9న తిరుపతి రానున్న ఆర్మీ చీఫ్‌ రావత్‌ | Army Chief Rawat Coming Tirupati on 9th | Sakshi
Sakshi News home page

9న తిరుపతి రానున్న ఆర్మీ చీఫ్‌ రావత్‌

Mar 2 2017 4:20 AM | Updated on Sep 5 2017 4:56 AM

9న తిరుపతి రానున్న ఆర్మీ చీఫ్‌ రావత్‌

9న తిరుపతి రానున్న ఆర్మీ చీఫ్‌ రావత్‌

తిరుపతిలో ఈనెల 9న మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌

తిరుపతి సిటీ: తిరుపతిలో ఈనెల 9న మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హాజరు కానున్నారని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్‌.రెడ్డి తెలిపారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి బైపాస్‌ రోడ్డులోని పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగే ఈ సమావేశంలో మాజీ సైనికులతో పాటు పలువురు సైనికాధికారులు పాల్గొంటారని చెప్పారు.

వీరి కోసం రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మనోహర్‌ రెడ్డి, ఎస్‌.గోపాల్, రవీంద్రబాబు, హరినాథ్‌ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement