186రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | 186 PrajaSankalpaYatra Started | Sakshi
Sakshi News home page

186రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Jun 11 2018 10:12 AM | Updated on Jul 25 2018 4:07 PM

186 PrajaSankalpaYatra Started - Sakshi

సాక్షి, కొవ్వూరు : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన కొవ్వూరు నియోజకవర్గంలోని గౌరపల్లి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నేతలు పాదయాత్రలో ఆయనతో పాటు అడుగులు చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను రాజన్న బిడ్డతో వెల్లబోసుకుంటున్నారు. వారికి భరోసా అందిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. నేటి ప్రజాసంకల్పయాత్ర గౌరపల్లి నుంచి పసివేదల, నందమూరు క్రాస్‌ రోడ్డు, కొవ్వురూ ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా విజయ్‌ విహార్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement