క్వారీ గుంతలో పడి ఇద్దరు మృతి | 2died in quarry pit | Sakshi
Sakshi News home page

క్వారీ గుంతలో పడి ఇద్దరు మృతి

Mar 19 2017 7:33 PM | Updated on Sep 5 2017 6:31 AM

క్వారీ గుంతలో పడి ఇద్దరు మృతి

క్వారీ గుంతలో పడి ఇద్దరు మృతి

క్వారీ గుమ్ము (గుంత)వద్దకు స్నానానికి వెళ్లి ఆదివారం ఇద్దరు మృతి చెందారు.

పొందూరు (శ్రీకాకుళం జిల్లా): పొందూరు పంచాయతీ పరిధిలోని రాపాక కూడలి వద్ద ఉన్న క్వారీ గుమ్ము (గుంత)వద్దకు స్నానానికి వెళ్లి ఆదివారం ఇద్దరు మృతి చెందారు. స్థానిక ఇటుక బట్టీలో పనిచేసే నాగవరపు వెంకటరమణ(40), కలివరపు రాజు (13), మరో చిన్నారి దుర్గతో కలిసి స్నానానికి వెళ్లారు.

వెంకటరమణ రాజును తన వీపుపై ఎక్కించుకుని గుమ్ములోని నీటి లోపలికి దిగగా ప్రమాదవశాత్తు అడుగు భాగానికి వెళ్లిపోయారు. ఎంతసేపటికీ వారు  పైకిరాకపోవడంతో చిన్నారి దుర్గ అక్కడి గ్రామస్తులకు విషయం చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ సందీప్‌ గజ ఈతగాళ్లను పిలిపించి 30 అడుగుల లోతులో ఉన్న వారి ఇద్దరి మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement