వేంకటేశ‍్వరస్వామికి లారీ బహుకరణ | Ashok Leyland gifts Lorry to Lord Venkateswara | Sakshi
Sakshi News home page

వేంకటేశ‍్వరస్వామికి లారీ బహుకరణ

Apr 1 2017 11:13 AM | Updated on Sep 5 2017 7:41 AM

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అశోక్‌ లేలాండ్‌ కంపెనీ యాజమాన్యం లారీని బహూకరించింది.

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అశోక్‌ లేలాండ్‌ కంపెనీ యాజమాన్యం లారీని బహూకరించింది. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కే దాసరి శనివారం శ్రీవారిని దర్శించుకున‍్న అనంతరం ఆలయం ఎదుట లారీకి పూజలు నిర్వహించారు. లారీకి సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు అందజేశారు. వాహనం విలువ రూ.18.88 లక్షలుగా వినోద్‌ కే దాసరి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement