నిర్భయలాంటి చట్టాలెన్ని వచ్చిన కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.. కొందరి మృగాళ్ల చేతిలో చిన్నారులు నలిగిపోతూనే ఉన్నారు.
కోదాడ అర్బన్, న్యూస్‌లైన్
నిర్భయలాంటి చట్టాలెన్ని వచ్చిన కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.. కొందరి మృగాళ్ల చేతిలో చిన్నారులు నలిగిపోతూనే ఉన్నారు. ఓ లారీ క్లీనర్ మాయమాటలు చెప్పి ఓ చిన్నారిని లొంగతీసుకుని నాలుగు రోజుల పాటు అత్యాచారం జరిపిన ఘటన కోదాడలో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మైనర్ తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఈ నెల 6న ఇంటి నుంచి బయలుదేరి ఖమ్మం వెళ్లింది. తిరిగి వచ్చే క్రమంలో ఈ నెల 12న కోదాడ బస్టాండ్‌కు చేరుకుంది.
బస్టాండ్‌లో ఆమెకు మాతానగర్‌కు చెందిన జానీ అనే లారీక్లీనర్ పరిచమయ్యాడు. అతడు ఆమెకు మాయమాటలు చెప్పి ఓ బహిరంగ ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. అనంతరం ఆమెను తన మిత్రుడు రాకేష్ గదిలో ఉంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బంధువుల ఇంటి నుంచి బయలుదేరిన తన కుమార్తె తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి ఆది వారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆ బాలిక ఫోన్ ద్వారా తన సోదరికి ఆచూకీ తెలిపింది. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు కోదాడలో గాలిస్తుం డగా జానీ,అతని మిత్రుడు పరారయ్యారు. పోలీసులు ఆ బాలికను కోదాడలో సోమవారం కనుగొన్నారు. ఈ సంఘటనపై బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు జానీ, అతడికి ఆశ్రయమిచ్చిన రాకేష్‌లపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.