'అశోక్ బాబు వైఖరి మార్చుకోవడం సరికాదు' | ashok babu play double game, say apngo leader dev raj | Sakshi
Sakshi News home page

'అశోక్ బాబు వైఖరి మార్చుకోవడం సరికాదు'

Jan 9 2014 6:35 PM | Updated on Sep 2 2017 2:26 AM

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వైఖరిపై అనంతపురం జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు దేవ్ రాజ్ మండిపడ్డారు.

అనంత: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వైఖరిపై అనంతపురం జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు దేవ్ రాజ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన బిల్లుపై అశోక్ బాబు అకస్మాత్తుగా తన పంథా మార్చుకోవడంపై మర్మమేమిటని ప్రశ్నించారు. ఇన్నాళ్లు తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన అశోక్ బాబు..ఇప్పుడు అసెంబ్లీ లో చర్చించాలనడం సరికాదన్నారు. అసలు అసెంబ్లీలో టి.బిల్లుపై చర్చ మొదలవడమే బాధాకరమన్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకుండా అడ్డుకుంటున్న పార్టీలు, ప్రజాప్రతినిధులు విభజనకు అనుకూలంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారని అశోక్ బాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

 

బిల్లు వచ్చి ఇన్ని రోజు లైనా చర్చకు నోచుకోకపోవడం విచారకరమని అశోక్ బాబు మాట్లాడటంపై విమర్శలకు తావిస్తోంది. ఇన్నాళ్లు రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించిన ఆయన.. తన వైఖరి మార్చుకోవడమేమిటని ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘ నేతలే ప్రశ్నిస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement