breaking news
-
బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
తెనాలి: జాన్ విక్టర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం తెనాలిలో పర్యటించారు. అక్కడి పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తమ కొడుకును పోలీసులు ఎంతగా హింసించింది ఫొటోలు, ఆస్పత్రి రిపోర్టులతో జగన్‌కు బాధిత కుటుంబ సభ్యులు వివరించగా.. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అంతకు ముందు..జగన్ రాక సందర్భంగా తెనాలిలో అభిమానం పోటెత్తింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తెనాలి రోడ్డు కిక్కిరిసిపోగా.. ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకు వచ్చి అభివాదం చేశారు. ఆపై యువకులు, మహిళలతో కలిసి ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదిలింది.తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరు యువకులపై బహిరంగంగా ఖాకీలు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. పైగా పోలీస్ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశారని, గంజాయి బ్యాచ్ అంటూ రివర్స్‌లో ఆరోపణలకు దిగారు. ఈ ఘటనపై దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు.అన్నం పెట్టకుండా హింసించారుతమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్ విక్టర్ తల్లిదండ్రులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. ‘‘పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదు. అరెస్ట్ చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. అంతేగానీ ఇలా పబ్లిక్‌గా కొడతారా?. అన్నం కూడా పెట్టకుండా మూడు రోజులు చిత్రహింసలు పెడతారా?. స్టేషన్‌కు వెళ్తే కనీసం అతన్ని చూడనివ్వలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్రపై కేసు.. ఈ సారి ఏం చేశారంటే?
సాక్షి,పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్రపై మరో మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించారంటూ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి వాట్సాప్ కాల్లో అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో, సదరు మహిళా ఎంఆర్వో.. పోలీసులకు ఆశ్రయించారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్యే బోనెల.. బహిరంగంగా బ్లాక్‌మెయిల్‌కు దిగారు. సదరు అధికారి.. ఎస్టీ మహిళ కావడంతో తనపై కేసు నమోదు అవుతుందున్న భయంతో ఎంఆర్వోపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందిస్తూ..‘భూమి విషయమై మాట్లాడేందుకు అర్ధరాత్రి ఎంఆర్వోకు నేను ఫోన్ చేశాను. ఆమె ఎత్తకపోవడంతో వాట్సాప్ కాల్ చేశాను. ఎంఆర్వో ఆఫీసు అవినీతిమయంగా తయారైంది. ఎంఆర్వో మానసిన పరిస్థితి సరిగా లేదు. ఎంఆర్వోపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. ఆమె క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.మరోవైపు... ఎంఆర్వోతో అనుచితంగా మాట్లాడిని ఎమ్మెల్యే తీరుపై ప్రజా సంఘాలుడ మండిపడ్డాయి. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్పందిస్తూ.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఫోన్ చేయడం సరికాదు. ఆమెను వేధింపులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మరో మహిళ టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై ఫిర్యాదు చేయడం గమనార్హం. -
రేషన్ వాహనాల రద్దు.. ప్రజలకు మరో వెన్నుపోటు
తణుకు అర్బన్: రేషన్ వాహనాల రద్దు.. ప్రజలకు చంద్రబాబు పొడిచిన మరో వెన్నుపోటు అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు బాధపడుతుంటేనే చంద్రబాబుకు ఇష్టమని, వారికి ఏది బాగున్నా.. ఆయనకు నచ్చదని, ఆయన కన్నుకుడుతుందని ఎద్దేవా చేశారు. రేషన్ వాహనాల రద్దుతో ప్రజలు చౌక దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో రేషన్ బియ్యం కోసం క్యూలో ఉన్న వృద్ధురాలు ఎండ వేడికి తట్టుకోలేక ప్రాణం కోల్పోయిందని, ఈ పాపం చంద్రబాబుదేనని విమర్శించారు.రేషన్ వాహనాలను తొలగించడం ద్వారా రేషన్ మాఫియాకు సర్కారే తెరలేపిందని, ప్రారంభించిన రోజే విశాఖపట్నంలో 40 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేలాది కుటుంబాల ఉపాధిని దెబ్బతీసిందని, వలంటీర్లు, మద్యం దుకాణాల్లో గుమాస్తాలు, రేషన్ వాహనాల డ్రైవర్లను, అసిస్టెంట్లను తొలగించిందని విమర్శించారు. రేషన్ వాహనాల రద్దుతో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పిల్లలను ఎత్తుకుని మహిళలు కొండలు, కోనల్లో నడుచుకుంటూ చౌక దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.పండించిన పంటలకు సరైన ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారని, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం పాటించాలని కారుమూరి కార్యకర్తలను కోరారు. ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని గతంలో మంత్రి నారా లోకేశ్ అనేవారని, ఇప్పుడు బిగిస్తున్న స్మార్ట్ మీటర్లను ఆయన పగలగొడతారా..? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే
సాక్షి, న్యూఢిల్లీ: మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మాయలోపడేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పేర్కొన్నారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు. బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ోమవారం ఢిల్లీలోని ఆమె నివాసంలో తనూజ రాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు జూన్ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజలంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు లోక్‌సభ నియోజకవర్గం కేంద్రాల్లో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరై జయప్రదం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇంకా కల్ల»ొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించి, చంద్రబాబు మోసాలను ప్రపంచానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు. -
మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబూ?
సాక్షి, అమరావతి: ‘‘దశాబ్దాల రాజకీయ అనుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి పాలనపై లోతైన అవగాహన ఉందని మీరు చెప్పుకొంటున్నారు. కానీ, ఆ దశాబ్దాల అనుభవం ఈ ఏడాదిగా రాష్ట్రానికి ఏం ఇచ్చింది?’’ అంటూ ‘ఎక్స్’వేదికగా సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన రుణంలో.. కేవలం ఏడాదిలోనే టీడీపీ కూటమి సర్కారు 44 శాతం అప్పు చేసిందని దెప్పిపొడిచారు. ‘‘ఏడాదిగా మీ ప్రభుత్వం అడ్డగోలుగా, భారీగా అప్పు చేసినా సంక్షేమం ఊసేలేదు.అభివృద్ధి జాడే లేదు. దశాబ్దాల అనుభవం మీకు నేర్పింది ఇదేనా?’’ అంటూ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. మీ ప్రభుత్వ ఆర్థిక అసమర్థతపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఎంవోఎస్పీఐ (కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ) నివేదికలు దిగ్భ్రాంతికర వాస్తవాలను బహిర్గతం చేస్తున్నాయని తెలిపారు. కాగ్, ఎంవోఎస్పీఐ నివేదికలు, ఆ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ఉటంకిస్తూ.. ఏడాదిగా చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఆర్థిక అసమర్థతను కడిగేస్తూ ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ సోమవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో ఏమన్నారంటే..1. జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో ద్రవ్య లోటు 4.08 శాతం నుంచి ఏడాదిలోనే 5.12 శాతానికి పెరిగింది. 2. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 2.65 శాతం నుంచి ఏడాదిలోనే 3.61 శాతానికి చేరింది. 3. కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ జీఎస్డీపీలో అప్పుల వాటా 35.64 శాతానికి పెరిగింది. 4. 2024–25లో భారీగా చేసిన అప్పుల్లో కేవలం 23.49 శాతం మాత్రమే మూలధన వ్యయం కోసం ఖర్చు చేశారు. కానీ.., మా ప్రభుత్వ హయాంలో 33.25 శాతం మూల ధన వ్యయం చేశాం. -
‘ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’
తాడేపల్లి : వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా ఆధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు బుధవారం(జూన్ 4వ తీదీ) చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ రేపు మండల స్థాయిలో కూడా వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ చేయాలి. ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం చేయాలి. ఎక్కడైనా అడ్డంకులు కల్పిస్తే న్యాయస్థానాల ద్వారా అధిగమిద్దాం. నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేయాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైన ఆపే ప్రయత్నం చేస్తే అక్కడ మీడియాతో మాట్లాడి వివరించాలి. ఎలాంటి శషబిషలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో ఘర్షణ పడటానికి కాదు.. ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టాలి’ అని సజ్జల పేర్కొన్నారు. -
‘అధికారాన్ని అనుభవించడం కోసమే బాబు పనిచేస్తున్నారు’
కాకినాడ జిల్లా గత ఏడాది కాలంలో ఇచ్చిన హామాలను అమలు చేయకుండా కుడి, ఎడమలగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని దగా చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ రోజు(సోమవారం, జూన్2) కాకినాడ రూరల్‌లో వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆవిష్కరించారు కురసాల కన్నబాబు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసినా వాటిని చంద్రబాబు దుర్మార్గంగా చిత్రీకరించారు. చెప్పిన హమీని ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలను నిలిపివేశారు. వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపిస్తున్నారు. అధికారాన్ని అనుభవించడం కోసమే గత ఏడాదిగా చంద్రబాబు పని చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి..రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు* అని విమర్శించారు. -
‘టెన్త్ విద్యార్థులకు నారా లోకేష్ క్షమాపణలు చెప్పాలి’
తాడేపల్లి : మంత్రి నారా లోకేష్ టెన్త్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పడమే కాకుండా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. పదో తరగతి పరీక్ష పత్రాల దిద్దుబాటులో ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్.. ‘ జరిగిన తపఉకు అంగీకరించకపోగా ఎదురు దాడి చేయడం సిగ్గుచేటు. పదో తరగతి విద్యార్తుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మార్కులు తక్కువ వేసి వేలాది మంది విద్యార్థులను ఫెయిల్ చేశారు. రీవెరిఫికేషన్ చేయిస్తే ఎంతోమందికి మంచి మార్కులు వచ్చాయి. టెన్త్ క్లాస్ అనేది పిల్లలకు సున్నితమైన దశ. అలాంటి పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రికార్డుల కోసం వారం రోజుల్లోనే పేపర్లు దిద్దాలని చూశారు. కనీసం టీచర్లు సంఖ్యను కూడా పంచకుండా పేపర్లు దిద్దించారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. రీవెరిఫికేషన్ కు తీసుకున్న రూ. 6 కోట్ల ఫీజను వెంటనే తిరిగి ఇచ్చేయాలి. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించి తప్పించుకోవాలని చూస్తే సహించలేదు’ అని హెచ్చరించారు. -
బాబుగారూ.. మీ అనుభవం ఏం నేర్పింది?
గుంటూరు, సాక్షి: చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దశాబ్దాల అనుభవానికి ఏమైందని.. ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారని ఎక్స్ ఖాతాలో లెక్కలతో సహా సోమవారం ఆయన ఓ పోస్ట్ చేశారు. ఏడాది పాలనలో ఏపీ ఆర్థిక స్థితి.. చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చటంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది?. రాజకీయానుభవంతో పాటు ముఖ్యమంత్రిగా పని చేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా. కానీ, ఆ అనుభవం ఈ ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?. కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. ఒకవైపు వాస్తవం ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్, మోస్పి (CAG & MOSPI) గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ ఒక పోస్ట్ చేశారాయన. . @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government… pic.twitter.com/UD8lWn2SBE— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025 -
అమాయక ప్రజలను బాబు మోసం చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, రౌడీలు.. పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిపి ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు హామీ ఇచ్చి చంద్రబాబు వెన్నుపోటు(Chandrababu Vennupotu) పొడిచారు. అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన చేపడతాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నష్టపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన దోపిడీతో మొదలైంది. సూపర్ సిక్స్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచింది.. .. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. రేషన్ డోర్ డెలివరీ(Ration Door Delivery System) విధానాన్ని కూడా చంద్రబాబు తొలగించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. .. ఉచిత బస్సు, అమ్మకి వందనం అంటూ ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రౌడీరాజ్యం , పోలీసు రాజ్యం నడుస్తోంది. విజయవాడలో శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి చూస్తోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్‌ను కిడ్నాప్ చేయడం దారుణం. అసలు బెజవాడ నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరంలో బుడమేరు వరదల్లో 12 డివిజన్లు నీట మునిగాయి అని మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి(Vijayawada Deputy Mayor Sailaja Reddy) మాట్లాడుతూ.. ‘‘జగన్‌ను ఒంటరిగా ఢీ కొనలేక మూడు పార్టీలు ముందుకు వచ్చాయి. చంద్రబాబు అమాయక ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఒక్క హామీ అమలు చేయలేదు. టీడీపీ మహానాడుతో ప్రజలకు ఏం ఉపయోగం లేదు. జగన్‌ను తిట్టేందుకు.. లోకేష్ ను పొగడ్తలతో ముంచేందుకే మహానాడు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు అని అన్నారామె. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.ఇదీ చదవండి: అలాంటి వారిని ఇలాగే శిక్షస్తారా?.. మేడమ్! -
బిగ్ న్యూస్: అనితా మేడమ్.. ఈ ప్రశ్నలకు జవాబుందా?
సాక్షి, విజయవాడ: కూటమి పాలనలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. తాజాగా.. తెనాలిలో పోలీసులు నడిరోడ్డు మీదే యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై(Tenali Police Torture) సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ ఈ ఘటనపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో.. దళితులపై పోలీస్ టార్చర్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) సమర్థించడంతో.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళని ఎందుకు ఇలా కొట్టలేదు మేడమ్? ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే, కూటమి పార్టీల నేతలను ఎందుకు ఇలా శిక్షించలేదు మేడమ్?దళిత ప్రొఫెసర్ని కొట్టిన జనసేన ఎమ్మెల్యేపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు మేడమ్?అసలు పోలీసుల దాష్టికాన్ని మీరు ఇలా ఎలా సమర్థిస్తారు మేడమ్?.. అంటూ హోం మంత్రికి పలువురు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటితో పాటు కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నడుస్తున్న ప్రతీకార రాజకీయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ.. పలు ఉదంతాలను ప్రస్తావిస్తూ హోం మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టాలు, కోర్టులు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేస్తారన్న ధోరణిలో మాట్లాడిన హోం మంత్రి.. పై ఘటనలను తన వ్యాఖ్యలతో ఎలా సమర్థించుకుంటారు అంటూ నిలదీస్తున్నారు.‘‘పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారు. ఒక స్టెప్ ఫార్వార్డ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తున్నారు. పోలీసులు ని కొంత పని చేసుకొనివ్వాలి. తెనాలిలో రౌడీ షీటర్స్ పోలీసులు పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు ని కొట్టినందుకే అలా చేశారు. వాళ్ళందరూ రౌడీ షీటర్లు, గంజా బ్యాచ్’’.. ఇదీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షించే మంత్రి అనిత నోటి నుంచి వచ్చిన తప్పుడు ప్రకటనలు.ఇదీ చదవండి: జగన్ అడిగిందేంటి.. చంద్రబాబు చెబుతోందేంటి? -
ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఆటవిక దేశాల్లోని నియంతల పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత తురకా కిషోర్‌లను ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. రెడ్‌బుక్ పేరుతో అధికార దుర్వినియోగానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని చంద్రబాబు (Chandrababu) గ్రహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే ఏర్పడే దారుణాలను ఇప్పటికే రాష్ట్రం అంతా చూస్తున్నారని అన్నారు. దీనిపై పౌరసమాజం కూడా గళం విప్పాలని, లేని పక్షంలో సమాజానికే రక్షణం లేకుండా పోతుందని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే... గత ఏడాది ఎన్నికల ఫలితాలు ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే లోగానే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలతో టీడీపీ శ్రేణులు చెలరేగిపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి కొనసాగింపుగా పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం, అరెస్ట్‌లు చేయించడం వంటి రాజ్యహింస ప్రారంభించారు. ముందుగా సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై అధికార దుర్వినియోగంకు పాల్పడుతూ పోలీసుల ద్వారా తప్పుడు కేసులు బనాయించారు. పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేసి జైలుపాలు చేశారు. తరువాత దశలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించారు. అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే, ఒక ప్రణాళిక ప్రకారం స్క్రిప్ట్ సిద్దం చేయడం, దానికి అనుగుణంగా అరెస్ట్‌లు, జైళ్ళకు పంపడం చేస్తున్నారు.ఇక మూడోదశలో భాగంగా సామాన్యులు, జర్నలిస్ట్‌లపై కూడా రాజ్యహింసను ప్రయోగిస్తున్నారు. ఈ మొత్త వ్యవహారానికి చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థను, రాజకీయ ఒత్తిళ్ళతో ఇష్టారాజ్యంగా పనిచేయాలంటూ ప్రోత్సహించారు. దాని పరిణమాలే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సమాజమే అశాంతిమయం అవుతుంది. రక్షించాల్సిన పోలీసులే చట్టాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణం పౌరసమాజం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విపరిణామాలు ప్రజాస్వామిక వ్యవస్థకే చేటు కలిగిస్తాయి. రాజకీయ కక్షసాధింపులతోనే పాలనమాజీ ఎంపీ నందిగం సురేష్ మీద పన్నెండు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఒకదాని తరువాత మరొకటి చొప్పున కేసులు నమోదు చేయడం, బెయిల్ పై బయటకు రాగానే పాత కేసులో అరెస్ట్ అంటూ జైలుకు పంపడం చేస్తున్నారు. పార్టీ నాయకుడు తురకా కిషోర్ మీద కూడా ఇలాగే గతంలో జరిగిన సంఘటనలను తవ్వితీసి, వాటికి బాధ్యుడుగా చూపుతూ అర్థంలేని ఘటనల్లో అరెస్ట్ చూపుతున్నారు. ఆయన బెయిల్ తెచ్చుకునేందుకు సిద్దపడుతుండటంతో, బయటకు రాగానే మరో పీటీ వారెంట్‌తో సిద్దంగా ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక స్క్రిప్ట్ ను సిద్దం చేసుకుని దాని ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.రాజకీయ అవసరాల కోసం పోలీసులను వినియోగించుకోవడం మొదలుపెట్టడంతో మొత్తం పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. దానికి నిదర్శనమే తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపై పట్టపగలు సీఐ స్థాయి అధికారులే లాఠీలతో హింసించడం. ఎక్కడో ఆటవిక రాజ్యం ఉన్న దేశాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని తెలుసు. కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు, న్యాయస్థానాలు చేసే విచారణను, నేర నిర్ధారణను, శిక్షను కూడా తామే అమలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు ఉన్నట్లు? మొత్తం రాజకీయ నాయకత్వం ఇచ్చిన దన్నుతో పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర సీఎం, ఆయన కుమారుడు స్వయంగా రెడ్‌బుక్ పాలనను సాగిస్తున్నామని బహిరంగంగా ప్రకటించి, దాని ప్రకారం పనిచేసిన వారికే రివార్డులు ఉంటాయని చెప్పడం వల్లే ఇటువంటి దారుణమైన పరిణామాలు జరుగుతున్నాయి. దీనినే కొనసాగితే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. సామాన్యుడు బతకడమే కష్టమవుతుంది.ఈ దుష్ట సంప్రదాయం చంద్రబాబును వదలదు నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. దానిపై ఇద్దరు ఎమ్మెల్సీలు, కాకాణి కుమార్తె జిల్లా కలెక్టర్‌ను కలవడానికి వెడితే వారిపైన కూడా కేసులు పెట్టడం చూస్తుంటే, ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానమే కలుగుతోంది. ఇటువంటి దుష్ట సంప్రదాయం తమను కూడా చుట్టుముడుతుందనే ఆలోచన చంద్రబాబుకు కలగడం లేదు. చట్టాలను పక్కకుపెట్టి, ఒక మాఫియా సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. తాము చెప్పినట్లు వినని వారిని వీఆర్‌కు పంపడం, సస్పెండ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిని దారుణమైన స్థితికి తీసుకువచ్చారు. అలాగే పల్నాడు జిల్లాలో హరికృష్ణ అనే యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు.పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తన కుమారుడిని చూపించమంటే, అసలు మా ఆధీనంలోనే లేడని పోలీసులు జవాబు చెప్పారు. స్టేషన్ వద్ద నుంచి వెళ్ళకపోతే హరికృష్ణ కుటుంబసభ్యులపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. హరికృష్ణపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ వద్ద తనను హింసించారని చెబితే ఆయనను ఆసుపత్రికి పంపారు. ఆ ఆసుపత్రిలోని వైద్యాధికారులను పోలీసులకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. హరికృష్ణ నడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు హరికృష్ణను కలిసేందుకు ఆయన తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు కనీసం ములాఖత్ కూడా ఇవ్వకుండా కక్షసాధిస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిని వదిలేసి, ఎవరిమీద ఫిర్యాదు ఇచ్చారో వారితోనే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీ వారిపై ఇలాగే హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వెన్నుపోటు దినం(Vennupotu Dinam) పేరుతో శాంతియుతంగా నిరసనలు చేపడతామంటే ఈ ప్రభుత్వం భయపడుతోంది. వాటికి అనుమతులు ఇవ్వకూడదని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఏడాది దుష్ట పాలనకు ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనలను అడ్డుకోలేరు’ అని సజ్జల స్పష్టం చేశారు. -
జగన్ అడిగిందేంటి? బాబు చెప్పేదేంటి!!
అమరావతి రాజధానైతే జగన్‌కు వచ్చే నష్టమేమటి?.. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్న ఇది. అయితే తనకు నష్టమని జగన్ ఏనాడూ చెప్పలేదు. భారీ స్కాములతో.. వేల కోట్ల రూపాయల అప్పులతో నిర్మాణాలు చేపడితే ఆ నష్టాన్ని భరించాల్సింది ఏపీ ప్రజలు మాత్రమేనని అన్నారాయన. నాగార్జున యూనివర్శిటీ సమీపంలోనో ఇంకో చోటో.. 500 ఎకరాలలో నిర్మిస్తే సరిపోయే దానికి లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపాయలంటూ ప్రజల నెత్తిన పెద్ద అప్పుల కొండ పెట్టడం ఎందుకు? అని జగన్ అడిగారు. దీంతోపాటు రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి కొన్ని ప్రశ్నలు నేరుగానే అడిగారు. కానీ.. చంద్రబాబు వీటికి నేరుగా సమాధానం ఇవ్వలేక దబాయింపులకు దిగినట్లు స్పష్టమవుతుంది ఆయన స్పందన చూస్తే. పైగా ఆయన తప్పు చేస్తూ దానిని కవర్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారని తెలిసిపోతుంది. అమరావతి(Amaravati) పేరుతో చేపడుతున్న నిర్మాణాల వ్యయం గురించి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నిలదీస్తే, దానికి జవాబు ఇవ్వకుండా, అసూయ అని, ఇంకొకటని చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? చదరపు అడుగుకు రూ.పదివేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి అమరావతిలో నిర్మాణాలు చేస్తున్న మాట నిజమే కదా?. దేశంలో ఎక్కడ కూడా నిర్మాణ వ్యవయం ఎంత ఎక్కువ లేదు. ఢిల్లీ, ముంబై వంటి నగరాలు కాదు.. అమెరికాలోనూ ఉండవు. పైగా అమరావతిలో భూమి ఖర్చు లేనే లేదు. 👉గతంతో.. పోలిస్తే సిమెంటు, ఉక్కు ధరలు తగ్గాయి. ఇసుకేమో ఉచితం! అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 2018 నాటి ధరల కంటే ఎక్కువ ఎందుకు చెల్లించేందుకు సిద్ధపడుతోందని జగన్ అడిగితే.. రైతులు భూములు రాజధానికి ఇస్తే మీకెందుకు అసూయ? అనడం అసలు విషయాన్ని దాచివేయడం కాదా! మంత్రులు,హైకోర్టు జడ్జీల బంగ్లాలకు నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10418, ఐఎఎస్ అధికారుల బంగ్లాలకు రూ.9771, ఐదు టవర్ల నిర్మాణానికి రూ.8981 వ్యయం చేయడం నిధుల దుర్వినియోగమా కాదా? హైదరాబాద్ వంటి నగరంలోనే చదరపు అడుగుకు మహా అయితే రూ.నాలుగు వేలు అవుతుంది. భూమి, ఇసుక ఉచితంగా వస్తున్నా, అంతకు రెట్టింపు కంటే ఎక్కువ రేట్లు ఇస్తున్నారంటే, అందులో అవినీతి ఏ స్థాయిదో అని చర్చ జరుగుతోంది. ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం చేసిన అంశాన్ని, ఆర్థిక సంఘానికి రూ.77 వేల కోట్లు అవసరం అని చంద్రబాబు స్వయంగా చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. లక్ష కోట్లు పెట్టి ఏమి చేస్తావు? అంటే అలా అడగకూడదని జగన్ కు చెప్పే హక్కు చంద్రబాబుకు ఉంటుందా? అమరావతి ఏమైనా చంద్రబాబు సొంత సామ్రాజ్యమా? లేక చంద్రబాబేమైనా ఏపీకి నియంత? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌పై ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు? జగన్ ఇప్పుడు ఆధార సహితంగా ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పలేక ఎదురుదాడి చేస్తే సరిపోతుందా! నిజానికి అమరావతి కోసం ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పు సమీకరించారట. 👉గతంలో తీసుకున్న 33 వేల ఎకరాలు, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలలోనే ఇంతవరకు అభివృద్ది జరగకపోతే, ఇంకో 44 వేల ఎకరాలు తీసుకుని ఏమి చేస్తారు? ఆ భూముల యజమానులు అక్కడ పంటలు పండించుకోకుండా ఉండడం, వారికి ప్రభుత్వం కౌలుగా రూ.వందల కోట్లు చెల్లించడం.. చివరికి ఏమి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడడం. ఇదంతా ఏపీకి అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. గతంలో అమరావతికి అసలు ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వ్యయం చేయనవసరం లేదని చంద్రబాబే అన్నారు. ప్రభుత్వానికి మిగిలే ఎనిమిదివేల ఎకరాలు అమ్మితే లక్ష కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికారు. ఆ డబ్బు ఎలా వస్తుందో తెలియదు. కాని, ముందుగా రూ.లక్ష కోట్ల అప్పయితే పడబోతోంది. అసలు, వడ్డీ కలిసి తడిసి మోపెడు అయితే దాన్ని రాష్ట్రంలోని ప్రజలంతా చెల్లిస్తారా? లేక కేవలం అమరావతిలోని భూములు కలిగిన వారే చెల్లిస్తారా? దీనిని అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్ గా చేయడం ప్రభుత్వానికి తగునా!. 👉అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని చంద్రబాబు(Chandrababu) ఢిల్లీలో చెప్పిన దానిని ఎవరైనా నమ్ముతారా?. బడ్జెట్లోనే రూ.6,000 వేల కోట్లు కేటాయించారు కదా? అందులో నుంచి సుమారు రూ.2,800 కోట్లు సీఆర్డీఏకి విడుదల చేసింది అసత్యమా?. ప్రపంచ బ్యాంక్, జర్మని సంస్థ, హడ్కోల నుంచి తీసుకుంటున్న అప్పు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం చెల్లిస్తుందా?.. లేదు కదా!. హైదరాబాద్ వంటి రాజధాని ఏపీకి అవసరం లేదా? అని చంద్రబాబు అంటున్నారు. నిజంగా చిత్తశుద్దితో అలాంటి భావన ఉండి ఉంటే పది పల్లెటూళ్ల మధ్య లక్షల కోట్లు వ్యయం చేయవలసిన అవసరం ఏమి ఉంది? ఇప్పటికే పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది కదా? అప్పుడీ భారమే ఉండదు కదా! ఈ పల్లెల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు తమ ప్రాంతానికి కూడా అంత పెద్ద మొత్తం చొప్పున ఖర్చు చేయండని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు డిమాండ్ చేస్తే అంగీకరిస్తారా?. 👉బెంగుళూరును మించిన విమానాశ్రయం ఏపీకి కావాలట. అందుకోసం మరొకటి కడతారట. విజయవాడకు సమీపంలోని గన్నవరం వద్ద ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నప్పుడు ఏమి చెప్పారు? ఇప్పుడేమి చేస్తున్నారు. అంటే ఇంతకాలం గన్నవరం వద్ద సమీకరించిన భూములు, అక్కడి బడాబాబులు కొందరికి అమరావతిలో ప్లాట్లు కేటాయించడం, వేల కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్టులో నిర్మాణాలు చేయడం..అదంతా వృథాయేనా?. శంషాబాద్ విమానాశ్రయం వచ్చాక బేగంపేట ఎయిర్ పోర్టు మూసివేసినట్లు గన్నవరం ఎయిర్ పోర్టును నిలిపివేయక తప్పదు కదా! పోనీ ఇప్పుడు ప్రతిపాదించిన ఎయిర్ పోర్టు విజయవాడ, గుంటూరులకు కూడా నలభై, ఏభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి రోడ్డు సదుపాయం కూడా కల్పించవలసి ఉంటుంది. దీనిని కట్టడానికి ముందుకు వచ్చే పెట్టుబడిదారుడు ఎన్ని షరతులు పెడతారో? ప్రపంచంలో అతి రద్దీ ఉన్న విమానాశ్రయలు ఏవీ కూడా ఇంత విస్తీర్ణంలో లేవట. భారత్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభించిన పలు ఎయిర్ పోర్టులు రద్దీ లేక కార్యకలాపాలు నిర్వహించలేక పోయాయని చెబుతున్నారు. విశాఖపట్నం-విజయవాడ మధ్యే విమానాలు నడపలేమని ప్రైవేటు సంస్థలు చేతులెత్తేశాయే!. వీటన్నిటిని కప్పిపుచ్చి ప్రజలను మభ్య పెట్టడం అవసరమా?. నిజంగానే గన్నవరం వద్ద అంత భారీగా రద్దీ పెరిగితే కొత్త ఎయిర్ పోర్టు కట్టినా ఫర్వాలేదు.అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఈ కబుర్లు అన్నీ దేనికి! 👉కేవలం సూపర్ సిక్స్(Super Six Promises) తదితర హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం కోసం వారిని మభ్యపెట్టే రీతిలో డైలాగులు చంద్రబాబు చెప్పడం,వాటిని గొప్ప సంగతులుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం..ఇదే ఏపీలో జరుగుతున్న తంతు.ఇప్పటికే సెక్రటేరియట్, అసెంబ్లీల కోసం కట్టిన భవనాలను ఏమి చేస్తారు.అవి వృథాయేనా? ఒక్కొక్కటి నలభై, ఏభై అంతస్తుల టవర్లు కడితే అసలు ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అవసరం? రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి, ఎవరి భూములో తీసుకుని ప్రభుత్వం వేల కోట్లతో అభివృద్ది చేయవలసిన అవసరం ఏమిటి? వీటికి జవాబు లేక జగన్ ను నిందిస్తే కధ నడిచిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. ఏపీ ప్రజలు వీటిని అర్థం చేసుకోలేరన్నది ఆయన నమ్మకం కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీకి గుడ్‌బై.. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఏపీలో అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆత్కూరుకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది కూటమి ప్రభుత్వ తీరుకు విసుగు చెంది ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. పటాపంచల సాంబశివరావు, పటాపంచల గోపి, గంగుల నాగరాజు, గంగుల బాలాజీ, గంగుల వెంకట్రావు, గంగుల రమేష్ తదితరులకు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ..‘కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆత్మపరిశీలనలో పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వం చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం. మైలవరం నియోజకవర్గంలో జూన్ నాలుగో తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.జూన్ 4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి కూటమి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందన్నారు. జి.కొండూరు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ జడ రాంబాబు, ఆత్కూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగుల తిరుపతిరావు అధ్యక్షతన వైఎస్సార్సీపీలో చేరికలు శుభపరిణామమని అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది’
ఎన్టీఆర్ జిల్లా: ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పతనం మొదలైందన్నారు మైలవరం నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి జోగి రమేష్. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరించడానికే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 4వ తేదీన వైఎస్సార్ సీపీ చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఈరోజు(ఆదివారం) పోస్టర్ ను ఆవిష్కరించారు జోగి రమేష్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వ చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం, మైలవరం నియోజకవర్గంలో జూన్ 04 న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. జూన్4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇచ్చిన హామీలన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది. జూన్ 04 న మైలవరం డాక్టర్ లక్కిరెడ్డి హనిమి రెడ్డి కాంప్లెక్స్ వద్ద నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీని జరుగనుంది’ అని జోగి రమేష్ తెలిపారు. -
‘వెన్నుపోటు దినం’పై చంద్రబాబు కుట్రలు
సాక్షి, విజయవాడ: జూన్ 4న వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఇందులో భాగంగా వెన్నుపోటు దినం రోజున వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనల్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తోంది. జూన్ 4 న వైఎస్సార్సీపీ నేతలు చేపట్టే నిరసనలకి పోలీసులు అనుమతి నిరాకరించారు. శ్రీకాకుళం, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో వెన్నుపోటు దినం నిమిత్తం వైఎస్సార్సీపీ నేతలు అనుమతుల కోసం పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. అయితే, నేతల విజ్ఞప్తుల్ని పోలీసులు నిరాకరించారు. పలుచోట్ల సెక్షన్ 30 అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రజాస్వామ్య విధానాలు,రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసేలా కూటమి ప్రభుత్వం అరాచకానికి దిగింది. వైఎస్సార్సీపీ నాయకులు కోరుతున్న అనుమతులు తిరస్కరించేలా చంద్రబాబు పోలీసుల్ని వాడుకోవడం గమనార్హం.కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేలా వెన్నుపోటు దినంప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారు. ‘జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని వైఎస్ జగన్ కోరారు. -
పవన్ నియోజవర్గంలో టీడీపీ, జనసేన బాహాబాహీ
పిఠాపురం: టీడీపీ, జనసేనలు పొత్తు పరంగా కలిసి ఉన్నా, కార్యకర్తల దగ్గరకు వచ్చే సరికి ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదనేది మరోసారి బయటపడింది. ఈరోజు(ఆదివారం, జూన్1) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య రగడ చోటు చేసుకుంది. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోయి మరీ ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు.పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలోనే ఇరు పార్టీల విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ కార్యాక్రమానికి హాజరైన రెండు పార్టీల శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. జై జనసేన, జై టీడీపీ అంటూ ఇరు వర్గాల నినాదాలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తల్లో సఖ్యత అనేది లేకపోవడంతో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ పరిస్థితులు గందరగోళానికి దారి తీసిన సందర్బాల్లో తరచు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి: పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!! -
చంద్రబాబు అలా మాట్లాడటం సిగ్గుచేటు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: పరిశ్రమలకు భూములివ్వాలనే తాపత్రయం తప్ప చంద్రబాబుకు రైతుల గురించి ఆలోచన లేదంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించేదంతా పారిశ్రామికవేత్తలేనంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.‘‘పక్కనున్న తెలంగాణలో సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు క్వింటాకు మద్దతు ధరకంటే అదనంగా 800 రూపాయలు బోనస్ ఇస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఏ పంటకు కూడా మద్దతు ధర దొరకడం లేదు. పరిశ్రమలకు మేం వ్యతిరేకం కాదు...పరిశ్రమలు రావాలి. యువతకు ఉద్యోగాలు కావాలి. ఇప్పటికైనా చంద్రబాబు రైతుల గురించి ఆలోచన చేయాలి. ఏపీలో 50 శాతం పైన భూమి కౌలు రైతులు సాగుచేస్తున్నారు. కౌలు రైతులకు రైతు బంధు పథకం అమలు చేయాలి’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. -
‘బాబు మహానుబావుడు.. అధికారంలోకి వచ్చాడు లక్షల ఉద్యోగాలు పీకేశాడు’
సాక్షి,గుంటూరు: తాజాగా కోనసీమ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు తనది డేగకన్ను, తప్పు చేసిన వారు తన నుంచి తప్పించుకోలేరంటూ పిట్టలదోరలా మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తూ తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై పట్టపగలు ముగ్గురు దళిత, మైనార్టీ యువకులను హింసిస్తే చంద్రబాబు డేగ కన్నుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వారిపై చర్య తీసుకుంటే తాను చట్టవిరుద్దంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైయస్ఆర్సీపీ శ్రేణులపై పెట్టిస్తున్న తప్పుడు కేసులు, వేధింపులను పోలీసులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. పోలీసుల హింసకు గురైన బాధితులను పరామర్శించేందుకు ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెనాలికి వెడుతున్నారని వెల్లడించారు.ఇంకా ఆయనేమన్నారంటే..తెనాలి అయితానగర్‌కు చెందిన జాన్ విక్టర్, దోమా రాజేష్,షేక్ బాబూలాల్ అనే యువకులు చిరంజీవి అనే కానిస్టేబుల్‌పై దాడి చేశారని వారిపై 307 కేసు పెట్టారు. చట్టప్రకారం వారిని అరెస్ట్ చేసి కోర్ట్‌కు పంపాల్సింది పోయి, వారిని పట్టుకుని నడిరోడ్డుపై లాఠీలతో చావబాదారు. వారంతా దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన వారు. ఈ హింసను చూస్తుంటే అసలు ప్రజస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. దీనిని మానవ హక్కుల సంఘాలు ప్రశ్నిస్తే, వారిపై రౌడీషీట్లు ఉన్నాయని, రౌడీలకు సపోర్ట్ చేస్తారా అని ఎదురుదాడి చేస్తున్నారు. చట్టాన్ని పోలీసులే చేతుల్లోకి తీసుకుంటే ఇక కోర్ట్లు ఎందుకు? విచారణలు ఎందుకు? శిక్షలు ఎందుకు? ప్రజాస్వామిక వ్యవస్థలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి, కోర్ట్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పోలీసుల పనిచేయాలే తప్ప, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీలు లేదు. తనది డేగ కన్ను అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు ఈ దారుణం కనిపించలేదా? పోలీసులను మందలించడానికి ఎందకు భయపడుతున్నారు? ఇటువంటి ఘటనలు సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతాయి.ఏడాది తరువాత పాలనలో ఏ గేర్ మారుస్తారు?అవినీతిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. నిత్యం లంచాల సొమ్మతో సూట్‌కేసులు మోయడమే ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న పని. కోససీమ జిల్లా చేయ్యూరు ప్రజావేదికలో పాల్గొని పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ నెల పన్నెండో తేదీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుందని, ఇకపై పాలనలో గేర్ మారుస్తానని చంద్రబాబు అన్నారు. ఏం గేరు మారుస్తారో మాకు మాత్రం అర్థం కాలేదు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి అబద్దాలను కూడా అవలీలగా చెబుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి అబద్దాలనైనా సరే లైవ్ డిటెక్టర్‌కు కూడా దొరకకుండా చెప్పగల నేర్పరి. 'అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం, అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే, లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను, నాది డేగ కన్ను, ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తే ఛండశానసనుడిని అవుతాను' ఇవీ చంద్రబాబు తాజాగా చెప్పిన సుభాషితాలు. అసలు అవినీతి సమాజానికి అంకురార్పణ చేసిందే చంద్రబాబు. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోంది. దానికి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఈ అవినీతి సొమ్మును వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. సీఐల బదిలీల నుంచి అన్ని పోస్టింగ్‌లకు ఒక రేటును పెట్టి, లంచాలు దండుకుంటున్నది నారా లోకేష్ అనేది సత్యం. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ప్రజలను మోసం చేసిన వైనంను ప్రశ్నిస్తూ ఈనెల 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి, మిర్చి, పొగాకు, ధాన్యం ఇలా ఏ పంట పండిచే రైతుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ స్టంట్ కోసం చేసే ప్రయత్నం తప్ప ప్రజలను నిజంగా మేలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. వైఎస్సార్సీపీ నిరసనలతో ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం.అవినీతిపై బెల్ట్ తీసే సీఎంకు బెల్ట్‌షాప్‌కు కనిపించవా?చంద్రబాబు తనది డేగ కన్ను అంటున్నాడు, బెల్ట్ షాప్‌లు పెడితే బెల్ట్ తీస్తాను అని కూడా హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాప్‌లు కనిపిస్తున్నాయి. ఆయనది డేగ కన్ను ఎలా అవుతుంది? ఆ షాప్‌లు ఎందుకు కనిపించడం లేదు? బడులు తెరవగానే అమ్మ ఒడి ఇస్తానని చెబుతున్నాడు. ఏడాది కిందట కూటమి పార్టీ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు బడులే తెరవలేదా? ఈ ఏడాదే బడులు తెరుస్తున్నారా? ప్రతి విద్యార్ధికి రూ.పదిహేను వేలు అంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం వారు చేసిన హామీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఏవీ ఆ పదిహేను వేలు అంటూ తల్లులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ వర్గం సంతోషంగా ఉంది? విద్యార్ధులు, యువకులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, కనీసం అమరావతి రైతులు సైతం సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైన పాలనను ఈ ఏడాది కాలంలో ప్రజలు చవిచూశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అయిదేళ్లు, చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది, ఉన్న ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం కూటమిది. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తానంటూ నమ్మించి దాదాపు 2.60 లక్షల మందిని రోడ్డుపాలు చేశారు. ఏపీ ఫైబర్‌నెట్, బేవరేజెస్, ఏపీఎండీసీల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలను తొలగించారు.ఎండీయులతో 72 నెలల ఒప్పందాన్ని కొనసాగించాలిఈ రోజు రేషన్ వాహనాలపై ఆధారపడిన ఎండీయు ఆపరేటర్ల ఉద్యోగాలను కూడా తొలగించారు. 9260 మందికి ఎండీఓ వాహనాలను లోన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది. వారితో పాటు ఒక హెల్పర్‌తో కలిపితే మొత్తం ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాం. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే వారిని రోడ్డుపాలు చేశారు. ఇదే ఎండీయులతో గత ప్రభుత్వం 72 నెలల పాటు కొనసాగేలా అగ్రిమెంట్ ఉంది. అది పూర్తి కాకుండానే వారిని తొలగించారు. ఇది చట్ట విరుద్దం. వారిపై ఇంత కక్షసాధింపు ఎందుకు? బుడమేరు వరదల్లో వారు కష్టపడి పనిచేసిన కూడా వారిని నమ్మించి గొంతుకోశారు. చట్టవిరుద్దంగా తమను తొలగించారంటూ ఇప్పటికే కొందరు ఎండీయులు న్యాయస్థానాలకు కూడా వెళ్ళారు.మంత్రి నాదెండ్ల మనోహరే పీడీఎస్ బియ్యం స్మగ్లర్వారిని తొలగించే సమయంలో చంద్రబాబు ఎండీయులను గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. ఎండీయుల ద్వారా పనిచేసే వారంతా స్మగ్లర్లని, కాకినాడ పోర్ట్‌కు రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని సంచలనమైన ఆరోపణలు చేశారు. వారంతా సంఘవిద్రోహశక్తులు అని మాట్లాడారు. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు, ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు స్మగ్లర్లుగా మారారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ద్వారా ఎమ్మెల్యేలకు వాటాలు అందుతున్నాయి. కాకినాడ నుంచి ఆఫ్రికాదేశాలకు వెళ్ళే బియ్యం అంతా స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమ రవాణా జరుగుతోంది. మట్టి, ఇసుక, ఉద్యోగాల బదిలీలు, పీడీఎస్ బియ్యంను అడ్డం పెట్టుకుని అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. ఎండీయుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. సివిల్ సప్లయిస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ అక్రమ పీడీఎస్ రవాణా వ్యవహారంలో మొదటి స్మగ్లర్. తరువాత మంత్రి నారా లోకేష్. మీరు అక్రమాలు చేస్తూ, ఎండీఓలపై ఆరోపణలు చేయడం దారుణం. -
మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజితపై అక్రమ కేసు
సాక్షి, నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత పై అక్రమ కేసు నమోదైంది. వినతి పత్రం ఇచ్చినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకాణి కుమార్తె పూజిత సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మేరుగ మురళిలపైనా పోలీసులు కేసులు పెట్టారు. జేసీకి కార్తీక్ కి వినతిపత్రం ఇచ్చినందుకు కేసు నమోదు చేశారు.కాకాణి అక్రమ అరెస్ట్‌పై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. నిన్న జేసీని కాకాణి కుమార్తె పూజిత, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. దీంతో ప్రజలకు అశాంతి కలిగించారంటూ పది మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. పోలీసులు అక్రమ కేసుపై నెల్లూరు ప్రజలు విస్తుపోతున్నారు. -
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ కష్టాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కిస్తూ గత వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని టీడీపీ కూటమి సర్కార్ నిలిపివేయడంతో రాష్ట్రంలో రేషన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రేషన్ షాప్ వద్దకు వచ్చి సరుకులు తీసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో రేషన్ తెచ్చుకొనేందుకు వృద్ధులు, వికలాంగులు తీవ్ర పాట్లు పడుతున్నారు.పాతపట్నం నియోజకవర్గంలోని గొట్టిపల్లి, పెద్ద రాజపురం, చిన్న రాజపురం, చీపురుపల్లి, పెద్దగూడ, దిగువగూడ, గ్యాసరగూడ, శివుడి మామిడిగూడ, జెన్నోడుగూడ, బలదగూడ, దబ్బాగూడ గ్రామాలకు చెందిన గిరిజనులకు రేషన్ కష్టాలు మొదలయ్యాయి. రేషన్ కోసం కూలి పనులు మానుకోవాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వ్యవస్థను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా: ఏజెన్సీలోనూ రేషన్ కష్టాలు మొదలయ్యాయి. కిలోమీటర్ల దూరం వెళ్లి మళ్లీ రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా తమకు చాలా మేలు జరిగిందంటున్న గిరిజనులు.. అదే పథకాన్ని పునరుద్ధరించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.కోనసీమ జిల్లా: ఇంటి వద్దకే రేషన్ అందించే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ రేషన్ కష్టాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపుు వద్ద వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. మండుటెండల్లో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఆ పదానికి పేటెంట్ చంద్రబాబే: వైఎస్సార్సీపీ
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ వంచనకు పాల్పడిందని.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్పొరేటర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 175 నియోజక వర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ పాటిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఏడాదిలో వైఎస్ జగన్ 80 శాతం హామీలను అమలు చేశారు. జూన్ 4న జిల్లా పరిషత్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తాము’’ అని బొత్స పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా: వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్ అని.. కూటమి సర్కార్.. మోసాలకు, అరాచకాలకు నిరసనగా జూన్ 4న రాజంపేట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీన చేపట్టే వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ‘వెన్నుపోటు దినం’ పోస్టర్‌ను వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 4వ తేదీన చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపడుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతపురం: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మోసకారి అంటూ దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. హామీలంటే ఇప్పుడు భయమంటున్నారు. సూపర్ సిక్స్ హామీలను ఎందుకు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శన ను విజయవంతం చేయాలని తోపుదుర్తి పిలుపునిచ్చారుకృష్ణా జిల్లా: 4న చేపట్టే ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమ పోస్టర్‌ను కానూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని.. అబద్దపు హామీలతో సీఎం అయ్యారంటూ మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి?. వెన్నుపోటుకి నిర్వచనం చంద్రబాబు. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచాడు. అబద్దానికి నిలువెత్తు రూపం చంద్రబాబు. నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని పార్టీ నేతలకు దేశభక్తుని చక్రవర్తి పిలుపునిచ్చారు. -
బాబూ.. సేవలను సమాధి చేయడమే మీ విజనా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు.. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. రేషన్ డోర్‌డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా?. దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్..‘చంద్రబాబు గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? అని ప్రశ్నించారు.మరోవైపు వైఎస్సార్సీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20వేలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా? పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులుగానూ చిత్రీకరించేలా నిన్న మీరుచేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకముందు ప్రతినెలా ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవలకోసం పడ్డ తిప్పలు అన్నీఇన్నీకావు. ఎండనక, వాననక క్యూలైన్లలో రేషన్ షాపులముందు పడిగాపులు పడేవారు. ఎప్పుడు రేషన్ ఇస్తారో, ఎంతసేపు రేషన్ ఇస్తారో తెలియక కూలీపనులు, ఇతరత్రా పనులు మానుకుని నిరీక్షించేవారు. ఈ క్రమంలో లబ్ధిదారులు వివక్షను, అవమానాలు ఎదుర్కొనేవారు, దోపిడీకి గురయ్యేవారు. సరైన తూకంతో, నాణ్యతతో సరుకులు అందుకున్న సందర్భం లేదు. ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్ సరుకులు తీసుకోవడంకూడా మానేశారు. దీనిపై నా పాదయాత్రలో ప్రజలు నా వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.1.@ncbn గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? మరోవైపు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 1, 2025మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలతోపాటు, ఇంటివద్దకే రేషన్ అందించే డోర్‌డెలివరీని ప్రారంభించింది. బియ్యం క్వాలిటీని పెంచి, మధ్యస్త సన్నబియ్యాన్ని, ప్రజలు తినగలిగే నాణ్యమైన, సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ప్యాక్‌చేసి, రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికీ అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేసింది. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం రేషన్ డోర్‌డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారు?నెలకు రూ.10వేలు ఇస్తామంటూ వాలంటీర్లను మీ వైపు తిప్పుకుని ఎన్నికల్లో వాడుకుని, తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడుతూ వారిని రోడ్డుమీద నిలబెట్టారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామవార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధికట్టారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో, వార్డుల్లో డోర్‌డెలివరీ సంగతి పక్కనపెడితే, ఏకంగా ప్రభుత్వ సేవలు అందడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాజాగా ఈ మూర్ఖపు చర్య కారణంగా, రేషన్ వాహనాల తొలగింపుతో వారి కష్టాలు మరింత పెరిగాయి. అంతేకాదు ఈ వాహనాలపై ఆధారపడ్డ 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కనీసం వారికి ప్రత్యామ్నాం కూడా చూడలేదు. మొత్తంగా మీరు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6లక్షల మంది, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్‌ల్లో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా 3 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబుగారూ..!’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
లోకేష్ బెదిరింపులకు ఎవరూ భయపడరు: సతీష్‌కుమార్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్.. కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారు.. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా..? అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది’’ అంటూ సతీష్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.‘‘అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతిన కొట్టారు. ఆ పోలీసులకు టీడీపీ నాయకులు జీతాలు ఇస్తున్నారా...?. మేము అతన్ని పోలీసుగా కాకుండా రౌడీగా పరిగణిస్తాం. మీ పరిధి దాటి మీరు రౌడీగా ప్రవర్తిస్తే మేము సహించాలా..?. తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మొన్న యువకులను నడిరోడ్డుపై ఇష్టారీతిన కొట్టారు. కొందరు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు. రేపు వైఎస్సార్సీపీ గెలిచాక ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది..?. మహానాడులో వైఎస్సార్సీపీ వాళ్లకు తడిసిపోతుంది అంటున్నారు. మాకు కాదు తడిసిపోయేది.. మీ కార్యకర్తలకు తడిసిపోతుంది. ..ఇది తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబు కూడా వైఎస్సార్సీపీ వారికి ఏ పథకం ఇవ్వొద్దు అంటున్నాడు. మీరు తెస్తున్న ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది..?. గతంలో నేను టీడీపీలో ఉండి మీటింగు పెడితే ఒక కల్యాణ మండపం కూడా నిండలేదు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి వస్తారు. అది బలుపు కాదు వాపు.. నువ్వు కడపలో పెట్టీ మాట్లాడాలంటే నువ్వు రద్దు చేసిన మెడికల్ సీట్ల గురించి చెప్పాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నావు..ఏంటి తడిసిపోయేది లోకేష్.. ఏమి చేయగలవ్.. అరెస్ట్ చేయించి కొట్టిస్తావు అంతేగా.. ఆ తర్వాత నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకో.. నీ కార్యకర్తల పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో. మీరు, ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీ నుంచి మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మీరు భయపడితే ఇక్కడ ఎవరు భయపడరు. ఈ ఏడాది కాలంలో నువ్వు చేసింది పింఛన్ పెంపు మాత్రమే. అదీ ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు. గ్యాస్ లబ్ది ఏ ఊరికి వెళ్ళైనా అడుగుదాం... సగానికి పైగా అందలేదు. నువ్వు ఎంతమందిని జైల్లో వేయగలవు లోకేష్..?..లక్ష కోట్లు ఒక్క రాజధానికి పెట్టడం సమంజసమా..?. నువ్వు తీసుకునే లక్ష కోట్లా అప్పు.. అమరావతి వాళ్లే కడతారా..?. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ ఆ అప్పు కట్టాలి. ఎన్టీఆర్ కంటే మహానాడులో జగన్ నామ స్మరణ మాత్రమే చేశారు. జగన్ బయటకు వెళితే జనం రాకతో రోడ్లు పట్టడం లేదు.. అదే జగన్ అంటే.. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. మేము కూడా జైలు బరో చేస్తాం. నీకు, నీ కొడుకుకి వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్లుంది’’ అని సతీష్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు.