15 మంది మట్కా బీటర్లు అరెస్ట్ | 15 matka beaters arrested in ananthapuram distirict | Sakshi
Sakshi News home page

15 మంది మట్కా బీటర్లు అరెస్ట్

Aug 7 2015 1:48 PM | Updated on Oct 16 2018 2:30 PM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జూదాలు నిర్వహిస్తున్న 15 మంది మట్కా బీటర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

కళ్యాణదుర్గం(అనంతపురం): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జూదాలు నిర్వహిస్తున్న 15 మంది మట్కా బీటర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో మట్కా బీటర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement