ఏపీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ | 50 thousand special allowance for andhra pradesh mlas | Sakshi
Sakshi News home page

ఏపీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్

Mar 2 2017 12:52 PM | Updated on Mar 23 2019 9:03 PM

ఏపీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ - Sakshi

ఏపీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ శాసన సభ కొత్త భవనం ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ శాసన సభ కొత్త భవనం ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కొత్త అసెంబ్లీని గురువారం ఉదయం ప్రారంభించిన చంద్రబాబు, తన ఛాంబర్‌లో ప్రవేశించి, ఆపై మొట్టమొదటి పైలు మీద సంతకం చేశారు. 
 
తొలిసారిగా సొంత అసెంబ్లీ భవనంలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు అదనంగా ఇస్తామన్న 50 వేల రూపాయల భత్యం ఫైలు మీద ఆయన సంతకం చేశారు. దాంతో మొత్తం ఎమ్మెల్యేలందరికీ ఈ కొత్త భవనం తాలూకు భత్యం అందనుంది. కాగా అసెంబ్లీ సమావేశాలకు మొత్తం 12 జిల్లాల నుంచి 1200 మంది పొలీసులు, 50 మంది డీఎస్పీలు అందుబాటులో ఉండనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement