రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి..

సాక్షి, వైఎస్సార్ : ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా రైతన్నకు పోలీసు రక్షణ కల్పించేలా ఏర్పాటు చేసింది. ఈ మేరకు కడప జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా డీఎస్పీ కార్యాలయంలో రైతన్నకు రక్షణ కల్పించేందుకు ఫిర్యాదు విభాగం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటారు. వీటితో పాటు మహిళలకు సంబంధించి ప్రత్యేక కౌన్సిలింగ్ విభాగాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అన్బురాజన్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి