ఉత్సాహంగా తైక్వాండో పోటీలు | Active taekwondo competitions | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా తైక్వాండో పోటీలు

Jan 6 2014 12:55 AM | Updated on Mar 28 2018 10:59 AM

స్థానిక బంధన్ ఫంక్షన్ హాలులో ఆదివారం తైక్వాండో అండర్-14, 17 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి.

ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్:  స్థానిక బంధన్ ఫంక్షన్ హాలులో ఆదివారం తైక్వాండో అండర్-14, 17 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. వందల సంఖ్యలో క్రీడాకారులు పోటీపడ్డారు. ఎమ్మెల్యే కేఎల్లార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడు తూ..రాష్ట్ర, జాతీయస్థాయి తైక్వాండో క్రీడ ల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తైక్వాండోలో తర్ఫీదు ఇవ్వడానికి స్టేడియం ఏర్పాటు కు కృషి చేస్తానన్నారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి నందం గణేశ్, మండల అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మిడి రాఘవరెడ్డి, జిల్లా కార్యదర్శి కొంతం అంజిరెడ్డి, బీ బ్లాకు మహిళ అధ్యక్షురాలు అనురాధ, పంచాయతీ సభ్యులు కొత్తకొండ వెంకటేష రాంపల్లి జగదీష్‌గౌడ్, మీసాల సుధాకర్, స్టీవెన్, అబ్బగోని మీనాకుమారి, సగ్గు సాయికుమార్, నాయకులు సల్లూ రి నర్సింగ్‌రావ్, నవీన్, పల్లపు రమేష్, నరేందర్, శ్రీనివాస్‌రెడ్డి, తైక్వాండో జిల్లా కార్యదర్శి కేపీ హనుమంతు, కోచ్‌లు అమర్‌సింగ్, రాజు, సుధీర్, బీరేందర్‌సింగ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
 
 పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమే
 శామీర్‌పేట్ రూరల్: పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ నెల 7 నుంచి 10 వరకు గుజరాత్‌లోని మేహసన్‌లో జరిగే 26వ అండర్-19 నెట్‌బాల్ చాంపియన్‌షిప్ జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనడానికి తరలివెళ్తున్న  క్రీడాకారులకు కేఎల్లార్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఆదివారం స్థానిక మినీ స్టేడియంలో క్రీడా దుస్తులు, బూట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటము లు సహజమన్నారు. ఓటమి గెలుపునకు పునాదిలాంటిదని, గెలుపొందడానికి ప్రతి క్రీడాకారుడు శ్రమించాలన్నారు. జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షిం చారు. క్రీడల్లో రాణించిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్‌రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సమ్మయ్య, జాతీయస్థాయి నెట్‌బాల్ చాంపియన్‌షిప్ ఇన్‌చార్జి మురళీకృష్ణ, శామీర్‌పేట్ ప్రధానోపాధ్యాయురాలు మనోరంజిత, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు దానయ్య, నెట్‌బాల్ శిక్షకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement