శాసనమండలిలో అమరావతిపై చర్చ  | AP Legislative Council Took up Short Duration Discussion on Amaravati | Sakshi
Sakshi News home page

శాసనమండలిలో అమరావతిపై చర్చ 

Dec 16 2019 7:40 PM | Updated on Dec 16 2019 8:19 PM

AP Legislative Council Took up Short Duration Discussion on Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: ‘రాజధాని విషయంలో తెలుగుదేశం సభ్యుల మాటల్లో వారు దోచుకున్నది, ఆక్రమించుకున్నది ఏమైపోతుందో అన్న భయం వారిలో కనబడుతోంది’  అని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం రాజధాని అమరావతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం చట్టాలను విస్మరించి భూములు లాక్కుంది. చట్ట ప్రకారం అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయకూడదు. మొదట్లో సీఆర్‌డీఏ పరిధి 217 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అయితే చంద్రబాబు బంధువు కోసం పరిధిని పెంచి 498 ఎకరాలు కేటాయించారు. 

ఎకరం రూ.లక్ష చొప్పున చంద్రబాబు తన బంధువుకు కేటాయించారు. ఇక  తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం 102 అడుగులు పిల్లర్లు వేశారు. దీనివల్ల ఖర్చు పెరిగింది.  అసైన్డ్‌ భూముల కొనుగోళ్లను రద్దు చేసేందుకు కేబినెట్‌ నిర‍్ణయించింది. గతంలో శివరామకృష్ణ కమిటీ విజయవాడ, గుంటూరు మధ్య అతి సారవంతమైన భూములు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాంతం రాజధానికి అనువైనది కాదని తెలిపింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదికను పరిశీలిస్తాం. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం ఉంటుంది.’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement