స్కూల్ బస్సు బోల్తా.. ముగ్గురికి గాయాలు


 వేటపాలెం : ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు శిథిలావస్థకు చేరిన బస్సులు తిప్పుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అనుభవం లేని డ్రైవర్లు తక్కువ జీతాలకు వస్తుండంతో వారిని స్కూల్ బస్సులకు డ్రైవర్లుగా నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూలు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. వేటపాలెం పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూలు బస్సు శనివారం బొచ్చులవారిపాలెం -ఊటుకూరి సుబ్బయ్యపాలెం గ్రామాల మధ్య  అదుపుతప్పి బోల్తా కొట్టగా ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. స్కూల్ యాజమాన్యం గాయాలైన చిన్నారులకు గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయించారు. బోల్తాకొట్టిన బస్సును వెంటనే రోడ్డుపైకి చేర్చి ఏమీ జరగనట్లు సర్దుబాటు చేశారు. ఆ తర్వాత వెంటనే పాఠశాలకు సెలవు ఇచ్చి చిన్నారులను ఇళ్లకు పంపించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top