ఆమ్వే సీఈఓ ఆటకట్టు | Amway India CEO Arrested by Andhra Police | Sakshi
Sakshi News home page

ఆమ్వే సీఈఓ ఆటకట్టు

May 28 2014 4:41 AM | Updated on Sep 2 2017 7:56 AM

ఆమ్వే సీఈఓ ఆటకట్టు

ఆమ్వే సీఈఓ ఆటకట్టు

గొలుసుకట్టు పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ నమోదైన కేసులో ‘ఆమ్వే’ సంస్థ సీఈఓ విలియం స్కాట్ పింక్నీని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.

విలియం స్కాట్ పింక్నీని గుర్గావ్‌లో అరెస్టు చేసి కర్నూలుకు తరలించిన పోలీసులు  
15 రోజుల రిమాండ్‌కు ఆదేశించిన మేజిస్ట్రేట్

 
సాక్షి, కర్నూలు: గొలుసుకట్టు పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ నమోదైన కేసులో ‘ఆమ్వే’ సంస్థ సీఈఓ విలియం స్కాట్ పింక్నీని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎస్పీ రఘురామిరెడ్డి మీడియా ఎదుట ఆయనను ప్రవేశపెట్టారు. కర్నూలుకు చెందిన న్యాయవాది జగన్నాథ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నగరంలోని రెండవ పట్టణ పోలీసులు 2013 డిసెంబర్‌లో ప్రైజ్‌చిట్స్, మనీ సర్క్యులేషన్ వ్యాపారాల నిషేధ చట్టం, మోసం, దోపిడీ నేరాల కింద.. ఆమ్వేపై కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. ‘‘ఆమ్వే ఇండియా ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా మనీ సర్క్యులేషన్ స్కీమ్ (గొలుసు కట్టు పథకం) పేరిట వ్యాపారం కొనసాగిస్తూ.. కంపెనీ ఉత్పత్తుల వ్యాపారం ముసుగులో కుట్రపూరితమైన మోసానికి పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మంది అమాయకులు ఈ కంపెనీ మాయలో జేబులు గుల్ల చేసుకున్నారు’’ అని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.
 
 గుర్గావ్‌లో అరెస్టు
 కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం న్యూఢిల్లీలోని గుర్గావ్‌లో ఉన్న ఆమ్వే కార్యాలయంలో ఆ సంస్థ సీఈవో, అమెరికాకు చెందిన విలియం స్కాట్‌ను ప్రత్యేక పోలీసుల బృందం అరెస్టు చేసి కర్నూలుకు తరలించింది. విలియంతో పాటు కర్నూలుకు చెందిన వినయ్‌కుమార్, ఎర్రం నాయుడు, నంద్యాలకు చెందిన వెంకటేశ్వర్లుపైనా కేసు నమోదైంది. కర్నూలులో ఆమ్వే కంపెనీకి చెందిన కార్యాలయాలను, ఉత్పత్తుల నిల్వకు ఉపయోగించే గోదాములను, వస్తువులను సీజ్ చేస్తామని.. కంపెనీ లావాదేవీలను తనిఖీ చేస్తామని ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో ధనవంతులు కావచ్చని ప్రలోభపెట్టే ఇలాంటి సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశం అనంతరం విలియంను డోన్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. అక్కడి నుంచి అతడిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
 
 ఈ వ్యాపారం చట్ట వ్యతిరేకం: ఎస్పీ
 ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమ్‌వే సంస్థ చేస్తున్న వ్యాపారం చట్ట వ్యతిరేకమని దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ కోర్టులు తీర్పునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2006 సెప్టెంబర్ 24న సీఐడీ పోలీసులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, నిజామాబాద్, కర్నూలు, కాకినాడ, గుంటూరు, నెల్లూరులలోని ఆమ్‌వే కార్యాలయాలపై దాడులు చేసి డాక్యుమెంట్లను, వస్తువులను సీజ్ చేశారు. దీనిపై ఆమ్‌వే సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్‌లను దాఖలు చేయగా.. ఆమ్‌వే సంస్థ సాగిస్తున్న వ్యాపారం చట్ట విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. అయినప్పటికీ ఆ సంస్థ తన వ్యాపారాలను ఇంటర్నెట్ ద్వారా కొనసాగిస్తోంది. తక్కువ సమయంలో ధనవంతులు కావచ్చని ప్రలోభపెట్టే ఇలాంటి సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశం అనంతరం విలియంను డోన్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ఎదుట హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. అక్కడి నుంచి అతడిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
 
 ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు: ఆమ్వే సంస్థపై మన రాష్ట్రంతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్‌లోనూ పలు కేసులు నమోదయ్యాయి. మన రాష్ట్రంలో ఈ సంస్థపై నమోదైన కేసుల్లో విలియంను అరెస్టు చేసేందుకు ‘ప్రిజినర్ ట్రాన్సిట్ వారెంట్’ను జారీ చేయాలని సీఐడీ పోలీసులు ప్రయత్నిం చారు. ఆలోపు ఆయన ముందస్తు బెయిల్ పొందడంతో తప్పించుకున్నారు. ఇంటర్నెట్‌ద్వారా మల్టీలెవల్ మార్కె టింగ్ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని 2007లో కాలి ఫోర్నియా కోర్టులో ఓ కేసు నమోదవగా.. ఈ కేసుకు సంబం ధించి 2010 నవంబర్ 3న 5.6 కోట్ల డాలర్లను కంపెనీ రాజీ కుదుర్చుకుంది.
 
  కాగా, తమ వ్యాపారాలు చట్టబద్ధంగా చేస్తు న్నామంటూ ఆమ్వే సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడు దల చేసింది. భారత్‌లో డెరైక్ట్ సెల్లింగ్ వ్యాపారాలపై ప్రభు త్వం స్పష్టత ఇవ్వాలని ఆ ప్రకటనలో కోరింది. 1998లో భారత్‌లో రూ.200 కోట్లతో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించిన ఆమ్వే సంస్థ అనతి కాలంలోనే వేల కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుందని తెలిపింది. దేశ వ్యాప్తంగా తమ సంస్థకు 135 బ్రాంచీలున్నాయని, ఐదువిభాగాల్లో 140 పైగా ఉత్పత్తులను తాము చైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయిస్తున్నామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement