సత్ప్రవర్తన కింద 90 ఏళ్ల వృద్ధురాలికి కారాగారవాసం నుంచి విముక్తి లభించింది.
90 ఏళ్ల మహిళా ఖైదీకి విముక్తి
Jan 26 2016 1:09 PM | Updated on Sep 3 2017 4:21 PM
రాజమండ్రి క్రైమ్: సత్ప్రవర్తన కింద 90 ఏళ్ల వృద్ధురాలికి కారాగారవాసం నుంచి విముక్తి లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం 124 మంది ఖైదీలు విడుదలయ్యారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీరిని జైలు అధికారులు విడుదల చేశారు. వీరిలో 14 మంది మహిళలు కాగా, 110 మంది పురుషులు ఉన్నారు. వీరిలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వృద్ధురాలు రుక్మిణమ్మ (90) కూడా ఉంది. కోడలు హత్య కేసులో రుక్మిణమ్మ 13 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. కాగా, విడుదలైన ఖైదీల్లో హర్షం వ్యక్తం అయింది.
Advertisement
Advertisement