జి.మాడుగుల మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు సమీపంలో పది కిలోల గంజాయిని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
జి.మాడుగుల (విశాఖపట్నం జిల్లా) : జి.మాడుగుల మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు సమీపంలో పది కిలోల గంజాయిని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని బైక్‌పై అనకాపల్లి తరలిస్తుండగా పోలీసులు ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేసి పట్టుకున్నారు. పట్టుబడినవారిలో ఓ మహిళ కూడా ఉంది. వారిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.