రాష్ట్రం ఇంకా కలిసే ఉంది: జైరాం | andhra pradesh is still united, says jairam ramesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రం ఇంకా కలిసే ఉంది: జైరాం

Feb 28 2014 2:13 PM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్రం ఇంకా కలిసే ఉంది: జైరాం - Sakshi

రాష్ట్రం ఇంకా కలిసే ఉంది: జైరాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికి ఇంకా కలిసే ఉందని, ఇంకా విభజన ప్రక్రియ పూర్తి కాలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికి ఇంకా కలిసే ఉందని, ఇంకా విభజన ప్రక్రియ పూర్తి కాలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు చెప్పే సందర్భంలో ఏయే రాష్ట్రంలో ఎంతమందికి వివిధ పథకాల కింద లబ్ధి చేకూరుతుందని వివరిస్తున్నప్పుడు ఆయనీ విషయం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్లో 19వేల మందికి లబ్ధి కలుగుతుందని జైరాం రమేష్ చెబుతున్నప్పుడు కొంతమంది మీడియా ప్రతినిధులు తెలంగాణకా.. సీమాంధ్రకా అని అడిగినప్పుడు జైరాం రమేష్ ఈ విధంగా స్పందించారు. రాష్ట్రం ఇంకా సమైక్యంగానే ఉందని, విభజనకు సమయం ఉందని అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement