చీకటి కోణాలు ఇంకెన్నో .. | 5 Arrested for blackmailing college correspondent | Sakshi
Sakshi News home page

చీకటి కోణాలు ఇంకెన్నో ..

Sep 9 2014 11:10 AM | Updated on Aug 21 2018 5:46 PM

చీకటి కోణాలు ఇంకెన్నో .. - Sakshi

చీకటి కోణాలు ఇంకెన్నో ..

బ్లాక్‌మెయిలింగ్ కేసులో అరెస్ట్ అయిన టీవీ యాంకర్ హర్షవర్దన్, మరో నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో సోమవారం వారిని ఏలూరులోని సబ్‌జైలుకు తరలించారు.

* యాంకర్ హర్షవర్దన్ ముఠా ఉచ్చులో మరికొందరు
* పోలీసులకు మరిన్ని ఫిర్యాదులు.. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ?
*లోతుగా పరిశోధిస్తున్న పోలీసులు


సాక్షి, ఏలూరు : బ్లాక్‌మెయిలింగ్ కేసులో అరెస్ట్ అయిన టీవీ యాంకర్ హర్షవర్దన్, మరో నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో సోమవారం వారిని ఏలూరులోని సబ్‌జైలుకు తరలించారు. వీరిని విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వీరి అరాచకాలు చాలానే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. తామూ వారి బెదింపులకు లొంగి డబ్బులు పోగొట్టుకున్నామంటూ కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారని, వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో లోతుగా పరిశోధన చేస్తే ఇంకెన్నో చీకటికోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. నిందితులు ఇంతవరకూ ఇలా ఎంతమందిని బెదిరించా రు. ఇంకేమైనా నేరాలకు పాల్పడ్డారా? వీరితో పాటు ఇంకెవరు ఉన్నారు. ఎవరెవరు సహరిస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.  
 
సీడీల్లో ఏముంది ?
ఫాదర్ బాలను రూ.5 కోట్లు డిమాండ్ చేయడానికి నిందితులు సాహసించడంపై జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. వారి వద్ద అంత విలువైన సమాచారం ఏముందనే దానిపై చర్చ జరుగుతోంది. గతంలోనూ ఫాదర్ బాలకు ఇలాంటి బెదిరింపులు వస్తే ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయితే తాజా వ్యవహారంలో తమ వద్ద కొన్ని సీడీలు ఉన్నాయని, తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే వాటిని చానల్స్‌లో ప్రచారం చేస్తామని నిందితులు బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

దీంతో కోట్లాది రూపాయల విలువచేసే విషయం ఆ సీడీల్లో ఏముందనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో పలువురు ప్రభుత్వాధికారుల వద్దకు అమ్మాయిలను పం పించి, వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా చిత్రీకరించి అధికారుల నుంచి పెద్దమొత్తంలో సొమ్ము వసూ లు చేశాడనే ఈ నిందితుల్లో ఒకరిపై అరోపణలున్నాయి. ఈ కోణంలో పో లీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
 
ఆ నేత ఎవరు?
నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి తెలుగుదేశం పార్టీ నేతలు అండగా నిలవడంపైనా విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హర్షవర్దన్‌కు క్రైంపోలీస్‌స్టేషన్ వద్దే ధైర్యం చెప్పిన తూర్పుగోదావరి జిల్లా నేత ఎవరనేదానిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నిందితులతో పోలీసుల అనుమతి లేకుండా డీఎస్పీ ఉండగానే ఆ నేత అంతసేపు మాట్లాడారంటే దానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరం వెనుక చీకటి కోణాలు వెలికితీస్తే నిందితుల వెనుక ఎవరున్నారనే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement