పెంచలకోన పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా సుమో బోల్తాపడి 8మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాపూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ) : పెంచలకోన పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా సుమో బోల్తాపడి 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం జరిగింది. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విమంగా ఉండడంతో వారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురికి రాపూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. క్షతగాత్రులందరూ వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గం సుండుపల్లి సమీపంలోని జంగాలపల్లి గ్రామానికి చెందినవారు.