రోడ్డు ప్రమాదంలో తాత, మనవడు మృతి | 2 died in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తాత, మనవడు మృతి

Jul 26 2015 6:40 PM | Updated on Sep 3 2017 6:13 AM

ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

గుంటూరు : ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. అమరావతి మండలం అత్తులూరు గ్రామానికి చెందిన హనుమంతయ్య(46) తన చెల్లెలు ఇంటికి వస్తుండగా.. గ్రామ శివారులో ట్రాక్టర్ ఢీకొట్టింది.

దీంతో బైక్ పై ఉన్న హనుమంతయ్య, ఆయన మనవడు కృష్ణ చైతన్య(4) అక్కడికక్కడే మృతిచెందగా.. కొడుకు హనుమంతరావు(26)కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

పోల్

Advertisement