ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన ఆటో: ముగ్గురు మృతి | 3 people killed in lorry - car accident at west godavari district | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన ఆటో: ముగ్గురు మృతి

Sep 13 2013 8:46 AM | Updated on Sep 1 2017 10:41 PM

పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఈ రోజు తెల్లవారుజామున లారీ - ఆటో ఢీ కొన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్డు వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఆగి ఉన్నలారీని ఆటో ఢీ కొట్టింది. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

అలాగే ఆ ప్రమాదంలో మరణించిన  మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. అనంతరం మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అలాగే లారీని కూడా పోలీస్స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తెనపల్లి నుంచి కాకినాడ వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement