భార్య చెల్లెలు.. అందులోనూ బాలింత.. అయిదు నెలల శిశువుకు త ల్లైన మరదలుపైనే అత్యాచారానికి యత్నించాడు ఓ
పెదవాల్తేరు : భార్య చెల్లెలు.. అందులోనూ బాలింత.. అయిదు నెలల శిశువుకు త ల్లైన మరదలుపైనే అత్యాచారానికి యత్నించాడు ఓ ప్రబుద్ధుడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం... చినవాల్తేరు కొయ్యవీధిలో నివాసముంటున్న తోకడ శ్రీను(38) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలోని రజకవీధికి చెందిన యువతితో శ్రీనుకు వివాహమైంది. అతనికి ఓ మరదలు ఉంది. ఆమెకు విజయనగరానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. గర్భిణి కావడంతో తొమ్మిది నెలల కిందట చినవాల్తేరు రజకవీధిలోని పుట్టింటికి వచ్చింది. అయిదు నెలల కిందట ఓ శిశువుకు జన్మనిచ్చింది.
బలింతైన ఆమెపై శ్రీను కన్నుపడింది. సోమవా రం రాత్రి మరదలు ఇంటికి వెళ్లాడు. ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి యత్నిం చాడు. తప్పించుకునేందుకు యత్నించడంతో కర్కశంగా దాడి చేసి పైశాచికంగా ప్రవర్తించా డు. ఇంతలో చుట్టుపక్కల వారు రావడంతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.