రోడ్డు ప్రమాదం వల్లే అమ్మను పోగొట్టుకున్నా.. | allagadda ysrcp mla bhuma akhila priya speech in ap assemly over road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం వల్లే అమ్మను పోగొట్టుకున్నా..

Dec 22 2014 12:15 PM | Updated on Apr 4 2019 3:02 PM

రోడ్డు ప్రమాదం వల్లే అమ్మను పోగొట్టుకున్నా.. - Sakshi

రోడ్డు ప్రమాదం వల్లే అమ్మను పోగొట్టుకున్నా..

రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతుండటంపై ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతుండటంపై ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ  ఎమ్మెల్యే  భూమా అఖిల ప్రియ ఆందోళన వ్యక్తం చేశారు.  రోడ్డు ప్రమాదం కారణంగా తాను తన తల్లిని పొగొట్టుకున్న విషయాన్ని ఆమె సోమవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. తొలిసారి సభలో మాట్లాడిన అఖిల ప్రియ...  రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  మొక్కుబడి సమాధానం కాకుండా చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారి వివరాలతో సహా సభలో ప్రస్తావించారు.

Advertisement
 
Advertisement
Advertisement