11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ | 11 ias officers transfered | Sakshi
Sakshi News home page

11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

Oct 24 2013 8:57 PM | Updated on Sep 27 2018 3:20 PM

పదకొండు మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. ఈ మేరుకు గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్:  పదకొండు మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. ఈ మేరుకు గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం సచివాలయం జాయింట్ సెక్రటరీగా జగన్నాథంను బదిలీ చేసింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా జేఎస్వీ ప్రసాద్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్య కార్యదర్శిగా కృష్ణబాబు, ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా ఏఆర్ సుకుమార్,  గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా బీడీ ప్రియదర్శిని, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కమిషనర్‌గా బి.కిషోర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఈడీగా భారతి, ఇంటర్మీడియెట్ విద్యా శాఖ కమిషనర్‌గా అధర్‌సిన్హా,  మదనపల్లి జాయింట్ కలెక్టర్‌గా నారాయణ్ భరత్‌గుప్తా,వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జీఎస్‌పీ దాస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement