breaking news
-
‘తల్లికి వందనం.. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకున్నాడు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, వైఎస్సార్ కార్పొరేటర్ విజయవాడలో జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలనుఈ పుస్తకంలో వివరించాము. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. చంద్రబాబు అధికారం కోసం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లు మార్చారు. 30 లక్షల మందికి తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారు. వైజాగ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లేరని విద్యార్థులు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి.చంద్రబాబు 17 వందల కోట్లు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ తీర్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అందరు చదవాలి. కరెంటు చార్జీల పేరుతో చంద్రబాబు రూ.15 వేల కోట్లు వసూలు చేస్తున్నారు. బుడమేరుతో ముంపు గురైన ప్రజలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. శాతవాహన కళాశాల ను కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిందూ దేవాలయాల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు దాడి చేస్తున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తల్లికి వందనంలో 87 లక్షల మంది తల్లులకు ఇవ్వాలని లెక్కలు ఉన్నాయి. లోకేష్ తనకు తానే సవాల్ విసురుకుంటున్నాడు’ అని అన్నారు.డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వైఎస్ జగన్ బటన్ నొక్కితే హేళనగా మాట్లాడారు. మీరెందుకు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నగలు జమ చేయడం లేదు. చంద్రబాబు ఎవరికీ మంచి చేసిన విధానం లేదు. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ జగన్ స్కూల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కేటాయిస్తే హేళన చేశారు. మీరు.. 13 వేలు తల్లులు ఖాతాలో వేసి మోసం చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు, రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశాడు’ అని తెలిపారు. -
సీమలోనూ సీను సితారే!
గెలిచి సరిగ్గా ఏడాది కాలేదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు పదవుల్లో కూర్చుని గట్టిగా సమచ్చరం కాలేదు. అప్పుడే జనాలకు ప్రభుత్వం మీద ఏవగింపు మొదలైంది . వచ్చిన కొత్తల్లోనే ఎక్కడికక్కడ దందాలు.. రౌడీయిజం వంటివి మొదలెట్టి ఇదీ మా బ్రాండ్.. ఇదీ మా స్టైల్ అని చెప్పుకునే విధంగా అడుగులు మొదలెట్టారు. దీంతో ప్రజల్లో వీళ్ళు ఏదో చేస్తారు?.. అనుకుంటే చివరకు రౌడీయిజం చేస్తున్నారా అనే అభిప్రాయాలూ మొదలయ్యాయి. తెలుగుదేశానికి మొదట్నుంచి పట్టున్న జిల్లాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా ప్రజలకు ఏదో చేస్తాం.. పథకాలిస్తాం.. ఉద్యోగాలిస్తాం.. పారిశ్రామిక ప్రగతి చేసి చూపిస్తాం అంటూ ఘనంగా చెప్పుకుని వచ్చిన ఈ నాయకులు. వస్తూనే రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కో పేజీలో ఎవరి పేర్లు ఉన్నాయి.. వారిలో అధికారులు ఎవరు ? వైఎస్సార్సీపీ నాయకులూ ఎవరన్నది ఏరుకుని మరీ టార్గెట్ చేసి కేసులు పెట్టడం.. లొంగనివారిపై.. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించడం వంటి పనులు తప్ప ప్రజలకు పనికొచ్చేది ఏమీ చేయలేదన్న అభిప్రాయం మొదలైంది. దీంతోబాటు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు చేయడం.. ఆలయాల్లో విధ్వంసాలు.. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇంకా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు.. ఇలాంటి అవలక్షణాలు తప్ప కాన్ఫిడెంట్ గా ప్రభుత్వాన్ని నడిపే పనిలో లేకపోవడాన్ని ప్రజలు గ్రహించారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత లోలోన నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. బయటకు అందరూ ఆహా.. ఓహో అని అంటున్నా.. ప్రజల్లో మాత్రం ఇది ఉత్త డబ్బారాయుడి ప్రభుత్వం అనే అభిప్రాయం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో.. మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన స్థానాల్లో సైతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల అబ్బే.. ఏదో అనుకున్నాం.. ఏం లేదు అనే భావన వినిపిస్తోందని అంటున్నారు. బాబు పాలన ఏడాదైన సందర్భంగా కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవానికి వైయస్ జగన్‌కు గట్టిపట్టున్న రాయలసీమలో కూడా 2024 ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 52 సీట్లున్న పూర్వపు రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూటమికి 45 స్థానాలు దక్కాయి. వైఎస్సార్సీపీ కడపలో 3, చిత్తూరు.. కర్నూలులో రెండేసి చొప్పున మొత్తం ఏడు స్థానాల్లోనే గెలిచింది. అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది సర్వేలు చెబుతున్నాయి. సీమలో గెలిచినా 45 మందిలో పట్టుమని పదిమందికి కూడా ప్రజల్లో పట్టు చిక్కలేదు. అందుకే ఏకంగా 33 మందిమీద తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందులో 29 మంది ఎమ్మెల్యేలకు అయితే అనవసరంగా వీళ్ళను ఎందుకు గెలిపించామురా దేవుడా అని ప్రజలు లోలోన బాధపడుతున్నారట. వాళ్ళు మళ్ళీ గెలవడం అసాధ్యమని ప్రజలు చెబుతున్నారు. ఇక ఇటు వైసిపి నేతలు.. ఓడిపోయినా ఎమ్మెల్యేలమీద ప్రజలకు గురికుదిరిందని.. వాళ్ళుంటేనే బావుణ్ణని ప్రజలు అనుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. మొత్తానికి చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా నిలిచిపోతారని అంటున్నారు. అధికారం వచ్చింది సొంత ఆస్తులు పెంచుకోవడానికి అనే భావనలో ఉన్న నాయకులకు గడ్డుకాలమే అని అంటున్నారు.- సిమ్మాదిరప్పన్న -
సూపర్ సిక్స్ కాదు.. ఫస్ట్ బాల్కే కూటమి అవుట్: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, హైదరాబాద్: సూపర్ సిక్స్ అని గొప్పగా చెప్పుకునే సీఎం చంద్రబాబు ప్రజల దృష్టిలో మొదటి బాల్కే అవుట్ అయ్యారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశానంటూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు న్యాయం చేస్తే.. హామీలను అమలు చేయకుండానే నెరవేర్చేసినట్టు కూటమి సర్కార్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు తగ్గి, ఆదాయం పెరిగితే.. కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి, అప్పులు పెరిగాయనే విషయాన్ని ఆధారాలు, గణాంకాలతో సహా వివరించారు. వాస్తవాలను దాచిపెట్టి, అద్భుతమైన పాలనను అందించామని.. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించనని చంద్రబాబు బెదిరించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తాను వెల్లడించిన గణాంకాలు వాస్తవం కాదు అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే..తల్లికి వందనం మహామోసంతల్లికి వందనం పథకం ప్రారంభం.. ఏడాది పాలన పూర్తి సందర్భంగా చంద్రబాబు మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలను మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశామంటూ, దానిపై మాట్లాడినే నాలుక మందం అంటూ ప్రతిపక్షంతో పాటు ప్రజలకు కూడా హెచ్చరికలు చేశారు. ఎన్నికల ముందు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున 87 లక్షల మందికి ఇస్తామని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు అందులో 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. అదికూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 2.07 కోట్ల మందికి నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. 53.50 లక్షల మందికి రైతు భరోసా కింద రూ.20 వేల చొప్పున ఇస్తామన్నారు. ఇందుకు ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైగా అవసరం కాగాజజ కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఉద్యోగం రాని యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 1,54,047 మందికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని ఊదరగొట్టారు. వాటిని ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా వాటినే వైఎస్సార్సీపీ అడుగుతోంది. వాటికి సమాధానంగా అన్ని సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాశానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది.బడ్జెట్, వ్యయాలు.. సంక్షేమ లెక్కలివి– వైఎస్సార్సీపీ 2023–24లో బడ్జెట్ రూ.2,35,780 కోట్లు. 2024–25లో కూటమి ప్రభుత్వ బడ్జెట్ రూ.2,45,076 కోట్లు. అంటే మా కంటే కూటమి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బడ్జెట్లో ఎక్కువగా పెట్టింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి జీతాల కోసం వెచ్చించింది రూ.52 వేల కోట్లు. పెన్షన్లు రూ.21,500 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.29,500 కోట్లు. ఇవన్నీ కలిపితే మొత్తం రూ.1,03,000 మా ప్రభుత్వ హయాంలో చేసిన వ్యయం. మూలధనం పెట్టుబడి కింద చేసిన వ్యయం రూ.23,300 కోట్లు. మొత్తం బడ్జెట్ రూ.2,35,780 కోట్లలోనే జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు చేసిన వ్యయాలను తీసేస్తే మిగిలిన నిధులు సుమారుగా రూ.1,09,000 కోట్లు. ఈ నిధుల నుంచే వైఎస్ జగన్ ప్రకటించిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశాం.– కూటమి ప్రభుత్వంలో జీతాల కోసం ఖర్చు చేసింది రూ.59 వేల కోట్లు, పెన్షన్లు రూ.27 వేల కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.31 వేల కోట్లు. ఇవన్నీ కలిపితే కూటమి హయాంలో చేసిన వ్యయం మొత్తం రూ.1,18,000 కోట్లు. ఈ ప్రభుత్వంలో చేసిన మూలధన పెట్టుబడి వ్యయం రూ.19వేల కోట్లు. బడ్జెట్లోంచి జీతాలు, వడ్డీలు, పెన్షన్లకు చేసిన వ్యయం తీసేస్తే మిగిలిన నిధులు మొత్తం రూ.1,07,000 కోట్లు. మరి ఇన్ని నిధులు ఉండి కూడా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చంద్రబాబు వివరణ ఇవ్వాలి. కేవలం కూటమి ప్రభుత్వంలో హామీల్లో అమలు చేసింది రూ.వెయ్యి పెన్షన్ పెంచడం తప్ప మరొకటి కనిపించడం లేదు.సంపద సృష్టి అంటే ఇదేనా?– అప్పులపై చంద్రబాబు ఎన్నికల ముందు అనేక అబద్ధాలు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఏపీకి ఉన్న అప్పు రూ.1,40,717 కోట్లు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే 2019 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.3,90,247 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. సీఏజీఆర్ ప్రకారం చూస్తే 22.63 శాతం ఎక్కువగా అప్పులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే 2024 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.3,32,671 కోట్లు. వైఎస్సార్సీపీ హయాంలో సీఏజీఆర్ 13.5శాతం మాత్రమే. ఇవన్నీ కాగ్ నివేదికలో ఉన్న లెక్కలు. వీటిని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారు. శ్రీలంక, కంబోడియాగా ఏపీని మార్చేస్తున్నారంటూ దిగజారుడు ప్రచారం చేశారు. – వైఎస్సార్సీపీ పాలనలో 2022–23లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1,57,768 కోట్లు. 2023–24లో రూ.1,73,767 కోట్లు. ఆ రెండేళ్లలో ఆదాయం చూస్తే 10శాతం పెరిగింది. ఆ ఏడాది అప్పులు చూస్తే 19 శాతం మాత్రమే పెరిగాయి. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అప్పులు 30 శాతం పెంచితే.. ఆదాయం మాత్రం కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి?. 2024 ఏప్రిల్ నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,500 కోట్లు అయితే, 2025 ఏప్రిల్‌లో నాటికి వచ్చిన రాష్ట్ర జీఎస్టీ రూ.2,652 కోట్లు. అంటే.. 24 శాతం తక్కువగా వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం 2024లో రూ.7,483 కోట్లు కాగా, 2025లో వచ్చిన ఆదాయం రూ.6,569 కోట్లు. అంటే 12 శాతం ఆదాయం పడిపోయింది. పన్నేతర ఆదాయం ఏప్రిల్ 2024లో రూ.442 కోట్లు అయితే, 2025 ఏప్రిల్ నాటికి రూ.345 కోట్లు. అంటే 22 శాతం తక్కువ. ఏప్రిల్ 2024లో పన్ను, పన్నేతర ఆదాయం కలిపి లెక్కిస్తే రూ.7,925 కోట్లు కాగా, 2025 ఏప్రిల్ నాటికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.6914 కోట్లు. అంటే 12 శాతం తక్కువ.ఉద్యోగుల సొమ్మును వాడేశారుఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏల అమలు ఏదీ. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.32,997 ఉంది. అందులో ఏపీ భాగం 19,138 కోట్లు. 2014–19 నాటికి రూ.76,516 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన రూ.57,378 కోట్ల సొమ్మును అదనంగా వాడుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.76,038 కోట్లు. అంటే మేం ఉద్యోగుల సొమ్మును వాడుకోకపోగా రూ.478 కోట్లను మేం తిరిగి జమ చేశాం. కానీ.. ఉద్యోగుల విషయం మా ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు.ఏడాదిలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్న పవన్‌కళ్యాణ్ ఈ విషయాలపై ఎందుకు దీనిపై మౌనంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని దుకాణాలు వెలవెలబోతుంటే.. ఒక్క మద్యం దుకాణాలు మాత్రమే కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో వ్యాపారాల కోసం కాల్‌మనీ నుంచి ఫైనాన్స్ తీసుకుని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాది కూటమి పాలనపై కేకే సర్వేలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమైందని తేలింది. ఏడాది పాలన తరువాత కూటమి ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోంది. ఏడాదిలో ఎన్నో అరాచకాలు చేశారు. చివరకు ప్రశ్నించే జర్నలిస్ట్‌లను కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి, వేధించారు. -
‘ఉచిత పంటల బీమాకు కూటమి సర్కార్ ఎగనామం’
తణుకు: రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల తరుఫున ప్రీమియం కింద రూ.700 కోట్లు చెల్లించడాన్ని భారంగా చూపుతూ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్నే పూర్తిగా ఎత్తేసేందుకు సిద్దపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైఫరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలిచే ఈ పథకాన్ని తీసేయడానికి వ్యవసాయం అంటే చంద్రబాబుకు ఉన్న చిన్నచూపే కారణమని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం దిగివచ్చి ఉచిత పంటల బీమాకు ప్రీమియంను భరించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..రైతులకు మేలు చేయాలని వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో ఉచిత బీమా పథకాన్ని అమలు చేశారు. దీనిని పూర్తిగా వక్రీకరిస్తూ ఎల్లోమీడియా ఈనాడు పత్రికలో వైకాపా హయాంలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. కూటమి ప్రభుత్వమే ప్రీమియంగా దాదాపు రూ.700 కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఉచిత బీమా పథకాన్ని అటకెక్కించిన మాట వాస్తవం కాదా? ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేసింది. అయిదేళ్ళ పాటు ఈ ఉచిత బీమా వల్ల రైతులకు లబ్ది చేకూరింది. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంతో బీమా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల గత ఏడాది ప్రకృతి వైఫరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు దాదాపు రూ.1300 కోట్ల మేర పరిహారం దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం కడితేనే దానికి కేంద్రం వాటా విడుదల అవుతుంది. కూటమి ప్రభుత్వంలో ఇది జరగలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో అయిదేళ్ళలో సుమారు 5.52 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా కవరేజీ కల్పించాం. 2014-19 చంద్రబాబు హయాంలో ఉచిత పంటల బీమా కింద రైతులకు ఇచ్చింది కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సీపీ హయాంలో పంట బీమా కింద ఇచ్చింది రూ.7800 కోట్లు. ఇదీ రైతులంటే వైఎస్ జగన్ కు ఉన్న ప్రేమ.గత ఏడాది పంటల బీమాకు ఎగనామంకూటమి ప్రభుత్వం గత ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్నికి ఎగనామం పెట్టింది. ఏడాది కాలంగా రైతుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతులకు ఈక్రాప్ వల్ల ఉచిత పంటల బీమాను పకడ్బందీగా అమలు చేశాం. దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేను ఏర్పాటు చేసి విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు బాసటగా నిలిచాం. వైఎస్ఆర్ రైతుభరోసా కింద అయిదేళ్ళలో రూ.34,200 కోట్లను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, నేటికీ దానిని అమలు చేయలేదు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి నెలలు గడుస్తున్నా వారికి చెల్లించాల్సిన డబ్బులను కూడా జమ చేయలేదు. మంత్రులు నాదెండ్ల మనోహర్‌ను రైతులు నేరుగా నిలదీస్తున్నా వారిలో చలనం కలగడం లేదు.ఒకవైపు ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోళ్లు అరకొరగా చేస్తున్నారు, మరోవైపు మధ్యదళారీలు తక్కువ రేట్లకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం అమ్మి రైతులు డబ్బు కోసం ఎదురుచూస్తుంటే ఈనాడుకు కనిపించడం లేదా? పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలబడేందుకు వైఎస్ జగన్ వెడితే దాదాపు లక్ష మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గోడును ఆయన దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ైయస్ జగన్ పర్యటన కాగానే వెంటనే ప్రభుత్వం హడావుడిగా పొగాకు కొనుగోళ్ళకు ప్రయత్నిస్తోంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం ద్వారా రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తోంది. రైతుల తరుఫున ప్రీమియను ప్రభుత్వమే చెల్లించి, రైతులను ఆదుకోవాలి. రైతు అమ్ముకునే సందర్బంలో గిట్టుబాటు ధర లేక అన్యాయమై పోతున్నాడు. ప్రజలు మాత్రం అధిక రేట్లకు కందిపప్పు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో దళారీలు దోచుకుంటున్నారు. వీరిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కంది రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి, మార్కెట్లో కందిపప్పు రేట్లను నియంత్రించాలి. మామిడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. -
‘పథకం ప్రకారమే పొదిలిలో రాళ్ల దాడి’
తాడేపల్లి: పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పొదిలికి వచ్చిన వైయస్ జగన్ పై కుట్రపూరితంగానే టీడీపీ రాళ్ళ దాడి చేయించిందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ ఎక్కడకు వెళ్ళినా పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాధరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేక పోతోందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే పొదిలిలో ఒక ప్రణాళిక ప్రకారం జగన్ కాన్వాయిలో అరాచకం సృష్టించేందుకు హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...పొగాకు వేలం కేంద్రానికి వైయస్ జగన్ వేలాది మందితో ర్యాలీగా వస్తుంటే టీడీపీ దాడులకు తెగబడింది. కొంతమంది నల్లబెల్లూన్లతో నిరసన తెలిపే పేరుతో ముందు నిలబెట్టి వారి వెనుక రాళ్ల కుప్పను ఏర్పాటు చేసి, ర్యాలీపైకి రాళ్ళతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా ఈ ప్రతికా సమావేశంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శిస్తున్నాం. ఈ వీడియోల్లో చాలా స్పష్టంగా ఎలా టీడీపీ మూకలు దాడి చేశాయో చూడవచ్చు. మాజీ ముఖ్యమంత్రి ర్యాలీగా వస్తుంటే నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిలబడి నిరసన తెలిపే వారికి పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారు? నిరసనకు ఎవరు పర్మిషన్ అడిగారు? ఆ అర్జీ ఎక్కడుందో చూపించాలి. రాళ్ల దాడులకు పాల్పడిన వారిలో నలుగురైదుగురు తప్ప స్థానికులు ఎవరూ లేరు. కేవలం అక్కడ స్థానికుల ఇంటి స్థలాన్ని మాత్రమే దాడులకు వాడుకున్నారు. టీడీపీ వారు మా ర్యాలీపై దాడులు చేస్తుంటే జిల్లా ఎస్పీ స్వయంగా నిలబడి వారికి రక్షణ కల్పించడం దారుణం. ఈ రాళ్ల దాడుల్లో తలలు పగిలి అమాయకులైన రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దాడులు చేసిన వారిని వదిలేసి పోలీసులు లాఠీలతో వాతలు తేలేలా రైతులను చావబాదారు. మళ్లీ అర్థరాత్రి వేళ మా నాయకుల ఇళ్లమీద పడి జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులను అరెస్ట్ చేశారు. మన్నం శ్రీధర్ అనే మా పార్టీకి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శిని బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఇంట్లో నుంచి ఎందుకు తీసుకెళ్లారు? ఆయనేమైనా రౌడీషీటరా? ఆయన మీద ఏమైనా కేసులున్నాయా? ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా? నష్టపోతున్న పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అడగడం మా పార్టీ చేసిన తప్పా? రైతులను కొట్టిన పోలీసుల మీద సుమోటోగా కేసులు నమోదు చేయాలి.నిరసనకి ఎలా అనుమతించారు?జగన్ కార్యక్రమానికి వేలాదిగా జనం వస్తారని తెలిసి కూడా నిరసనలకు ఎలా అనుమతించారు? ఏదైనా జరగరాని సంఘటన జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? 50 వేల మంది ర్యాలీగా వచ్చి 40 మంది మీద దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదా? కానీ నిరసన పేరుతో టీడీపీ నాయకులు ఎంతగా కవ్వించినా మా కార్యకర్తలెవరూ చలించలేదు. క్రమశిక్షణతో నడుచుకున్నారు కాబట్టే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మా నాయకుడి మాదిరిగానే మా కార్యకర్తలకు విలువలు, విశ్వసనీయతకి ఈ ఘటన ఉదాహరణ. 40 మంది టీడీపీ నిరసనకారుల కోసం 400 మంది పోలీసులను రక్షణగా మోహరించారు. దాడుల కోసం ఇళ్లపై రాళ్లకుప్పలను సిద్ధం చేసుకున్నారు. టీడీపీ నాయకులే దాడులకు తెగబడినట్టు ఎన్నో వీడియోలు సాక్ష్యంగా ఉన్నా మా నాయకుల మీదనే అక్రమ కేసులు నమోదు చేశారు. ఆఖరుకి జైళ్లలో ఉన్న వారి కోసం పరామర్శకు వెళితే మా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి మీద ఈ దుర్మార్గపు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మా నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పట్ల సీఐ దురుసుగా వ్యవహరించాడు.మహానటులు టీడీపీ నేతలుపొరుగు రాష్ట్రంలో సినిమా రంగంలోని నిష్ణాతులకు ఇచ్చిన అవార్డులను రాజకీయాల్లో అత్యుత్తమ నటులు, దర్శకులుగా ఉన్న టీడీపీ వారికి ఇవ్వాలి. ఉత్తమ దర్శకుడు అవార్డు ఏపీ సీఎం చంద్రబాబుకి, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు కొలుసు పార్థసారథికి, ఉత్తమ కమెడియన్ అవార్డు పట్టాభి చౌదరికి, ఉత్తమ విలన్ నారా లోకేష్‌కి ఇవ్వాలి. వారే దాడులు చేసి మేమే దాడులు చేసినట్టు మా నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దళితుల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత తెనాలిలో దళిత యువకులను పరామర్శించడానికి వెళితే వారి మీద రౌడీషట్ ఉందని ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి చనిపోతే పరామర్శించడానికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వెళ్లారు. ఆ వీరయ్య చౌదరి మీద కూడా ఆరు క్రిమినల్ కేసులున్నాయి. వారు చెప్పేదాని ప్రకారం నేరారోపణలు ఉన్నప్పుడు పరామర్శించడానికి ఎలా వెళ్లారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వెళ్లొచ్చా? దళితులను పరామర్శించడానికి మేం వెళితే తప్పు, మీ పార్టీ నాయకుల కోసం మీరు వెళితే ఒప్పా? దీనికి మంత్రి కొలుసు పార్థసారథి సమాధానం చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో పట్టాభి చౌదరి పేపర్ పులి. ప్రత్యక్ష రాజకీయాల్లో కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని పట్టాభి చౌదరి, మాజీ సీఎం వైయస్ జగన్ ను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పటికే వైయస్ జగన్‌ని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడి రాష్ట్రంలో గతంలో జరిగిన అనేక సంఘటనలకు పట్టాభి బాధ్యుడయ్యాడు. ఇప్పటికీ ఏమయ్యా జగన్ రెడ్డీ అంటూ తన నోటిదూల ప్రదర్శిస్తున్నాడు. నోటికొచ్చినట్టు పేలితే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నా. వైయస్ జగన్ అంటే మీకు ఇష్టం లేకపోయినా ఆయన రాష్ట్రంలోని ఎంతోమందికి దేవుడు. తాడేపల్లి కొంప, బెంగళూరు కొంప అని నీచంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే పట్టాభి మీద కేసులుండవా? రెడ్ బుక్ పేరుతో మా పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులన్నీ గుర్తుంచుకుంటాం. అన్నింటికీ వడ్డీతో సహా చెల్లించుకుంటాం. రైతన్నలను పరామర్శించడానికి వెళితే ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన రాళ్ల దాడిని ఈ రాష్ట్ర రైతులంతా చూశారు. ఈ రాళ్లే రేపటి రోజున జగన్ మీదకి పూలవుతాయి. టీడీపీ వేసిన చెప్పులే ఆయన మెడలో మాలలవుతాయి. మంత్రి పార్థసారథి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. పట్టాభి చౌదరిని టీడీపీ నాయకత్వం కంట్రోల్ లో పెట్టుకోవాలి. వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధించడం మీద పెట్టిన శ్రద్దను ప్రజాసమస్యల పరిష్కారం మీద పెట్టాలి’ అని టీజేఆర్ సూచించారు. -
‘ఏడాదంతా మోసమే.. అంతా అభూత కల్పనే’
తిరుపతి: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిస్తూనే ఉందని విమర్శించారు తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుడ భూమన కరుణాకర్‌రెడ్డి. తమ నాయకుడు వైఎస్ జగన్.. రూ. 2 లక్షల 80 కోట్లు డీబీటీ రూపంలో ప్రజలకు నేరుగా అందిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. ఈరోజు(ఆదివారం, జూన్ 15వ తేదీ) ‘జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని భూమన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు సిఫాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యే సునీల్, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా భూమన మాట్లాడుతూ.. 2 కోట్ల 7 లక్షల మంది మహిళలకు నెలకు రూ. 1500 ఇవ్వకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన వ్యక్తి.. ఈ రోజు మోసం చేసిన విషయం కళ్లకు కనపడుతోందన్నారు. 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం మోసం. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని మోసం. తల్లికి వందనపై ప్రశ్నించే వాళ్లకు బెదిరింపులు. ఈ ఏడాది మొత్తం మోసాలు చేశాడు.. ఒక అభూత కల్పనతో మోసగించాడు. వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేయించి కేసులు పెట్టి జైల్లో పెట్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు’ అని భూమన ధ్వజమెత్తారు. -
‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలు, మోసాలపై ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ఆవిష్కరించారు. కన్న బాబురాజు, కంబాల జోగులు, అదీప్ రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏడాది కాలంలో లక్ష యాభై వేల కోట్ల అప్పు తప్ప చేసిందేమీ లేదు.. త్వరలో అక్రమ మైనింగ్‌పై కూడా పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలను కూడా అమలు చేశారని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు.కూటమి మోసాలపై వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ.. విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎంపీ బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.అక్రమాల్లో చంద్రబాబు పీహెచ్డీ: గొల్ల బాబురావుపేద ప్రజలను మోసం చేయడం.. అక్రమాలు చేయడంలో చంద్రబాబు వేయి పీహెచ్‌డీలు చేశాడు. వైఎస్ జగన్ సంక్షేమ పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. మోసం పోయాం అని గ్రహించి ప్రజలు మళ్లీ జగన్‌ను గెలిపించాలని అనుకుంటున్నారు. జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం అని ప్రజలకు వివరించాలి.హమీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలం: కేకే రాజుఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించారు. నాడు ఏడాదిలో జగన్ అన్ని పథకాలను అమలు చేశారు. జగన్ ఇచ్చిన మాట మీద నిలబడితే.. బాబు మోసం చేశాడు. ఎల్లో మీడియాలో ప్రతీ రోజూ అబద్దపు కథనాలు రాస్తున్నారు. హామీల గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని లోకేష్ బెదిరిస్తున్నాడు.అప్పులు చేయడం సంపద సృష్టించడమా?: వరుదు కల్యాణిగతంలో మూడు సార్లు సీఎంగా చేసిన బాబు ఎప్పుడూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రజలను బాబు మరోసారి మోసం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరే.. మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడ పిల్లలగా పుట్టడమే పాపమా అన్నట్టు ఉంది. ప్రభుత్వ దృష్టి అంతా అమరావతి అవినీతిపైనే ఉంది. ఏడాదిలో జగన్ 90 శాతం హామీలు అమలు చేశారు. బాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది: వాసుపల్లి గణేష్ కుమార్చంద్రబాబు ఒక్కడే ఎప్పుడూ జగన్‌ను ఢీ కొట్టలేడు. పవన్, బీజేపీని కలుపుకొని బాబు గెలిచాడు. జగన్‌కు 40 శాతం ఓట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం. లోకేష్ నాయకుడిగా ఎదగలేడు.. ఆయన నాయకత్వం ముందుకు సాగదు. సంపద సృష్టిస్తా అని అధికారంలోకి వచ్చి.. అప్పు చేసి తల్లికి వందనం ఇచ్చారు. అసెంబ్లీని రబ్బర్ స్టాంప్‌లా చేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనంతరం జగన్ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు. జగన్ మచ్చ లేని నాయకుడు.. ఆయన ఏ తప్పు చేయలేదు. నాయకులు, అధికారుల తప్పిదం వలన ఓడిపోయాం. కూటమి పాలనలో తప్పులు చేసిన వారు ఎక్కడున్నా తీసుకొస్తాం. -
మంత్రి సొంత జిల్లాలోనే ఇలానా.. చేతులెత్తేసిన కూటమి సర్కార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే దారుణం జరిగింది. మైదుకూరులో పట్టపగలే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం పడింది. నిర్వహణ చేతకాక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనిఖీకి వెళ్లిన సందర్భంలో తాళం వేసిన ఆసుపత్రి దర్శనమిచ్చింది.వైఎస్ జగన్ హయాంలో మంచి భవనాలు కట్టించి.. సిబ్బంది ఏర్పాటు చేశారు. అన్ని వసతులు సమకూర్చినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం చేతకాక తాళం వేశారు. సిబ్బంది తాళం వేసుకుని వెళ్లిపోయారంటూ టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్ నానా హంగామా చేశారు. డీఎం అండ్ హెచ్‌వోకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ హుకుం జారీ చేశారు.సొంత పార్టీ ఎమ్మెల్యే తనిఖీలోనే కూటమి ప్రభుత్వ చేతగానితనం బట్టబయలైంది. కనీసం మండల స్థాయిలో ఉన్న పీహెచ్‌సీని కూడా నిర్వహించలేని కూటమి సర్కార్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విఫల మంత్రి అంటూ కామెంట్లు పెడుతున్నారు -
‘సూపర్ సిక్స్ కాదు.. ఫస్ట్ బాల్కే కూటమి ఔట్’
సాక్షి, హైదరాబాద్: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహా మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామన్నారు, ఏమైంది?. తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహా మోసం చేస్తోంది. రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా?.మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామన్నారు.. ఏమైంది?. మహిళలకు ఉచిత బస్సు ఇంకా ఎప్పుడు ఇస్తారు?. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలు ఎక్కడ?. రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వాలి. సవాలక్ష ఆంక్షలతో పిల్లల సంఖ్య 66 లక్షలకు తగ్గించే కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజ సంపదను రూ.9 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్లో జరిగే కార్యక్రమాలు జరగడం లేదని ప్రజలు అంటున్నారు. సూపర్ సిక్స్ ఏమో కానీ.. ఫస్ట్ బాల్కే కూటమి ఔట్ అని సెటైర్లు వేశారు. ప్రశ్నలు చంద్రబాబుకు నచ్చవు.. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అది ప్రజలు అయినా ప్రతిపక్షం అయినా సరే. ఆర్థికశాఖ మీరే రివ్యూ చేస్తే మరి ఆర్థికశాఖ మంత్రి ఏం చేస్తున్నారు. ఏపీఎండీసీని శాశ్వతంగా తాకట్టు పెట్టారు. ఎన్నికల ముందు ఇంటి ఇంటికి వెళ్లి అబద్దాలు చెప్పారు. అధికారం లోకి వస్తే ఒకటికి నాలుగురెట్లు హామీలు ఇస్తామన్నారు. ఇప్పుడిపుడే ప్రజలకు మొత్తం అర్ధం అవుతుంది. మీరు చెప్పింది చేయక పోతేనే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.ఇప్పుడు శ్రీలంక కావడం లేదా?మా హయాంలో ఒక పథకం ఒకరోజు ఆలస్యం అయితే మీడియా హడావుడి చేసింది. మరి ఇప్పుడు ఏమైంది ఒక్కరూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు మాకంటే ఎక్కువ అప్పులు చేస్తుంటే శ్రీలంక అవడం లేదా?. సంక్షేమ పథకాల్లో పీపీపీ కాన్సెప్ట్ ఏంటో అర్ధం కావట్లేదు. పథకాల పేర్లు అయితే బాగుంటాయి. కానీ ఒక్కటి నెరవేరదు. టీడీపీకి పునాది సినిమా ఫీల్డ్ అందుకే పథకాల పేర్లు బాగుంటాయి. యువగలం పేరుతో యువకులను మోసం చేశారు. 20 లక్షల మంది యువకులను మోసం చేశారు. పోయిన బడ్జెట్లో సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. మరి ప్రజలకు ఇచ్చారా?. ఆస్తి పోయినా ఆరోగ్యం పోయిన సంపాదించుకోవచ్చు. చంద్రబాబు ప్రతీసారి మోసాలతో క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. బడ్జెట్ బుక్కులో ఎంత అప్పు ఉందనే సమాచారం కూడా పెట్టలేదు. ప్రశ్నిస్తాన్న వ్యక్తి ఎక్కడ?మేము ఎం చేస్తామో అది చెప్తాం. మీరేమో ఇవ్వబోతున్నాం.. రాబోతుంది అని చెబుతారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ మేము.. ప్రతి నెల ఒక పథకం అమలు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారు. మాకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా?. కరోనా కూడా ఏమి లేదు కదా. మీ బడ్జెట్‌కు మా బడ్జెట్‌కు తేడా 10వేల కోట్లే. కానీ మీ డబ్బంతా ఎటు పోయింది?. ఒక్క సంక్షేమం అమలు చేయలేదు. ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ఎటు పోయాడు.బయట వ్యాపారం జరగడం లేదు. సాయంత్రం 7 గంటలకే షాపులు అన్ని బంద్ అవుతున్నాయి. రాత్రి అయినా కూడా వెలుగులతో నడిచేది వైన్ షాప్ మాత్రమే. ఏపీ లో ప్రజలు మల్లి అప్పుల్లో మునుగుతున్నారు. మళ్లీ కాల్ మనీ వ్యవహారం జరుగుతుంది. వ్యాపారాలు లేక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టిలో వైఎస్సార్సీపీ హయంలో చివరి ఏడాది పది శాతం సంపద పెంచాం. మీరు మూడు శాతం పెంచారు. మరి ఎవరిది సంపద సృష్టి. అప్పు మాత్రం 30 శాతం పెంచారు. జీఎస్టీ వసూళ్ళలో కూడా 24 శాతం తగ్గింది. కానీ, చరిత్రలో అత్యధిక జీఎస్టీ వసూలు అని అబద్దాలు చెప్తున్నారు.ఉద్యోగులకు మోసం.. ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా మోసం చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను వాడుకుంది. రాష్ట్ర విభజన జరిగినపుడు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్‌లో 2014 ఏడాదికి 32,990 కోట్లు ఉండగా అందులో ఆంధ్ర భాగం 19,130 కోట్లు దక్కింది. దాన్ని కాస్త చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేసరికి అది 76,516 కోట్లకి పెంచారు. మా ప్రభుత్వం దిగిపోయేసరికి దాన్ని 76,038 కోట్లకు తగ్గించాం. 478 కోట్లు మేము తిరిగి ఉద్యోగులకు కట్టేశాం. ఇది ఉద్యోగులు బాగా గమనించాలి. దాదాపు 57వేల కోట్లు ఉద్యోగుల డబ్బులు వాడుకుంది బాబు ప్రభుత్వం.సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు.. ఎంతోమంది ప్రముఖ జర్నలిస్టులు వారి అభిప్రాయం తెలియజేస్తారు. కానీ, కొమ్మినేని మీద అంత ద్వేషం ఎందుకు?. ఆయన వయసు చూసైనా బాధ అనిపించలేదా?. మీ కోపాన్ని జర్నలిస్టుల మీద చూపిస్తారా?. జర్నలిస్టుకు ఉండాల్సిన హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజా పరిపాలన చేయండి.. అంతేకానీ.. కోపం, ద్వేషంతో కూటమి పాలన నడుస్తోంది. మీటింగ్స్ పెట్టి మరి వైఎస్సార్సీపీ ఓటు వేస్తే పథకాలు ఇవ్వద్దని చెప్పడం అన్యాయం. మీరు ఒక్క పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి కాదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబూ.. అంత మోసమా: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతులను నిలువునా మోసం చేస్తోందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కువ పంట వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరకు జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం 8 రూపాయలు కిలో కొనుగోలు చేయమని చెప్తే 4 రూపాయలకే కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారు’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షణ లేకుండా రైతులను ఎలా గిట్టుబాటు ధర కల్పిస్తారు?. జ్యూస్ ఫ్యాక్టరీలు వద్ద 100 టోకెన్లు వాళ్లకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చి, మిగిలిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కిలో 15 రూపాయలు యావరేజ్‌కు మామిడి కొనుగోలు చేశారు. గత మూడేళ్లుగా దాదాపు రూ.22 రూపాయలు గిట్టుబాటు ధర పలికింది. ఇప్పుడు మరి దారుణంగా చంద్రబాబు పాలనలో కిలో 4 రూపాయలకు ఫ్యాక్టరీలు కొనుగోలు చేసి మోసం చేస్తున్నారు.ఏలూరు జిల్లా, నూజివీడు, కృష్ణా జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా రైతులపై కేసులు పెట్టారు. ఏ పంటకు మీ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నారో చెప్పాలి. చంద్రబాబు పాలనలో రైతులు గురించి పట్టించుకున్నది ఎన్నడు లేదు. వ్యవసాయం చేయడం దండగ అని చంద్రబాబే అన్నారు’’ అని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.ఏ ఫ్యాక్టరీలో 4 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు జీడి నెల్లూరులో రైతులు ఆందోళన చేశారు. రైతులు సరైన వివరాలు లేకుండా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మామిడి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేస్తున్నా.. రాష్ట్ర వ్యాపారంగా ఉన్న మామిడి రైతులను గిట్టుబాటు ధర 8 రూపాయలు కల్పించి ఆదుకోవాలి’’ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే..
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఓ కార్యకర్తపై పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చెరువుల తవ్వకం విషయమై తన వద్దకు వచ్చిన ఒక కార్యకర్తపై ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్రస్థాయిలో దుర్భాలాడారు.ఈ ఘటనను అదే పార్టీకి చెందిన మరో కార్యకర్త తన సెల్ఫోన్లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ‘జన సైనికుడిపై జనసేన ఎమ్మెల్యే బూతు పురాణం’ పేరిట ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నువ్వెంత పోటుగాడివిరా.. ఎక్కువ మాట్లాడకు.. నువ్వెందుకు దెం.. దెం.. యి,’ వంటి బూతులతో పాటు ఇంకా ఘాటైన పదాలతో దూషించినట్లు ఆడియో ఉంది.నీతి, న్యాయం, ధర్మం గురించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తెగనీతులు చెబుతుంటారని.. ఇప్పుడు బూతులతో రెచ్చిపోయిన తన పార్టీ ఎమ్మెల్యేపై ఆయన ఇప్పుడేమంటారని పలువురు ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు. -
ఉద్రిక్తత.. తలారి రంగయ్య పాదయాత్రకు టీడీపీ అడ్డంకులు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో సేవ్ ఆర్డీటీ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణ దుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. బాల వెంకటాపురం గ్రామంలో పాదయాత్ర చేయొద్దంటూ పోలీసులు హుకుం జారీ చేశారు.బాల వెంకటాపురంలో రాత్రికి రాత్రే టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఫ్లెక్సీలు వెలిశాయి. వైఎస్సార్సీపీ నేతల అల్పాహార శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పోలీసుల తీరుపై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్వార్థ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) కి విదేశీ నిధులు ఆపొద్దని కోరుతూ 16 రోజులుగా మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
కొమ్మినేనిపై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావునుద్దేశించి హోంమంత్రి అనిత వ్యాఖ్యలు హేయం అని వైస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. కొమ్మినేనిపై హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని సుధాకర్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. డిబేట్లో పార్టిసిపెంట్ మాటలను కొమ్మినేనికి ఎలా ఆపాదిస్తారని సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని కడిగేసింది. కొమ్మినేని విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగింది కాబట్టే సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు ఇచ్చింది’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.తన విచక్షణాధికారాన్ని వినియోగించి ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు కొమ్మినేని విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే కొమ్మినేనిపై ఉద్దేశ పూర్వకంగా విషం కక్కుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ ప్రభుత్వం కుట్రను బద్దలు చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తాము చేసిన ఆరోపణలనే ఈ రాష్ట్రం, దేశమే కాదు, కోర్టులు కూడా నమ్మాలన్న భావనలో ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాలన్న విజ్ఞత హోంమంత్రి చూపడంలేదు. ఒక హోంమంత్రికి సుప్రీంకోర్టు ఆదేశాల విలువ తెలియకపోవడం దురదృష్టకరం. హోంమంత్రి అనిత మాటలు సుప్రీంకోర్టును తప్పుబట్టేలా ఉన్నాయి’’ అని పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు, విచారణలో ఉందనే విషయం ఆమెకు తెలియదా?. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై ఒక హోంమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం చట్ట విరుద్ధం. కొమ్మినేని అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె మాటల్లోనే వ్యక్తం అవుతోంది. డిబేట్లు చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి దేశాలు ఇవ్వలేదు. జర్నలిస్టుగా ఆయన వాక్ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యతనూ సుప్రీంకోర్టు గుర్తుచేసింది...కావాలంటే ఆ తీర్పు కాపీని మంత్రికి పంపిస్తాను. తాను అనని మాటలను కొమ్మినేనికి ఆపాదించి, ఆ ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడులకు పోలీసులు పహరా కాశారు. దాడుల్లో పాల్గొన్న వారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలే. వీడియో, ఫొటోల రూపంలో అన్ని ఆధారాలున్నాయి. తుదపరి విచారణలో మొత్తం ఈ వ్యవహారాన్ని కోర్టు ముందుపెడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. లేకుంటే అరాచకం ప్రబలుతుంది’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు, లోకేష్ చెప్పేవన్నీ అబద్ధాలే: అంబటి
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో సూపర్ సిక్స్‌ను అమలు చేసేశాం అంటూ నిసిగ్గుగా సీఎం చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సూపర్‌సిక్స్‌తో పాటు 143 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నామని ఆక్షేపించారు. అయినా ఎల్లో మీడియాలో అద్భుతమని పొగిడించుకోవడం, గొప్ప పాలకుడని డప్పు కొట్టించుకోవడం చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని గుర్తు చేశారు. చివరకు తల్లికి వందనం పథకంలోనూ ఏకంగా 30 లక్షల మందిని తగ్గించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిస్సిగ్గుగా ఆత్మస్తుతి:కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. జాతీయ మీడియాలో సక్సెస్ స్టోరీలు రాయించారు. హైదరాబాద్ నుంచి ఎల్లో మీడియా ఛానళ్లను పిలిపించుకుని, ప్రత్యేక ఇంటార్వ్యూలు ఇచ్చి భజన చేయించుకున్నారు. ఆ మూడు ఎల్లో మీడియా సంస్థల ప్రతినిధులు చంద్రబాబే సిగ్గుపడే స్థాయిలో ఆయనను ప్రశంసించారు. అద్భుతమైన పొగడ్తలతో డప్పు కొట్టే కార్యక్రమం చేశారు. అంత నిస్సిగ్గుగా చంద్రబాబు ఆత్మస్తుతి కొనసాగింది.తల్లికి వందనంలోనూ వంచన:సూపర్‌సిక్స్‌లో తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఈ ఏడాది ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో 84 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చాం. కానీ, ఈరోజు చంద్రబాబు కేవలం 58 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టేశారు. వైఎస్ జగన్ రూ.15 వేలు ఇస్తూ, టాయిలెట్లు, స్కూల్స్ నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించారు. దాన్ని ఆనాడు నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శిస్తూ రెండు వేలు లాగేశారు. రూ.13 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పరాని భాషలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.కానీ, ఇప్పుడు కూడా అవే రూ.13 వేలు ఇచ్చారు. స్కూళ్ల కోసం, విద్యా రంగం కోసం మిగిలిన మొత్తం వ్యయం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంటే మేం చేస్తే తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్పు అవుతుందా? ఇలా ఊరసవెల్లిలా మాట్లాడటానికి నారా లోకేష్‌కు సిగ్గుందా?. తల్లికి వందనంపై ఒకవైపు తండ్రి సీఎం చంద్రబాబు మొత్తం బడ్జెట్ రూ.10,091 కోట్లు అంటుంటే, మరోవైపు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ మాత్రం రూ.8,745 కోట్లు అని చెబుతున్నారు. మరి ఇలా ఇద్దరు వేర్వేరుగా ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదు.సూపర్ సిక్స్‌కు రూ.81 వేల కోట్లు కావాలి:సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను ఇచ్చి, వాటిని నెరవేరుస్తామని మాట ఇచ్చి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తరువాత అన్ని హామీలను గాలికి వదిలేశారు. వాటికి కావాల్సిన నిధులను కూడా కేటాయించలేకపోతున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే రూ.81 వేల కోట్లు అవసరం. వాటి అమలు లేదు. మరోవైపు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1,58,604 కోట్లు వివిధ సంస్థల నుంచి రికార్డు బ్రేక్ చేస్తూ అప్పులు తెచ్చారు.ఈ సొమ్ము ఏం చేశారో తెలియదు. కూటమి పాలన ఇంత దౌర్భాగ్యంగా ఉంటే, తమ పాలన అద్భుతం అని ఎల్లో మీడియాలో చెప్పుకోవడానికి సిగ్గు పడాలి. తల్లికి వందనంలో దగా, మోసం. విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మ ఒడి లెక్కలు తనకు అర్థం కావడం లేదంటూ అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం అర్థం కాని మొద్దు అబ్బాయినని లోకేష్ అంగీకరిస్తున్నారా?.నాడు పథకాలకు రూ.4.58 లక్షల కోట్లు:వైఎస్సార్సీపీ కేవలం నాలుగు పేజీల మేనిఫేస్టోను విడుదల చేసి, వాటిలో ఏడాదిలోనే 90 శాతం అమలు చేసింది. తొలి ఏడాదిలోనే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేసింది. రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. అయిదేళ్ళలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద రూ.2,73,756.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశాం. నాన్ డీబీటీ కింద రూ.1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం. అలా మొత్తం రూ.4,58,360.43 కోట్లతో అయిదేళ్ళలో ప్రజలకు వివిధ పథకాల కింద ప్రయోజనం కలిగించాం.మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?:ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ళ వారు 1.80 కోట్ల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సి వస్తే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా ఈ పథకం ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇస్తారో లేదో తెలియదు. దీపం పథకం కింద 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.ఒక్కో కుటుంబానికి మూడు సిలెండర్లు ఇవ్వాలంటే ఒక్కో సిలెండర్ రూ.850 చొప్పున మొత్తం ఏడాదికి రూ.4,083.48 ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు కేవలం ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, దానికి చేసిన వ్యయం రూ.865 కోట్లు మాత్రమే. దీపం పథకాన్ని అమలు చేసేశామని చెప్పుకున్నారు. ఈ పథకంలో మొత్తం రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు అన్నారు. ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.3500 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా దీనిని ఎగ్గొట్టేశారు.హామీల అమలుకు కేటాయింపులు ఏవీ?:యాబై ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో ఈ కేటగిరిలో మొత్తం 20 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.9600 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఇవ్వాల్సి వస్తే రూ.7200 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే రైతుభరోసా కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.1,716 కోట్లు ఇవ్వాల్సి ఉంటే, దానికీ పంగనామాలు పెట్టేశారు.సాక్షి కార్యాలయాలపై దాడులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి:కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ జర్నలిస్ట్‌ను కక్ష సాధింపుతో అరెస్ట్ చేసిన ఘటనపై సుప్రీంకోర్డు మొట్టికాయలు వేసింది. అయినా గుంటూరులో తెలుగుదేశం పార్టీ మహిళలు వైయస్ భారతమ్మ క్షమాపణలు చెప్పాలని ధర్నా చేశారు. అంతకు ముందు టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల సాక్షి మీడియాపై విషం చిమ్మారు. కార్యాలయాలపై దాడులు చేశారు. తక్షణం వీటికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.సభ్యత, సంస్కారంతో వ్యవహరించాలని చంద్రబాబు, లోకేష్‌ను హెచ్చరిస్తున్నాం. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీని భూ స్థాపితం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. తెలుగుదేశం తప్ప ఈ రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని ఆయన అనుకుంటున్నారు. కానీ, అది ఏ మాత్రం సాధ్యం కాదు. నిజానికి రాబోయే రోజుల్లో చంద్రబాబు మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని అంతా అంటున్నారని అంబటి రాంబాబు చెప్పారు. -
తల్లులను మోసగించిన మిమ్మల్ని ఏమనాలి బాబూ?: ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. ‘‘సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే, నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు. ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అడ్డగోలు షరతులతో కొందరికే పథకాన్ని పరిమితం చేశారు. తల్లులను మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి చంద్రబాబూ’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు.‘‘ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు షరతులతో వాటికి కోత విధిస్తుండడం నిజం కాదా?. తాజాగా తల్లికి వందనం పథకాన్ని ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రీయ విద్యాలయం (KV) విద్యార్థుల్ని మొత్తానికి మొత్తం అనర్హులుగా చేయడం నిజం కాదా?’’ అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.‘‘గతంలో జగనన్న హయాంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ప్రతి తల్లీకి అమ్మ ఒడి లబ్ధి చేకూర్చాం. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయి. కానీ ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు, దాంతో తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు వాపోతున్నారు...పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ, మరోవైపు ఎగ్గొట్టారనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటి విన్యాసాలు మున్ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని చేస్తుందో అనే ఆందోళన ప్రజల్లో వుంది. అందుకే జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు.’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు. -
పోలీసుల నోటీసులపై ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, ప్రకాశం జిల్లా: పోలీసుల నోటీసులపై దర్శి ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పందించారు. తాను ఎక్కడికి పారిపాలేదని.. పిల్లలను చూడటానికి హైదరాబాద్ వెళ్లానని తెలిపారు. ‘‘పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తా.. పోలీసుల నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని బుచేపల్లి శిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారంటూ పొదిలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా, నిరసనలు చేసి గొడవలు సృష్టించి.. వైఎస్సార్సీపీ శ్రేణుల పై దాడి చేసిన వారిపై మాత్రం పోలీసులు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపైనే కేసులు పెట్టి.. ఇప్పడు ఎమ్మెల్యేకి నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తల్లికి వందనం పేరుతో తల్లులకు వంచన: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది అమలు చేసినా తల్లికి వందనం పథకంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ తల్లులను మోసం చేసిందని, అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారులను గణనీయంగా తగ్గించారని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలోమాట్లాడారు.యూడైస్ రిపోర్టు మీద అబద్ధాలు:తల్లికి వందనం పేరుతో తల్లికి వంచన చేశాడు సీఎం చంద్రబాబు. జిల్లాల వారీగా దేశంలో విద్యార్థుల వివరాలు సేకరించడానికి యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్)ను ప్రామాణికంగా తీసుకుంటారు. కలెక్టర్ల ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల వివరాలను తీసుకుని యుడైస్ ద్వారా కేంద్రానికి నివేదిక ఇస్తుంటారు. దీని ప్రకారం రాష్ట్రంలో 87,41,855 మొత్తం మంది విద్యార్థులు ఉంటే దాదాపు రూ.13,110 కోట్లు చెల్లించాలి.కానీ ప్రభుత్వం కేవలం రూ.8,745 కోట్లు మాత్రమే చెల్లించి మూడో వంతు విద్యార్థులకు చెల్లించకుండా మోసగించింది. ఇంటర్ వరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరుతో పథకానికి అర్హులు కాకుండా ప్రభుత్వమే మోసగించింది. దీనినై వైఎస్సార్సీపీ తరఫున ప్రశ్నిస్తుంటే, టీడీపీ నాయకులు యూడైస్ రిపోర్టు మీద కూడా అబద్ధాలు చెబుతున్నారు. ఎల్కేజీ, యూకేజీ, అంగన్వాడీ పిల్లలను మినహాయించి ఈ యూడైస్ రిపోర్టును తయారు చేసినట్టు స్పష్టంగా ఉన్నా, బయట రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారంటూ వక్రభాష్యాలు చెబుతున్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, మంత్రి నారా లోకేష్ ఎదురుదాడి చేస్తూ, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.నాడు జే ట్యాక్స్ అన్నారు. ఇప్పుడేమంటారు?:ఎప్పుడిస్తారో తెలియని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అడ్డం పెట్టుకుని ఇంట్లో ఎవరైనా ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందుతున్నా తల్లికి వందనం పథకం అమలు చేయలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పిల్లలకూ పథకాన్ని వర్తింప చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అందే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డబ్బులు మినహాయించి లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ చేశారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన పాపాన పోలేదు. కానీ రేషన్ కార్డు లేదనే కారణంతో పథకం ఎగ్గొట్టారు. మా హయాంలో స్కూల్ నిర్వహణ కోసం అమ్మ ఒడిలో వెయ్యి రూపాయలు మినహాయిస్తే జే ట్యాక్స్ అంటూ నారా లోకేష్ విషప్రచారం చేశాడు. కానీ తల్లికి వందనంలో చెప్పాపెట్టకుండా ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా రూ.2 వేలు లాగేసుకున్నారు. దీనికి మంత్రి నారా లోకేష్ ఏం సమాధానం చెబుతాడు?.విద్యావ్యవస్థ సర్వనాశనమైంది:నారా లోకేష్ నేతృత్వంలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యింది. నారా లోకేష్ నిర్వహించే ఈ శాఖలో నిర్వహణ, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బడులు ప్రారంభించే నాటికి బదిలీలు పూర్తి చేయలేదు, పైగా బడులు ప్రారంభమైన నాలుగైదు రోజులకు టీచర్ల ట్రైనింగ్ క్లాసులు మొదలుపెట్టారు. జీవో నెంబర్ 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కాలంగా రద్దు చేయకపోగా దానికి ప్రత్యామ్నాయంగా మరో మూడు జీవోలు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరంచెల విద్యావిధానాన్ని తీసేసి 9 అంచెల విధానాన్ని తీసుకొచ్చారు. బడులు ప్రారంభం అయ్యే నాటికి ఇవ్వాల్సిన విద్యాకానుక కిట్లు ఇప్పటికీ చాలా స్కూళ్లకు చేరలేదు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీ విధానంలో పలుకుబడి ఉన్నారికి, డబ్బులిచ్చినవారికే ప్రాధాన్యత లభించిందే కానీ ఎక్కడా నిబంధనలు అమలు జరగలేదు. గతంలో 3,158 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే, వాటిని పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించాడు. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సుమారుగా 1303 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కొనసాగిస్తామని, 1076 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చేస్తామని మరో అడ్డగోలు నిర్ణయం తీసుకుంది.నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాడు–నేడు ద్వారా రెండు విడతల్లో దాదాపు రూ. 12 వేల కోట్లు వెచ్చించి 38 వేల ప్రభుత్వ బడులను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులను అటకెక్కించారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ సిలబస్, 8 తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు వంటి వినూత్న ఆలోచనతో దేశంలో ఏపీ విద్యావ్యవస్థను ఉన్నత స్థానంలో నిలబెడితే ఏడాది పాలనతోనే వాటికి ఆనవాళ్లు లేకుండా చేసేశారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు భయపడిపోయే దుస్థితి కల్పించారు.రూ.1306 కోట్లు వెచ్చించి 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబులు పంపిణీ చేయడం జరిగింది. ఆరోతరగతి నుంచి ఆ పైన తరగతులకు రూ.838 కోట్లతో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ), 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశాం. వీటన్నింటినీ కూటమి సర్కారు రద్దు చేసింది. గోరుముద్ద పథకం కోసం ఐదేళ్లలో మా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,244.60 కోట్లు వ్యయం చేసింది. రోజుకో మెనూతో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం పెట్టాం. కానీ కూటమి పాలనలో గోరుముద్ద కాస్త ‘ఘోర ముద్ద’గా మారిపోయింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అతిసారం బారిన పడిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు విడుదల చేసేవాళ్లం. కానీ కూటమి సర్కారు విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.7,800 కోట్లు పెండింగ్ పెట్టింది. 2024–25లో కేవలం రూ.700 కోట్లు విడుదల చేసి, రూ.7,100 కోట్లు బకాయిలు పెట్టింది. 2025–26 బడ్జెట్ లో కేవలం రూ.2,600 కోట్లు కేటాయించినట్లు చూపారు. వీటన్నింటి ద్వారా పిల్లల చదువులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమవుతోంది.వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులువిద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాలను నాశనం చేసిన కూటమి ప్రభుత్వం, మరోవైపు శాంతి భద్రతలు కాపాడడంలోనూ దారుణంగా విఫలమైంది. పొగాకు రైతుల పరామర్శ కోసం పోలీసుల అనుమతితో మా నాయకుడు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లారు. అక్కడికి వేలల్లో వచ్చిన ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు మాపై రాళ్ల దాడికి దిగితే రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. నిరసన పేరుతో అడ్డుకోవాలని చూసిన వారికి రక్షణ కల్పించడమే కాకుండా, మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. చివరకు పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అయిన బూచేపల్లి శివప్రసాదరెడ్డికి కూడా నోటీసులిచ్చారు.దళితులపై దమనకాండ:రాష్ట్రంలో దళితుల కుటుంబాల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. యథేచ్ఛగా చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల దళిత విద్యార్థిని మీద 18 మంది టీడీపీ యువకులు ఆరు నెలలుగా అత్యాచారం చేసిన విషయం సాక్షి వెలుగులోకి తేవడంతో ఆ కుటుంబాన్ని ఊరి నుంచి పంపించివేశారు. ఆ బాలిక కుటుంబం టీడీపీ సానుభూతిపరులే అయినా ఆ పార్టీ నాయకులే అన్యాయం చేశారు. ఇంటర్ చదువుతున్న మరో గిరిజన విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి దారుణంగా చంపేసినా పోలీసులు పట్టించుకోలేదు. వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న మా నాయకులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మీద అక్రమ కేసు నమోదు చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆక్షేపించారు. -
నెల్లూరు జైల్లో కాకాణిని పరామర్శించిన పెద్దిరెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని.. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం.. జైల్లో కాకాణిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడూలేని విధంగా రాజకీయ నేతలకు పీటీ వారెంట్లు వేస్తున్నారన్నారు. చంద్రబాబుకు కూడా ఈ పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. -
తోలు తీస్తామన్న లీడర్లు ఎక్కడ?.. బాధితురాలికి సత్యదేవ్‌తో వివాహం జరిపించాల్సిందే: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించని స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం ఈ ఉదంతంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘దళిత బాలికకు ఎంత అన్యాయం జరిగితే మహిళ కమిషన్ ఎందుకు స్పందించలేదు. ఈ వ్యవహారంపై చంద్రబాబు లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న ఆ నాయకులు ఎక్కడికి వెళ్లిపోయారు?. ఏపీలో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయో?.. 40 రోజులుగా బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎందుకు కేసు కట్టలేదు. కలెక్టర్ ఆదేశించే వరకు డీఎస్పీ కూడా ఇన్వాల్వ్ కాకపోవటం దారుణం. ఎవరి రాజకీయ ఒత్తిడితో పట్టించుకోలేదా?. ఈవీఎం ఎమ్మెల్యే ఒత్తిడి చేశారా?. ఈ వ్యవహారం రాష్ట్ర డీజీపీని కలుస్తాం. ఈ ప్రభుత్వం స్పందించి మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని బాధితులానికి న్యాయం చేయాలి. బాధితురాలికి సత్యదేవ్‌తో వివాహం జరిపించాలి’’ అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. తల్లికి వందనం మోసంపై..మరోవైపు.. తల్లికి వందనం పథకం పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపైనా ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 89 లక్షల మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం కోసం రూ.13,000 కోట్లు ఖర్చు అవుతుంది. బీపీఎల్‌లో ఉన్న వారందరికీ ఈ పథకం వర్తించాలి. అలాంటప్పుడు ఎంతమందికి తల్లికి వందనం లేకుండా చేస్తున్నారు?. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను ఆ జబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం గతేడాది నిధులు విద్యార్థులకు బకాయి ఉన్నారు. ఎంతమంది విద్యార్థులున్నారో అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేయాలి. లేదంటే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’’ అని భరత్ హెచ్చరించారు.కేసు ఏంటంటే..బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మోరంపూడికి చెందిన పులవర్తి సత్యదేవ్ ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి దళిత బాలికను మోసం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్ వద్దకు వెళ్లి తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామి మాలలో ఉన్నానని చెప్పాడు. ఆపై ధవళేశ్వరంలోని సీఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్ 17న అబార్షన్ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్ నిరాకరిస్తూ వస్తున్నాడు. గట్టిగా నిలదీస్తే.. కులం తక్కువ దానివంటూ దూషించాడు. ఈ నేపథ్యంలో బాలిక, తల్లిదండ్రులు బొమ్మూరు సీఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. వివాహం చేసుకోమని అడిగితే.. పెద్ద సమక్షంలో సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడని మండిపడుతోంది. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. -
రైతులను రౌడీలుగా చూపిస్తూ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరిట ఉద్రిక్తతలకు కారణమైనవాళ్లను వదిలేసి.. అమాయక ప్రజలపై, రైతులపైనా కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని ఎక్స్‌లో మండిపడ్డారాయన. చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా?. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన.. అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది?. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?.. .. పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ?. రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు..@ncbn గారూ పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2025 -
టీడీపీలో వారిని వదలను.. ప్రసాద్ బాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అన్నమయ్య: టీడీపీ అధికార కూటమిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ నేతలపై టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. సంవత్సర కాలంగా పార్టీలో అవమానాలను భరిస్తున్నాం.. తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలను అని హెచ్చరించారు.చిన్నమండ్యంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు సంస్మరణ సభలో టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు తన ఆగ్రహం వెల్లగక్కారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సొంత గడ్డపై మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి చనిపోయే వరకు పార్టీ కోసమే కష్టపడిన నాయకుడు పాలకొండ్రాయుడు. అలాంటి వ్యక్తి కుటుంబ సభ్యులం మేము. తెలుగుదేశం పార్టీలోనే మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.మా అన్న సుగవాసి సుబ్రహ్మణ్యంను పార్టీలోని కొందరు వ్యక్తులు ఇబ్బంది పెట్టారు. అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఏడాది పాటు పార్టీలో అవమానాలను భరించారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ప్రజల్లో ఆదరణ లేనట్టా. పలు చోట్ల టీడీపీ ఇన్ఛార్జ్లు ఓడిపోలేదా?. అయినప్పటికీ వారు ఇన్చార్జ్ పదవుల్లోనే కొనసాగుతున్నారు. ఒక్క రాజంపేటలో మాత్రమే ఇన్ఛార్జ్ పదవి ఎందుకు ఇవ్వలేదు. ఓడిపోతే ఇలా అవమానిస్తారా?. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలను’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ బాల సుబ్రహ్మణ్యం రాజీనామా..ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మహానాడు జరిగిన పది రోజులకే సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీలో నేను అవమానాలు ఎదుర్కొంటున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక, ఆయన 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన సంగతి విధితమే.మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. పాలకొండ్రాయుడు 1984 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజంపేట ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్రహ్మణ్యం కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజంపేట నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా గ్రూప్‌వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి పార్టీ నేతలు మూడు గ్రూపులోగా విడిపోయారనే టాక్ ఉంది. -
‘తప్పుడు వివాదాన్ని సృష్టించిన వారంతా క్షమాపణలు చెప్పాలి’
తాడేపల్లి: సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్‌పై సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి పార్టీల నేతలు తాము చేసిన బురద రాజకీయంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించాలనుకుంటే కుదరదనే విధంగా సుప్రీంకోర్ట్ తీర్పు ప్రజాస్వామిక స్పూర్తిని నిలబెట్టిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే...‘ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, పత్రికాస్వేచ్ఛను పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ కొమ్మినేని అరెస్ట్‌పై ఇచ్చిన ఉత్తర్వులను ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. వారి సొంత రెడ్‌బుక్ రాజ్యాంగాలు చెల్లవు, భారత రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పాలన చేయాలని మరోసారి సుప్రీంకోర్ట్ తన తాజా ఉత్తర్వులతో చెప్పినట్లయ్యింది. ఏపీలో ఏడాది పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదు. అమరావతి పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెగబడ్డారు. తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులతో ఒక అరాచకాన్ని సృష్టించారు. అటువంటి భయానక పరిస్థితుల్లో ప్రజాస్వామిక స్పూర్తిని పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ ఈ రోజు వెలువరించిన తీర్పు చంద్రబాబు అరాచకాలకు గొడ్డలిపెట్టు. గడిచిన మూడు రోజులుగా మహిళలను అవమానించారనే వక్రీకరణలను ఆపాదిస్తూ వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతమ్మ, సాక్షి మీడియా పైనా, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా చేసిన దుష్ప్రచారం, కూటమి ప్రభుత్వ కుట్రలు సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో మొత్తం దేశమంతా తెలిసింది. ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన వారంతా వైఎస్ జగన్, వైఎస్ భారతమ్మకు క్షమాపణలు చెప్పాలి. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇప్పటికైనా సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో తన బుద్ది మార్చుకోవాలి. బాధ్యతాయుతమైన మహిళా మంత్రులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చి, తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడినందుకు వారు తమ పదవులకు రాజీనామా చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. -
కొమ్మినేని అరెస్ట్ టు బెయిల్! ఎప్పుడేం జరిగిందంటే..
సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు తీర్పుతో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్ చేయాలంటూ.. ఆయన అరెస్ట్ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరిగిందో పరిశీలిస్తే..9వ తేదీ సోమవారం..గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని ఈ నెల 9వ తేదీన(సోమవారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఆ రోజు ఉదయమే చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఏ అభియోగాలపై తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించిన కొమ్మినేనికి సరైన సమాధానం ఇవ్వలేదు. 👉70 ఏళ్ల వయసులో.. సీనియర్ సిటిజన్, పైగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. ఇంటి లోపల గదిలోకి వెళ్లి మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. కొమ్మినేనిని సోమవారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసినట్టు ప్రకటించారు.కొమ్మినేనిపై బీఎన్ఎస్ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్సార్సీపీ మండిపడింది. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి.పోలీసులపై మంగళగిరి కోర్టు ఆగ్రహంఈ నెల 10న (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్‌ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.ఇవాళ.. పోలీసులకు సుప్రీం కోర్టు మందలింపు కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం(13 జూన్) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు?. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?.. అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేమూ నవ్వుతాం అని వ్యాఖ్యానించింది . వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం. -
కొమ్మినేని కేసులో జరిగింది ఇదే..: పొన్నవోలు
సాక్షి, ఢిల్లీ: ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలుపాలు చేశారని.. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని.. ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.‘‘మూడేళ్ల లోపు శిక్ష కలిగిన సెక్షన్లకు ఎలా అరెస్టు చేస్తారు?. గెస్ట్ చేసే వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం అక్రమం. పాలక పక్షం మెప్పుకోసం పోలీసులు ప్రయత్నాలు మానుకోవాలి. సాక్షి మీడియా గొంతు నులమాలని చూస్తున్నారు. సాక్షి ఆఫీసులపైన దాడులకు దిగుతున్నారు. పోలీసులు కనీసం కేసులు పెట్టడం లేదు. ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాం’’ అని పొన్నవోలు తెలిపారు.