31 మందే విద్యావలంటీర్ల నియామకం | Andhra Pradesh Rajiv Vidya Mission Recruitment | Sakshi
Sakshi News home page

31 మందే విద్యావలంటీర్ల నియామకం

Oct 3 2013 4:18 AM | Updated on Jul 11 2019 5:12 PM

‘ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్య అందిస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించా లి..’

 ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ‘ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్య అందిస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించా లి..’ అని పాఠశాలల పునఃప్రారంభంలో రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం), విద్యాశాఖలు బడిబాట నిర్వహిం చాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. బోధించడానికి ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి. కనీసం విద్యావలంటీర్లను కూడా నియమించలేదు. ఫలితంగా జిల్లాలో 200లకుపైగా పాఠశాలలు మూతపడ్డాయి. కొన్ని పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే ఉండటంతో బోధన నామమాత్రంగానే ఉంది. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయులు లేక చదువుల చతికిల పడుతున్నాయి.
 
 కేవలం 31 వీవీల పోస్టులు మంజూరు
 జిల్లాలో 200 పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతబడ్డాయి. వీటితోపాటు 1000 వరకు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది 3,638 మంది వి ద్యావాలంటీర్లు నియమించి విద్యాబోధన చేయించారు. ఈ ఏడాది సెప్టెంబర్  పూర్తయినా విద్యావాలంటీర్లు(అకాడిమిక్ ఇన్‌స్టక్టర్‌ల) నియామకం కాలేదు. ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు అధికారి జిల్లాకు కేవలం 31 మందిని నియమించుకోవాలని జిల్లా ఆర్వీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో వీవీకి నెలకు రూ.5వేలు, బీఎడ్, డీఎడ్ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు.
 
 వీరితో విద్యార్థులు చదువులు ఎలా సాగుతాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క తిర్యాణి మండలంలోనే 30 వరకు ఒక్క రు కూడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఉన్నాయి. వీవీల కేటాయింపుపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 వేల పోస్టులు అవసరం ఉండగా తక్కువ పోస్టులు కేటాయించడంతో సర్కారు బడులు ఈ విద్యాసంవత్సరం మూతబడులుగానే ఉండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు డ్రాపౌట్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ నిధులు రూ.10 లక్షలు ఉండడంతో 31 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లాలో మూతపడ్డ పాఠశాలల్లో వీవీలను నియమించి విద్యార్థుల చదువులు ఆగిపోకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement