చెరువులోకి దూసుకెళ్లిన సుమో: ఒకరి మృతి | 1 dies in sumo accident in chittoor district | Sakshi
Sakshi News home page

చెరువులోకి దూసుకెళ్లిన సుమో: ఒకరి మృతి

Mar 16 2016 8:57 AM | Updated on Apr 3 2019 7:53 PM

చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం సొరకాయలపేటలోని ఓ చెరువులోకి ప్రమాదవశాత్తూ సుమో దూసుకెళ్లింది.

పీలేరు : చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం సొరకాయలపేటలోని ఓ చెరువులోకి ప్రమాదవశాత్తూ సుమో దూసుకెళ్లింది. ఈ ఘటనలో పీలేరు పట్టణం ఆర్టీసీనల్లగుట్ట వీధికి చెందిన మెహదీన్ పాషా(55) అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటన అనంతరం సుమో డ్రైవర్ పరారయ్యాడు. పీలేరు నుంచి రాయచోటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాషా రోజూ పీలేరు నుంచి తిమ్మాపూర్‌కు ఎక్స్‌ఎల్ ద్విచక్రవాహనంపై వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లేవాడు. బుధవారం పాషా ఎక్కిన సుమో కేవీపల్లె వద్ద ప్రమాదానికి గురైంది. చెరువులోకి దూసుకెళ్లడంతో ఊపిరాడక ప్రాణాలొదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమోను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement