భారీగా పెరిగిన ఏపీ ప్రభుత్వ ఆదాయం! | AP government revenue massive increase ! | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ఏపీ ప్రభుత్వ ఆదాయం!

Oct 28 2014 7:27 PM | Updated on Aug 18 2018 9:09 PM

భారీగా పెరిగిన ఏపీ ప్రభుత్వ ఆదాయం! - Sakshi

భారీగా పెరిగిన ఏపీ ప్రభుత్వ ఆదాయం!

రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది.

హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది.  గత ఏడాది  మొదటి రెండు  క్వార్టర్లలో  కమర్షియల్ ట్యాక్స్‌ 11 వేల 300 కోట్ల రూపాయలు వసూలు అయింది. ఈ ఏడాది 12, 881 కోట్ల రూపాయలు వసూలైంది. ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది 1536 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 1700 కోట్ల రూపాయలు వసూలైంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాది 652 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 1800 కోట్ల రూపాయలు వసూలైంది.

రవాణా శాఖ గత ఏడాది ఆదాయం 709 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 888 కోట్ల రూపాయలు వసూలైంది.  గనుల శాఖ ఆదాయం గత ఏడాది 361 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 420 కోట్ల రూపాయలు వసూలైంది.  మొత్తం రెండు త్రైమాసికాల్లో  గత ఏడాది 14 వేల 737 కోట్ల రూపాయలు వసూలు  కాగా, ఇప్పుడు 17 వేల 329 కోట్లు వసూలు అయ్యాయి.
**

Advertisement
 
Advertisement
Advertisement