ఆంటోనీ సారథ్యంలో ఏడుగురితో తెలంగాణపై మంత్రుల బృందం | AK Antony to lead GoM on Telangana comprising of seven | Sakshi
Sakshi News home page

ఆంటోనీ సారథ్యంలో ఏడుగురితో తెలంగాణపై మంత్రుల బృందం

Oct 8 2013 7:58 PM | Updated on Sep 27 2018 5:59 PM

ఆంటోనీ సారథ్యంలో ఏడుగురితో తెలంగాణపై మంత్రుల బృందం - Sakshi

ఆంటోనీ సారథ్యంలో ఏడుగురితో తెలంగాణపై మంత్రుల బృందం

తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని కుదించారు.

తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని కుదించారు. గతంలో పది మంది మంత్రులను ఈ బృందంలో నియమించగా, ఇప్పుడు ఏడుగురితో మాత్రమే ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త బృందానికి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని చైర్మన్గా ఖరారు చేశారు.

ఆర్థిక మంత్రి చిదంబరం, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్, చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్, ప్రధాని కార్యాలయ శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి ఈ బృందంలోని ఇతర సభ్యులుగా ఉంటారు.

Advertisement
 
Advertisement
Advertisement