రామచంద్రాపురంలోని దాక్షారామం రోడ్డులో గల ఓ ఇంట్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది.
తూర్పుగోదావరి(రామచంద్రాపురం): రామచంద్రాపురంలోని దాక్షారామం రోడ్డులో గల ఓ ఇంట్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. పడాల వేణు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగినట్లు శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. ఇంట్లో ఉన్న 70 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వేణు సోదరుడు తెలిపాడు. వేణు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి చుట్టు పక్కల ఉన్న బంధువులు ఆ సమాచారాన్ని పోలీసులకు, యజమాని వేణుకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.