వడదెబ్బతో ఎనిమిదిమంది మృతి | 8 died due to Sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఎనిమిదిమంది మృతి

May 25 2015 5:08 PM | Updated on Sep 3 2017 2:40 AM

వైఎస్సార్ జిల్లాలోని వేరువేరు మండలాలలో సోమవారం వడదెబ్బతో ఎనిమిదిమంది మృత్యువాత పడ్డారు.

వైఎస్సార్ జిల్లా :  వైఎస్సార్ జిల్లాలోని వేరువేరు మండలాలలో సోమవారం వడదెబ్బతో ఎనిమిదిమంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..  ఓబులవారిపల్లెలోని పలు గ్రామాల్లో సోమవారం వడదెబ్బకు నలుగురు మృతిచెందారు. మండలంలోని బేస్తపల్లె గ్రామానికి చెందిన ఏరేటి గంగమ్మ(58), తిరుమలశెట్టి గ్రామానికి చెందిన రమణయ్య(55), కుర్లకుంటలో అమ్మణమ్మ(60), గోవిందమ్మపల్లె గ్రామంలో మిణుగు శంకరయ్య(34) వడదెబ్బతో మృతిచెందారు.

అదేవిధంగా రైల్వేకోడూరులోని పలు గ్రామాల్లో సోమవారం వడదెబ్బకు నలుగురు మృతిచెందారు. మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన దారా సుబ్బయ్య(60), చెట్టుగుంట గ్రామానికి చెందిన వలీబాషా(72), అనంతరాజుపేటకు చెందిన ఓరుగంటి కిషోర్(29), బలిజవీధికి చెందిన పద్మావతమ్మ(70) వడదెబ్బకు మృతిచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement