టిన వడ్రంగి కులస్తులే మొదటి శాస్త్రవేత్తలన్నారు. 

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర చేసి నేటితో 15 ఏళ్లు పూర్తైయిందన్నారు. రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంతో తనకు 50 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, రాజశేఖర్‌రెడ్డి ఓ అడుగు వేస్తే, జగన్‌ రెండు అడుగులు వేయాలనే తపన ఉన్న వ్యక్తి అని తెలిపారు. బీసీ వర్గాల సమస్యలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి అధ్యయం చేస్తామన్నారు. బీసీ మేలు చేసే ప్రతి అడుగులో అడుగేస్తా అని హామీ ఇచ్చారు.

14 ఏళ్లుగా బీసీలకు అన్యాయం

రాష్ట్రంలోని 2 కోట్ల బీసీల కుటుంబాలు బాగుండాలని కోరుకున్నది ఒక్క వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. వైఎస్సార్‌ బీసీలకు ఫీజు రియింబర్స్‌ మెంట్‌ ఇస్తే చంద్రబాబు వాటిని రూపుమాపారని విమర్శించారు. 14 ఏళ్లుగా చంద్రబాబు బీసీలను మోసగిస్తూనే ఉన్నారన్నారు. ఒక్కసారి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అవకాశం ఇస్తే.. అందరి భవిష్యత్‌ బాగుపడుతుందన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబుకు మానసిక స్థితి బాగలేకపోవడంతో రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబును గద్దెనెక్కించి తప్పు చేశామని, మరోమారు ఆ తప్ప్పు చేయోద్దని అనిల్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top