breaking news
-
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ ముగిసినా పల్నాడులోటీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్ïపీకి ఓటేశారన్న అక్కసుతో జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం నుంచి అమాయకులపై టీడీపీ రౌడీ మూకలు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. ఇళ్లపై విచక్షణారహితంగా దాడులు చేస్తుండటంతో పురుషులు గ్రామాలు వదిలి ప్రాణాలు దక్కించుకోగా, మహిళలు, పిల్లలు దేవాలయంలో తలదాచుకుంటున్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపైనా దాడులకు తెగబడుతున్నారు. చివరకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి నాయకులను గ్రామాలు దాటించాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ బాధితులను రక్షించే చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.కొత్త గణేశునిపాలెంలో యథేచ్ఛగా దాడులుమాచవరం మండలం కొత్త గణేషునిపాడు గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పెద్ద ఎత్తున టీడీపీ రౌడీలను, గూండాలను తీసుకువచ్చి దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లపై దాడులు చేశారు. మోటారు బైకులు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామాన్లు, టీవీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా బూతులు తిడుతూ, భౌతికదాడులకు పాల్పడ్డారు. భయానక పరిస్థితుల్లో పురుషులంతా పొలాల్లోకి పరుగులు పెట్టి, అర్ధరాత్రి వరకూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు గంగమ్మగుడిలో తలదాచుకున్నారని తెలిసి, దేవాలయంపైకి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. చేతులెత్తేసిన పోలీసులు...గ్రామంలో టీడీపీ చేస్తున్న దాడులపై పోలీసులకు ఫోన్‌ద్వారా, వీడియో సందేశాల ద్వారా బాధిత మహిళలు సమాచారం అందించినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఫోర్సు తక్కువగా ఉందన్న నెపంతో తప్పించుకున్నారని మంగళవారం ఆ గ్రామానికి వెళ్లిన మీడియాకు వారు తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి మంగళవారం మ«ధ్యాహ్నం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు చూసి వారు చలించిపోయారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చిన విషయం తెలుసుకున్న వందలాది మంది టీడీపీ మూకలు వారిని చుట్టిముట్టి, వాహనాలపై రాళ్లు రువ్వారు. గ్రామం నుంచి బయటకు వెళ్లనీయకుండా రహదారిని దిగ్బంధించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మరింత రెచ్చిపోయిన టీడీపీ మూక దాడులను అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారుఓట్లు వేసి ఇంటికి వచ్చాం. అంతా బాగుంది అనుకున్నాం. ఒక్కసారిగా టీడీపీ వాళ్లు గుంపులు, గుంపులుగా వచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇంటిపైనున్న రేకులు పగులగట్టారు. ఇంట్లోని టీవీ, ప్రిడ్జ్ కూలర్, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. బూతులు తిడుతూ మగవాళ్లను బతకనీయమంటూ బెదిరించారు. మేము బెదిరిపోయి గంగమ్మ గుడిలో తలదాచుకున్నాం.– అంబటి శ్రీలక్ష్మి, బాధిత మహిళవైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నామనే...గ్రామంలో టీడీపీ బలంగా ఉండేది. 2019 ఎన్నికల నుంచి జగనన్నపై నమ్మకంతో మేము వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉంటున్నాం. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగనన్నను గెలిపించాలని బాగా పని చేశాం. దానిని తట్టుకోలేక మా ఇంటిపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు వేశారు. బూతులు తిట్టారు. భయంతో మా వాళ్లు రాత్రంతా పొలాల్లో తలదాచుకున్నారు. చాలా భయమేçస్తోంది. – చల్లగుండ్ల కోటేశ్వరమ్మ బాధిత మహిళకనీసం స్పందించని ఎస్పీగ్రామంలో ఇంత అరాచకం జరుగుతుంటే జిల్లా ఎస్పీ బింధుమాదవ్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు, వైఎస్సార్సీపీ నాయకులు వాపోతున్నారు. ఆయన గ్రామాన్ని సందర్శించలేదు. అవసరమైన బలగాలను పంపలేదు. వారి వైఖరి ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కారంపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైందని తెలియగానే వెళ్లిన ఎస్పీ కొత్త గణేషునిపాడుకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
దాడులు.. లూటీలు.. విధ్వంసం
సాక్షి, నరసరావుపేట/వినుకొండ(నూజెండ్ల)/కారెంపూడి/పెదకూరపాడు/మాచవరం : పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో చేస్తున్న అరాచకపర్వం రెండో రోజూ కొనసాగింది. సోమవారం పోలింగ్ రోజు వైఎస్సార్సీపీకి ప్రజలు భారీ స్థాయిలో ఓటు వేస్తున్నారని తెలుసుకొని మధ్యాహ్నం నుంచే దాడులు ప్రారంభించారు. మంగళవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి. ఓవైపు వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జిల్లా ఎస్పీ వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా కేంద్ర బలగాలు ఏవని ప్రశ్నిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలోని పేటసన్నెగండ్ల గ్రామ శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీ గూండాలు సుమారు 70 మంది సోమవారం రాత్రి వారి ఇళ్లపై కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావ బాదారు. ఇళ్లలోని సామాన్లు, ఫ్యాన్లు, బల్బులను పగులగొట్టారు. చిల్లర కొట్టునూ లూఠీ చేశారు. సామాన్లు, నగదును దోచుకెళ్లారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి బిక్షంకు చెందిన బైక్‌ను, మక్కెన శేషుకు చెందిన బైక్‌ను మరో ఇద్దరి ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో అందరూ ప్రాణభయంతో ఇంటి నుంచి పారిపోయి వేరే చోట తల దాచుకున్నారు. ఏరా.. టీడీపీకి ఓటు వేయమంటే వేయకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారా.. నా కొడకల్లారా.. అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచకపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జూన్ 4 తర్వాత తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు అంతు చూస్తామని బెదిరించారన్నారు. ‘ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్లు కర్రలతో కొట్టారు. ఇళ్లలోకి జొరబడి సామాన్లన్నీ చిందవందర చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. భయమేసింది. పిల్లలు పరారయ్యారు. ఎటూ పోలేని మమ్మల్ని చితకబాదారు. బూతులు తిట్టారు’ అంటూ గొర్ల సైదులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా చేయి విరగ్గొట్టారు. నేను పని చేస్తేనే పిల్లలను పోషించుకునేది. ఇప్పుడు ఎలా పని చేయాలి? ఇన్నాళ్లూ మా బాగోగులు పట్టించుకున్నారా.. కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా.. అలాంటి వారు మాపై దౌర్జన్యం ఏమిటి? మా లాంటి బీదోళ్లపై పడి కొట్టడం ఏమిటి? ఓటు వేయలేదని కొడతారా?’ అంటూ కప్పెర లక్ష్మి వాపోయింది. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు » సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసినప్పటి నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి కొనసాగింది. తిరిగి మంగళవారం ఉదయం తొండపి గ్రామంలోని వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతి పరులు ఆడ, మగ బేధం లేకుండా మూకుమ్మడిగా చొరబడ్డారు.» మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంట్లోని సామగ్రి పగలకొట్టారు. రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను భయబ్రాంతులకు గురి చేశారు. దాడికి పాల్పడుతున్న తరుణంలో ముస్లిం కుటుంబాల్లోని మగ వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు.» ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి మండలంలోని తొండపి, మాదల గ్రామాలు భయం గుప్పిట్లోనే ఉన్నాయి. రెండు గ్రామాల్లోనూ ముస్లిం వర్గీయులే వైఎస్సార్సీపీ మద్దతు దారులుగా ఉండగా, టీడీపీకి మాత్రం బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ముస్లిం వర్గీయులంతా గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లోను వైఎస్సార్సీపీ కి అండగా ఉంటున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేక భౌతిక దాడులకు దిగుతున్నారు. కేసానుపల్లిలో వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడి » గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని కేసానుపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు బొల్లా శ్రీనివాసరావు, చుండు రామారావు ఇళ్లపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ నాయకులు రాళ్లు విసిరారు. దీంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. » వైఎస్సార్సీపీ నేత చుండు రామారావు తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి లచ్చమ్మతో పాటు మరో ఇద్దరిపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. టీడీపీ నేతల దాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని తంగెడ, ఇరికేపల్లి, దాచేపల్లి గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్సీలపై దాష్టీకం » చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా సోమవారం రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ 211లో ఉదయం 7.30 గంటలకు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఓట్లు కొన్ని పోల్ కావాల్సినవి మిగిలి ఉన్నాయి. దీనికోసం సమయం పెంచాల్సిందిగా వైఎస్సార్సీపీ తరుఫున బూత్ ఏజెంటుగా ఉన్న నలమాల కాంతయ్య అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇది నచ్చని టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన కొందరు ఘర్షణకు దిగారు. కులం పేరుతో దూషిస్తూ కాంతయ్యపై దాడి చేశారు. దీంతో ఇతను తల పగిలి పడిపోయాడు. » దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కట్టెం ఆనందరావు, మరి కొందరికి కూడా గాయాలయ్యాయి. కాంతయ్య, ఆనందరావులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో కావూరులోని మంచినీటి ప్లాంట్ నుంచి ఎస్సీ వర్గీయులు మంగళవారం మంచి నీరు తీసుకువెళ్లకుండా కట్టడి చేసి వారి దాష్టీకాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు గ్రామానికి వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. కంభంపాడులో పచ్చ మూకల విధ్వంస కాండ» పెదకూరపాడు నియోజకవర్గంలోని కంభంపాడులో వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. సోమవారం పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య) సతీమణి, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ఆర్తిమళ్ల ఆంజమ్మ లక్ష్యంగా సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. » పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చిన పచ్చమూకలు.. నాగేశ్వరరావు, అతని కుమారులు రాజశేఖర్, ప్రవీణ్, ఆర్తిమళ్ల తిరుపతిరావు, ఎస్సీ కాలనీకి చెందిన సురేష్, బీసీ కాలనీకి చెందిన బ్రహ్మం, పల్లపాటి కృష్ణవేణిలపై దాడులకు పాల్పడ్డారు. పలువురి తల, కాళ్లు, చేతులు, ఛాతీపై రక్త గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టీడీపీ గూండాలు పలు మార్లు ఎస్సీ, బీసీ కాలనీల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. కారెంపూడిలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి» కారెంపూడిలో టీడీపీ గూండాలు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బీభత్సం సృష్టించారు. సుమారు 500 మంది రౌడీలు స్థానిక టీడీపీ నేతల నాయకత్వంలో బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ కరీంకు చెందిన వాచ్ షాపును ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్లతో భయానక వాతావరణం సృష్టిస్తూ గ్రామం మొత్తాన్ని భయాందోళనలకు గురి చేశారు. » కారెంపూడి ఎంపీపీ బొమ్మిన సావిత్రికి చెందిన పాల కేంద్రాన్ని ధ్వంసం చేసి తగల బెట్టారు. తర్వాత మాచర్ల రోడ్డులో ఉన్న పోలిరెడ్డికి చెందిన టీస్టాల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. అరుపులు, కేకలతో లూధరన్ చర్చి వద్ద ఎస్సీ కాలనీలో బీభత్సం సష్టించారు. తర్వాత వైఎస్సార్సీపీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అక్బర్ నివాసంపై దాడి చేశారు. » స్టేట్ బ్యాంక్ సెంటర్లో ఉన్న ఎంపీటీసీ సభ్యురాలు వేముల పద్మావతి భర్త నిర్వహిస్తున్న ఆటో కన్సల్టెన్సీపై దాడి చేశారు. అక్కడ ఉన్న 40 బైక్‌లకు నిప్పు పెట్టారు. బైక్‌లకు ఉన్న బ్యాటరీలు పేలడంతో దానికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న అపార్ట్మెంట్లో నిలిపి ఉంచిన వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు చిలుకూరి చంద్రశేఖరరెడ్డి కారును ధ్వంసం చేశారు. » టీడీపీ రౌడీ గ్యాంగ్ మరొకటి.. ఆర్య వైశ్య వీధి ముస్లిం ఏరియాలో ప్రజలను భయాందోళనకు గురి చేసింది. తర్వాత గ్రామ శివారులో ఉన్న ఆదినారాయణ కాలనీలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యదర్శి కొమ్ము చంద్రశేఖర్ నివాసానికి నిప్పు పెట్టారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తలకు బలౖమెన గాయం అయింది. జెడ్పీ హైస్కూల్ వద్ద పార్క్ చేసి ఉన్న టీడీపీ నాయకుని స్కార్పియోను దుండగులు ధ్వంసం చేశారు. » మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేయగా, వైఎస్సార్సీపీ వర్గీయులు ప్రతిఘటించారు. ఓ దశలో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడులలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్యనాయక్, మూఢావత్ కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావునాయక్ , మూఢావత్ నాగేశ్వరరావు నాయక్ గాయపడ్డారు. క్షతగాత్రులు గురజాల, పిడుగురాళ్ల ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. నూజెండ్లలో టీడీపీ మూకల దాడులు» వినుకొండ నియోజకవర్గం నూజెండ్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. మంగళవారం పక్కా ప్రణాళిక ప్రకారం ప్రధాన సెంటరులోకి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మహిళలను వెంటాడి దాడి చేశారు. గ్రామంలో అందరూ కలసి కట్టుగా ఎన్నికల్లో పాల్గొన్నారనే అక్కసుతో టీడీపీ నాయకులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కాజా ఆదిశేషమ్మ, అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జక్కిరెడ్డి గోవిందరెడ్డి, అమ్మిరెడ్డి సంజీవరెడ్డి, భవనం సంజీవరెడ్డి, మల్లంపాటి చెంచిరెడ్డి, నక్కా ఆదిలక్ష్మి, కాజా జయమ్మ, వంగూరి ప్రసాద్ సహా 15 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, గొడవను అదుపు చేయలేక పోవటం పలు విమర్శలకు తావిచ్చింది. క్షతగాత్రులను వినుకొండ ఆస్పత్రిలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. » బొల్లాపల్లి మండలం పేరూరుపాడులో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ మూక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏర్పడిన స్వల్ప వివాదంతో కావాలనే టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. -
‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు
కంబదూరు/పెదవేగి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి వైఎస్సార్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు. -
కళ్లకు గంతలు కట్టుకున్న ఈసీ... పచ్చ ముఠా స్వైర విహారం
సాక్షి, అమరావతి: ఈసీ చేష్టలుడిగి చూస్తుండటంతో పచ్చముఠాలు ఆయుధాలు చేతబట్టి వీధుల్లో వీరంగం వేస్తున్నాయి! ఎన్నికల వేళ తమ మాట వినలేదనే ఉక్రోషంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నాయి. టీడీపీ రౌడీ మూకల మారణకాండతో మహిళలు, వృద్ధులు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించి కఠిన చర్యలు చేపట్టాల్సిన ఈసీ ఈ అరాచకాలకు పరోక్షంగా కొమ్ముకాస్తుండటం విస్మయపరుస్తోంది.ఈ ఎన్నికల ఫలితాలను నిర్దేశించేది గ్రామీణ ప్రజలు, మహిళలు, అవ్వాతాతలేనని పసిగట్టిన పచ్చ ముఠాలు వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా చేయడమే లక్ష్యంగా హింసాత్మక ఘటనలకు తెర తీశాయి. వైఎస్సార్ సీపీకి ఓటేస్తారని ఖాయంగా తేలడంతో వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ఉద్రికత్తలు రేకెత్తించాయి. ‘మనవాళ్లంతా ఉదయం 11 గంటలకల్లా ఓటేసేయాలి’ అని చంద్రబాబు పోలింగ్‌కు ముందురోజు పిలుపునివ్వడం చూస్తే.. మద్యాహ్నం నుంచి హింసకు తెగబడనున్నారని, అవ్వాతాతలను, మహిళలను పోలింగ్ బూత్‌లకు రానీయకుండా చేయాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని తేటతెల్లమవుతోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఈసీ పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన జిల్లాల్లో హింస కొనసాగుతుండటమే దీనికి నిదర్శనం. తాజాగా పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో వైఎస్సార్సీపీకి ఓటేసేశారనే అనుమానంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై టీడీపీ మద్దతుదారులు దాడులకు దిగడంతో మహిళలు, పిల్లలు రాత్రంతా ఓ దేవాలయంలో తలదాచుకుని క్షణక్షణం భయంభయంగా గడిపారు. కుట్రలకు పరోక్ష సహకారం మ్యాచ్ రిఫరీ తరహాలో ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ రాజకీయాల కుట్రలకు తలొగ్గింది! పోలింగ్ సందర్భంగా, అనంతరం దాడులకు పాల్పడ్డాలని టీడీపీ రూపొందించిన ముందస్తు కుట్రలకు దాసోహమైంది. సమస్యాత్మక జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులను హఠాత్తుగా బదిలీ చేసి చంద్రబాబు కుట్రల అమలుకు దారి చూపింది. టీడీపీ అధినేత ఆదేశాలతో పురందేశ్వరి సూచించిన అధికారులను ఆ స్థానాల్లో నియమించి పచ్చ కుట్రలకు పరోక్షంగా సహకరించింది. ఇదే అదునుగా టీడీపీ రౌడీలు బరితెగించి దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టిస్తున్నా.. బాంబుల మోత మోగిస్తున్నా ఆ జిల్లాలపై పట్టులేని పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. ఒత్తిడికి తలొగ్గి హఠాత్తుగా బదిలీలుజిల్లాలపై క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న పోలీసు అధికారులు కొనసాగితే ఎన్నికల వేళ తమ పథకం పారదని చంద్రబాబు ముఠా ఆందోళన చెందింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కలసి చంద్రబాబు పన్నిన పన్నాగంలో ఈసీ చిక్కుకుంది. విజ్ఞతతో ఆలోచించకుండా ఒత్తిడితో అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంది. సున్నితమైన జిల్లాలు, సమస్యాత్మక నియోజకవర్గాలపై క్షేత్రస్థాయిలో పూర్తి పట్టున్న అధికారులను ఇష్టానుసారంగా బదిలీలు చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత రాజ్యాంగబద్ధంగా అధికార వ్యవస్థ అంతా ఈసీ ఆ«దీనంలోకి వెళుతుంది. అధికార యంత్రాంగం ద్వారా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పూర్తి బాధ్యత ఈసీదే. అయితే టీడీపీ, బీజేపీ ఫిర్యాదులను సహేతుకంగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఈసీ తన బాధ్యతను విస్మరించి అసంబద్ధంగా వ్యవహరించింది. చంద్రబాబు, పురందేశ్వరి ఫిర్యాదు చేయడమే ఆలస్యం వారు కోరినట్లుగా పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసేసింది. ఏకంగా 29 మంది అధికారులను బదిలీ చేయడం గమనార్హం. వీరిలో నలుగురు మినహా 25 మంది పోలీసు అధికారులే ఉన్నారు. సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఈసీ గుర్తించిన పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోని అధికారులే 90 శాతం మంది ఉన్నారు. పురందేశ్వరి జాబితా ప్రకారమే అంతారాష్ట్ర శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, నిఘా విభాగం ఇన్చార్జ్ పీఎస్ఆర్ ఆంజనేయులతోపాటు పల్నాడు పరిధిని పర్యవేక్షించే గుంటూరు డీఐజీ పాలరాజు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ జిల్లాలను పర్యవేక్షించే అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని ఈసీ హడావుడిగా బదిలీ చేయడం విస్మయకరం. సమస్యాత్మక నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్న పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఎస్పీలు, విజయవాడ సీపీలను కూడా ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి మొత్తం 14 మందిని బదిలీ చేయడం గమనార్హం. ఈ అధికారులంతా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కొద్ది నెలలుగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. అలాంటి వారిని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈసీ బదిలీ చేయడం విభ్రాంతికరం. పోనీ ఆ స్థానంలో నియమించిన పోలీసు అధికారుల విషయంలోనైనా ఈసీ సహేతుకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందా అంటే అదీ లేదు. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని పోలీసు అధికారులకే ఈసీ పోస్టింగులు ఇవ్వడం విభ్రాంతికరం. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేయడం సహజం. కానీ ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ జాబితాను సమర్పించడం ఇప్పటివరకు దేశ చరిత్రలోనే లేదు. తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవటాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన ఈసీ అందుకు విరుద్ధంగా జాబితాను ఆమోదించి చేతులు దులుపుకొంది. ఈసీ దన్నుతో టీడీపీ విధ్వంసకాండ తాము చెప్పినట్లుగా ఎన్నికల కమిషన్ ఆడుతుండటంతో టీడీపీ మూకలు యథేచ్ఛగా విధ్వంసానికి దిగాయి. పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేసిన జిల్లాల్లోనే హింస చెలరేగడం, పచ్చ ముఠాలు రక్తపాతానికి తెగబడటం గమనార్హం. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు సీఎం జగన్‌కు వెన్నంటి నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, పేద వర్గాలే లక్ష్యంగా టీడీపీ దాడులకు పాల్పడుతోంది. పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో టీడీపీ గూండాలు, రౌడీ మూకలు కర్రలు, కత్తులు, బాంబులతో స్వైర విహారం చేస్తున్నారు. పల్నాడులో పురి విప్పిన ఫ్యాక్షన్.. పల్నాడులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్‌రెడ్డిపై టీడీపీ మూకలు దాడులకు దిగాయి. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులకు తీవ్రగాయాలయ్యాయి. నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం, ఆసుపత్రులపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో 15 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బాంబు దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. పిడుగురాళ్ల శివారు ప్రాంతం, మాచవరం మండలంలోని కొత్త గణేశునిపాడులో ఎస్సీ, బీసీ కుటుంబాలపై టీడీపీ రౌడీలు దాడులకు తెగబడటంతో బాధితులు రాత్రంగా ఓ గుడిలో తలదాచుకున్నారు. సీమలో చెలరేగిన హింస.. తిరుపతి జిల్లా చంద్రగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వాహనశ్రేణిపై టీడీపీ మూకలు దాడి చేసి రెండు కార్లను ధ్వంసం చేశాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన కుమారుడు ఆస్మిత్‌రెడ్డి, అల్లుడు దీపక్‌రెడ్డితో కలసి విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై రాళ్లతో దాడులు చేయించారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి ప్రత్యక్షంగా దాడులకు నేతృత్వం వహించారు. టీడీపీ దాడులపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు సాక్షి,అమరావతి: పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో టీడీపీ గూండాల దాడుల ఘటనపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి ఎన్నికల అధికారులను కలిసి దాడులకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. మంత్రి అంబటి మాట్లాడుతూ.. కొత్తగణేషునిపాడులో పోలింగ్ ముగిశాక యాదవ కాలనీ, రజక కాలనీలపై టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడులు చేయడంతో వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలనీలు వదిలి గంగమ్మ ఆలయంలో రాత్రి తలదాచుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారన్నారు. పోలీసు అధికారులకు సమాచారం అందించినా స్పందించ లేదని ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ లు బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారని, గ్రామం నడిబొడ్డులో ఉన్న మరికొంతమందిని పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై టీడీపీ శ్రేణులు కర్రలు, మారణాయుధాలతో దాడి చేశాయన్నారు. సమర్థులను తప్పించి అనుకూలురకు పోస్టింగ్లుఐజీ పాలరాజు, ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై టీడీపీ తప్పుడు ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎన్నికల సందర్భంగా పల్నాడులో హింస చెలరేగేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేసి కొత్తవారికి బాధ్యతలు అప్పగించడమే దీనికి కారణమని పేర్కొంటున్నారు. ఎన్నికల రోజే కాకుండా మర్నాడు కూడా హింస కొనసాగుతున్నా అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో పోలీసు యంత్రాంగం ఉండిపోవడం దీనికి నిదర్శనం. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా పోలీసు సిబ్బందిని ఎవరు నియంత్రించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసు బలగాలు భారీగా అందుబాటులో ఉన్నా తాపీగా గంటన్నర తరువాత చేరుకోవడం, ఈలోగా టీడీపీ నాయకులు విధ్వంసానికి తెగబడటంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన పోల్ అబ్జర్వర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులెక్కడ?ఎన్నికలకు ముందు గుంటూరు రేంజి ఐజీగా పాలరాజు, పల్నాడు ఎస్పీగా రవిశంకరరెడ్డి లాంటి సమర్థ అధికారులున్నారు. వారు ఉంటే తమ ఆటలు సాగవనే భయంతో టీడీపీ పదేపదే ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. పురందేశ్వరి ద్వారా రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చింది. దీంతో ఎన్నికల కమిషన్ వీరి స్థానంలో డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీగా బింధుమాధవ్‌ను నియమించింది. ఎన్నికలకు 4 రోజుల ముందు మాచర్ల, కారంపూడి సీఐలతో పాటు వెల్దుర్తి ఎస్ఐలను మార్చి టీడీపీకి అనుకూలంగా ఉండే వారికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ తరువాత పచ్చ ముఠాలు రెచ్చిపోయాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్యతో పాటు కుమారుడిపై కూడా దాడి జరిగింది. ఎన్నికల సమయంలో స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న వారిని నియమిస్తే రౌడీ మూకలు, నేరగాళ్లను సమర్థంగా అదుపు చేసే అవకాశం ఉంటుంది. బదిలీల తరువాత దీనికి భిన్నంగా జరిగింది. అంబటిపై రివాల్వర్ ఎక్కుపెట్టి..సమస్యాత్మక కేంద్రాల గురించి తెలిసినా బందోబస్తు కల్పించకుండా ఒక్క కానిస్టేబుల్‌తో సరిపెట్టారు. మంత్రి అంబటి రాంబాబు ఫోన్ చేసినా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ చేసినా పోలీసు సిబ్బంది కనీసం స్పందించని పరిస్థితి నెలకొంది. మాచర్లలో పోలీసుల తీరు ఆక్షేపణీయంగా ఉంది. వైఎస్సార్సీపీ అనుకూల గ్రామాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఓటర్లు బయటకు రావడానికి భయపడే పరిస్థితి కల్పించారు. టీడీపీ అనుకూల గ్రామాల్లో ఎస్ఐ స్థాయి అధికారి కూడా లేకుండా చేశారు. ఎమ్మెల్యే కుమారుడిపై దాడి చేసినా పోలీసులు స్పందించలేదు. ఈవీఎంలు ధ్వంసం చేసి వైఎస్సార్ సీపీ ఏజెంట్లు లేకుండా చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు దిగారు. మంత్రి అంబటిని హౌస్ అరెస్టు చేసి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణను పోలింగ్ బూత్‌ల వద్దకు తిరిగేందుకు అనుమతించారు. కన్నా కుమారుడు బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు అందినా సీఐ స్పందించలేదు. ఘటనాస్థలికి వచ్చిన మంత్రి అంబటిపై రివాల్వర్ ఎక్కు పెట్టే ధైర్యం ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది. సత్తెనపల్లిలో చీఫ్ ఏజెంట్‌గా ఉన్న మంత్రి అంబటి అల్లుడు ఉపేష్పై దాడి చేసినా పోలీసులు స్పందించలేదు. నరసరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైదాడి చేశారు. ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసినా..గురజాల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల అరాచకం అంతా ఇంత కాదు. మాచవరం మండలంలోని కొత్త గణేశునిపాడు, కేసానుపల్లిలో బీసీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడులకు తెగబడ్డాయి. తమ మాట వినకుండా వైఎస్సార్ సీపీకి ఓటేశారనే ఆగ్రహంతో టీడీపీ మద్దతుదారులు దాడులకు దిగడంతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు సోమవారం రాత్రి గ్రామంలోని గంగమ్మ గుడిలో తలదాచుకున్నారు. వారిని పరామర్శించడానికి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ రావడంతో వారిపై కూడా దాడులకు బరి తెగించారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఘటనా స్థలానికి ఒక ఎమ్మెల్యే వెళ్తున్నారని సమాచారం ఉన్నా సరైన బందోబస్తు కల్పించకపోవడం, పరిస్థితిని నియంత్రించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామంలో బీసీలు, ఎస్సీలు ఎస్టీలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరడంతో తమ ఆధిపత్యానికి గండిపడుతుందని భావించి ఎన్నికలు ముగిసిన వెంటనే ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. 2019లో కూడా కాసు మహేష్‌రెడ్డిపై ఇదే గ్రామంలో దాడికి ప్రయత్నించారు. పల్నాడులో గెలవలేమని టీడీసీ నిర్ధారణకు రావడంతో దాడులు, దౌర్జన్యాలు, ఈవీఎంల ధ్వంసానికి పూనుకుంది. ఇదంతా టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకే జరిగినట్లు చెబుతున్నారు. సస్పెండ్ అయిన పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని పోలీసులను నడిపించారన్న ఆరోపణలకు పల్నాడు పోలీసులు వ్యవహారశైలి అద్దం పడుతోంది. కొంతమంది నిజాయితీగా పనిచేసే వారున్నా ఉన్నతాధికారుల తీరు చూసిన తర్వాత అభద్రతా భావంతో విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉండిపోయారు. పల్నాడు చరిత్రలో ఈ తరహాలో పోలీసుల వ్యవహార శైలి ఎప్పుడూ చూడలేదని సీనియర్ సిబ్బంది పేర్కొంటున్నారు.మాచవరంలో మరో దాడిపల్నాడు జిల్లా మాచవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చౌదరి సింగరయ్యపై మంగళవారం రాత్రి టీడీపీ మూకలు దాడి చేయడంతో కాలు, చేయి విరిగాయి. మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ దారం లచ్చిరెడ్డికి చెయ్యి విరిగింది. ఘటనలో కారు ధ్వంసం కాగా మరో కార్యకర్తకు కూడా గాయాలయ్యాయి. -
చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ మూకల ఆగడాలు, రౌడీయిజానికి అంతేలేకుండా పోయింది. పోలింగ్ ముగిసిన అనంతరం సోమవారం రాత్రి 9.45 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వీరి పైశాచిక విధ్వంసకాండ కొనసాగింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, స్థానిక సర్పంచి కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు వినీల్ ఆధ్వర్యంలో పచ్చ మంద దాడి చేసింది.సర్పంచి ఇంటికి నిప్పు పెట్టింది. విలువైన వస్తువులు, నగదు, బంగారం, ల్యాప్‌టాప్ వంటి వస్తువులను లూటీ చేసింది. పంచాయతీలో అధిక శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి అండగా ఓటింగ్‌లో పాల్గొన్నారనే అక్కసుతోనే పచ్చ మంద ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. దాడికి గురైన సర్పంచి చంద్రశేఖర్‌రెడ్డిని పరామర్శించేందుకు రామిరెడ్డిపల్లికి వస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని టీడీపీ శ్రేణులు, చిత్తూరు నుంచి దిగుమతి చేస్తున్న రౌడీలతో ఉన్న వినీల్ అడ్డుకున్నారు. మోహిత్‌రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆయన కారును పెట్రోలు పోసి దగ్ధం చేశారు. మరో కారును రాడ్లు, కర్రలు, బండరాళ్లతో ధ్వంసం చేశారు. కారు డ్రైవర్, మాజీ సైనికుడిని కట్టేసి కొట్టారు. ఈ దాడిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నానీయే మోహిత్‌రెడ్డి అనుచరులను కొట్టారు. బాధితులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చిపోయిన పచ్చ మూకలు తిరుపతిలో మంగళవారం ‘పచ్చ’ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద టీడీపీ అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పచ్చమూకలను రెచ్చగొట్టారు. దీంతో వర్సిటీ ముందు రోడ్డుపై బైఠాయించి ఈ మూకలు ఆందోళన చేశాయి. రోడ్డుపై వెళ్తున్న అమాయకులను సైతం పట్టుకుని ‘మీరు వైఎస్సార్సీపీ వాళ్లే కదా... ’అంటూ విచక్షణా రహితంగా కొట్టాయి. వర్సిటీ రోడ్డు మీదుగా తుమ్మలగుంటకు వెళ్తున్న తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయతీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మొదలియార్ రమేష్, అతని అనుచరుల కారును అడ్డగించాయి. రమేష్‌తో పాటు కారులో ఉన్న అనుచరులను రోడ్డుపైకి లాగి.. పది మంది కలిసి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ, స్పృహ తప్పిపోయేంతగా కొట్టారు. అంతటితో ఆగక, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఎస్వీయూ, మహిళా వర్శిటీ, పద్మావతి కళాశాల ఉద్యోగులపై సైతం దాడులు చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోదరుడు రఘునాధరెడ్డికి చెందిన బుల్లెట్, మరో 10 వాహనాలపై వైఎస్సార్సీపీ గుర్తులు ఉన్నాయని కాల్చి వేశారు. వీడియోలు తీస్తున్న మీడియాపై సైతం దాడికి పాల్పడ్డారు. ‘పులివర్తి నాని అన్న చెప్పాడు.. వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను తరిమి తరిమి కొట్టండి’ అంటూ గంజాయి మత్తులో ఉన్న పచ్చమూక రెచ్చిపోయింది. ఈ గూండాల విధ్వంసంతో వర్సిటీ పరిసరాలు హాహాకారాలు.. రక్తపు గాయాలు.. ఎగిసిపడే మంటలతో యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. చివరకు పోలీస్ బలగాలు భారీగా తరలివచ్చి లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి0ది. -
జమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: ఎన్డీఏ కూటమి అభ్యర్థి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో సోమవారం సాయంత్రం 6 గంటలు దాటాక నవాజ్ కట్ట సమీపంలోని 116, 117 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. అధికారులు వారికి స్లిప్పులు ఇచ్చి పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో డీఎస్పీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఇదే అదనుగా భావించిన ఆది, భూపేష్ వర్గీయులు రాళ్లతో దాడులు చేయించారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తలపై గాయమైంది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కాపాడుకునేందుకు ఎదురు దాడి చేశారు. సుధీర్‌రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు భారీగా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు హృషి కేశవరెడ్డి ఎమ్మెల్యేను పరామర్శించటానికి వెళుతున్న సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద గూమిగూడి ఉన్న కార్యకర్తలు రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మైలవరం మండలం చేరెడ్డి చెన్నకేశవరెడ్డికి చెందిన కారును ఎ.కంబాలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేయగా.. ఎమ్మెల్యేకు బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంకటేశ్వర కాలనీ వద్ద గల 116, 117 బూత్‌ల వద్దకు బలగాలను మోహరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా ఎమ్మెల్యే కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. ముద్దనూరు మండలం నుంచి మేనమామ అయిన మునిరాజారెడ్డి తన అనుచరులతో జమ్మలమడుగుకు చేరుకున్నారు. భారీగా కార్యకర్తలు వస్తుండటంతో టీఎన్ఆర్ థియేటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. -
పచ్చ ముఠాల విధ్వంస కాండ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఓటమి భయంతో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్ , రౌడీ మూకలతో కలిసి బీభత్సం సృష్టించారు. కర్రలతో దండెత్తారు. కత్తులతో విరుచుకుపడ్డారు. ఏకంగా బాంబు దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ఓటర్లపై యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు బరితెగించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఇళ్లు, వాహనాలపై దాడులకు తెగబడి విధ్వంస కాండతో చెలరేగిపోయారు. సామాన్య ప్రజానీకాన్ని హడలెత్తించారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విధ్వంసానికి దిగారు. ఈ గొడవలన్నింటికీ కర్త, కర్మ, క్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పోలింగ్ సరళి టీడీపీకి వ్యతిరేకంగా ఉందనే విషయం స్పష్టం కావడంతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బెంబేలెత్తిపోయారు. దాంతో ముందస్తు పన్నాగంతో సిద్ధం చేసిన తమ రౌడీమూకలకు పచ్చ జెండా ఊపారు. ఆ వెంటనే టీడీపీ, జనసేన రౌడీలు యథేచ్ఛగా దాడులకు తెగబడి రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించారు. ఉదయం మొదలైన ఈ దాడులు, దౌర్జన్య కాండ అర్ధరాత్రి వరకు కొనసాగింది. తెగబడ్డ టీడీపీ, జనసేన సోమవారం ఉదయం పోలింగ్ మొదలు కాగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వారిలో మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉండటం విశేషం. అంటే ఓటింగ్ సరళి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉందన్నది స్పష్టమైంది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు.. విధ్వంసం సృష్టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్రలు, కత్తులతోపాటు పెట్రోల్ బాంబులు కూడా ముందుగానే సమకూర్చుకోవడం టీడీపీ, జనసేన కుట్రకు నిదర్శనం. చంద్రబాబు ఆదేశించగానే.. టీడీపీ, జనసేన రౌడీలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు. చోద్యం చూసిన ఈసీ టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి విధ్వంసానికి పాల్పడి పోలింగ్‌కు ఆడ్డంకులు సృష్టించినా ఎన్నికల కమిషన్(ఈసీ) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నివ్వెర పరుస్తోంది. వారం రోజుల ముందు నుంచే టీడీపీ ఎన్నికల ప్రలోభాలపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా వుయ్ యాప్ పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పూర్తి ఆధారాలను కూడా సమరి్పంచింది. టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఉదంతాలను.. పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు పదును పెడుతున్న కుట్రలను కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. అయినా సరే పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో ఈసీ పూర్తిగా విఫలమైంది. అసలు టీడీపీ, జనసేన గూండాలు వీధుల్లోకి వచ్చి చెలరేగిపోతున్నా, పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశించి బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఈవీఎంలను ధ్వంసం చేసినా.. ఏకంగా బాంబు దాడులకు పాల్పడినా సరే ఈసీ మాత్రం క్రియాశీలంగా స్పందించనే లేదు. పైగా వైఎస్సార్సీపీ నేతలనే కట్టడి చేసేందుకు యత్నించడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నబత్తున శివకుమార్‌ను మాత్రమే గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఏకపక్షంగా ఆదేశించడం విస్మయ పరిచింది. ఆయన్ను దూషించిన టీడీపీ కార్యకర్తపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంపై టీడీపీ రౌడీలు దాడికి పాల్పడి, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. కానీ ఈసీ మాత్రం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచమని పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉంది. మచ్చుకత్తితో దాడి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం కుసుమవారిపల్లిలో స్లిప్పుల పంపిణీ కోసం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ శిబిరం వద్దకు ఓటర్లు వెళ్లడంతో ఓర్చుకోలేని టీడీపీ కార్యకర్త ఇడగొట్టు రంగప్ప మచ్చుకత్తితో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంద్రప్పను పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై పేగులు బయటకు వచ్చాయి. ఈ సంఘటనతో భయబ్రాంతులకు గురైన ఓటర్లు చెల్లాచెదురయ్యారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురంలో ఎంపీపీ పురుషోత్తంరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పురుషోత్తం రెడ్డి కారు ధ్వంసమైంది. వైఎస్సార్సీపీ కార్యకర్త నవీన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ ఏజెంట్లపై హత్యాయత్నం పల్నాడు జిల్లా కారెంపూడి మండలం ఒప్పిచర్ల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల రిలీవ్ ఏజెంట్‌గా ఉన్న వైఎస్సార్సీపీ నేత పాలకీర్తి నరేంద్ర, అతడి తమ్ముడిపై టీడీపీ మూకలు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రాణ భయంతో వారు తప్పించుకుని బయటకు పరుగులు తీశారు. దాదాపు 300 మంది టీడీపీ గూండాలు వెంట పడటంతో కారెంపూడి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం పొట్టి శ్రీరాములు కాలనీలోని ఎన్నికల బూత్‌ల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగి రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఇరికెదిండ్ల లాజర్‌తో పాటు పలువురికి గాయాలయ్యాయి. కారెంపూడిలోని 288 నెంబర్ బూత్‌లో ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న గోగుల సాంబశివరావు తమ్ముడిపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడడంతో దాడిని అడ్డుకునే యత్నంలో సాంబశివరావు తలకు గాయమైంది. వైఎస్సార్ జిల్లా వేముల మండలం మబ్బుచింతలపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న నూలి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం రాళ్ల దాడి చేశారు. కాగా, టీడీపీ వర్గీయుల రాళ్ల దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన లావనూరు హనుమంతురెడ్డి కారు అద్దాలు పగిలాయి. రాళ్ల దాడిలో జల్లా సునంద అనే మహిళకు చేయి విరిగింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూతలపట్టులో తెలుగు తమ్ముళ్ల వీరంగం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని మూడు పోలింగ్ బూత్‌లతో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై పచ్చ మూక దాడులకు పాల్పడింది. పేటగ్రహారానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రవినాయుడు పోలింగ్ బూత్‌లోకి వెళ్లే సమయంలో టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అనంతరం పేటపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు గురుస్వామినాయుడుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గురుస్వామి నాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వావిల్‌తోట పంచాయతీ సీఎం కండ్రిగ పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా వున్న హరిబాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే జిల్లా సోమల మండలం కందూరు పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు సురే‹Ùరెడ్డిపై టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు దాడికి పాల్పడ్డాడు. పోలింగ్ కేంద్రంలో వద్ద ఏర్పడిన వివాదంతో సుబ్రమణ్యం నాయుడు తన అనుచరులతో కలసి దాడి చేశాడు. గంగాధర్ నెల్లూరు మండలం జంగాలపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నాయకులు గ్రామస్తులపై దౌర్జన్యం చేశారు. చిత్తూరు మండలం పెరుమాళ్ళ కండ్రిగలో టీడీపీ నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి చేశారు. కారును ధ్వంసం చేసి ఓ నాయకుడిని తీవ్రంగా గాయపరిచారు. తొలుత టీడీపీ నాయకులు ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ రోడ్డుకు అడ్డంగా పందిరి వేశారు. దీనిని పోలీసులు తీసి వేయడంతో జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. ఇనుప రాడ్లు, కొయ్యలతో పలువురిని తీవ్రంగా గాయపరిచారు. పసుపు కండువాతో ‘గంటా’ హల్చల్ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి పోలింగ్ స్టేషన్లోకి వెళుతుండగా వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్నపల్లి పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నాయకులు చింతాడ జీవరత్నం, యతేంద్ర, సంపతిరావు సూర్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లడంతో టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీకి చెందిన మల్లాడి చిన ధర్మారావు, మల్లాడి నర్సింహులు, అరదాని శ్రీను తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేశారు. రామకృష్ణారావుపేటలో కొందరు టీడీపీ సానుభూతిపరులు చేసిన దాడిలో మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యనారాయణతో పాటు మరికొందరు గాయపడ్డారు. రూరల్ కరప మండలం పెదకొత్తూరులో పోలింగ్ బూత్ వద్ద జనసేన కార్యకర్తలు వైఎస్సార్ సీపీకి చెందిన చింతా సత్యనారాయణపై దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కొని వివాదం సృష్టించారు. పిఠాపురం నియోజకవర్గం విరవ, విరవాడ ప్రాంతాల్లో కూడా జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఘర్షణకు దిగారు.‘చింతమనేని’ వర్గీయులు కత్తెరతో దాడి పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో వైఎస్సార్సీపీకి చెందిన చలపాటి రవిపై చింతమనేని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన రవి భుజంపై కత్తెరతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన రవి ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆసుపత్రికి చేరుకుని రవిని పరామర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట ప్రభుత్వ బాలికల హైస్కూలులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా వచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలపై లాఠీఛార్జి చేశారు. పొన్నూరు రోడ్డులోని అంజుమన్ పాఠశాల బూత్‌లో డీఎస్పీ మల్లికార్జునరావు వైఎస్సార్ సీపీకి చెందిన బూత్ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేశారు. వారి గుర్తింపు కార్డులను లాక్కొని బయటకు వెళ్లాలంటూ ఆదేశించారని బూత్ ఏజెంట్లు పలువురు ఆరోపించారు. పొత్తూరివారిపేటలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదు. కత్తిపోటు నుంచి రాళ్ల దాడుల వరకూ..> పోలింగ్ మొదలైన కాసేపటికే టీడీపీ రౌడీలు చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఏజంట్‌పై కత్తితో దాడి చేశారు. అనంతరం పోలింగ్ శాతం పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన దాడుల తీవ్రతను అమాంతం పెంచుకుంటూ పోయాయి. > వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల 14వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్చార్జి షాహీద్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. వీరపునాయునిపల్లె మండలంలోని యు.వెంకటాపురం, బుసిరెడ్డిపల్లె గ్రామాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. కడపలో ఓట్లు వేసేందుకు క్యూలో ఉన్న ముస్లింలపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడకు చేరుకుని ఉద్రిక్తతలను మరింతగా రెచ్చగొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. > రాయచోటి నియోజకవర్గంలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడటంతో వైఎస్సార్సీపీ నేత తిరుపాల్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజంట్లపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. > మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైమరీ స్కూల్ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్ధించారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
మోపిదేవిలంకలో బాలశౌరి తనయుడి వీరంగం
మోపిదేవి (అవనిగడ్డ): ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలంకలో సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు రె చ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా కిందపడేసి పిడిగుద్దులు గుద్దడమేగాక కాళ్లతో తన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్‌తో వచ్చిన జనసేన నాయకులు కూడా ఈ దాడులకు పాల్పడ్డారు.మోపిదేవిలంకలో ఏజెంట్లు టీ అడగడంతో స్థానికంగా ఉండే యార్లగడ్డ అంకరాజుతో తెప్పించారు. లోపలికి వెళుతున్న అంకరాజుపై జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్‌తో వ చ్చిన జనసేన నాయకులు, కొందరు టీడీపీ నేతలు దాడిచేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ బీసీ విభాగం మోపిదేవి మండల కన్వినర్ రాజులపాటి నాగేశ్వరరావు మీద జనసేన నేతలు బల్లా సీతారాంప్రసాద్, బల్లా మునికుమారి, బల్లా దినేష్, శ్రీనివాసరావు, పవన్ తదితరులు దాడిచేసి కొట్టారు. నాగేశ్వరరావు కుమార్తె కేశాని తేజశ్రీని కిందపడేసి పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్నారు. అడ్డువ చ్చిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావుతో పాటు రాజులపాటి సుజాత, నరసారావు, వినయ్‌బాబు, శివనాగరాజులను తీవ్రంగా కొట్టారు.బాధిత వైఎస్సార్సీపీ నాయకులు మోపిదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, అవనిగడ్డ వైద్యశాలలో చేరారు. వీరికంటే ముందే.. దాడిచేసిన టీడీపీ నాయకులు ఆస్పత్రిలో చేరారు. తరువాత వైఎస్సార్సీపీ నాయకులు హాస్పటల్లో చేరగా అదే వార్డులో ఇరువర్గాలను ఉంచారు. టీడీపీ నాయకురాలు బల్లా మునికుమారిని పరామర్శించేందుకు వ చ్చిన ఆమె సోదరులు అక్కడే చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి యత్నించారు. ఎస్ఐ రమేష్ ఇరువర్గాలకు సర్దిచెప్పారు.అనంతరం ఇరువర్గాలను మచిలీపట్నం ఆస్పత్రికి పంపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు వైద్యశాలకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులను పరామర్శించారు. ఈ దాడుల్ని ఎమ్మెల్యే సింహాద్రి తీవ్రంగా ఖండించారు. -
తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ అభ్యర్థిపై సామాజికవర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దు్రష్పచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిర గనీయకుండా గృహనిర్బంధం చేశారు. అయితానగర్‌లో సోమవారం ఉదయం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్‌ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్ అడ్డుకున్నాడు.క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలకు వెళ్లడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలకు వెళ్లి ఓటేసి వస్తుంటే, మళ్లీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ‘ఆ పార్టీలో ఉండటమేమిటి’ ను వ్వు కమ్మోడివి కావా?’ అని రెచ్చగొట్టాడు. ఇంకా కవి్వంపు చర్యలకు పాల్పడటమే గాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన శివకుమార్ అతడి చెంపపై కొట్టాడు.సుధాకర్ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కనే ఉన్న కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుచేసి, పోలింగ్ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహనిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మనోహర్‌తో కలిసి చేసిన కుట్ర తనను రెచ్చగొట్టి ఏదోలా గొడవ సృష్టించి పోలింగ్ రోజున డ్యామేజ్ చేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గొట్టిముక్కల సుధాకర్ కుట్ర పన్నారని ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. -
ఏబీ వెంకటేశ్వర్రావుకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీ పదవిలో ఉన్నపుడు పాల్పడిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలించిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతిచ్చింది.దీంతో త్వరలో అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్ ప్రారంభం కానుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీప్‌గా పనిచేస్తున్నప్పుడు సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడంటూ ఏబీపై అవినీతి కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరైంది. ఇప్పుడు అనుమతి రావడంతో విచారణకు లైన్ క్లియరైంది. -
మన్యంలో మోసగాడిగా.. పచ్చ నేత! యథేచ్ఛగా మేత!!
పాడేరు: మఠం భాస్కర్.. రంపచోడవరం నియోజకవర్గంలో ఈయన పేరు తెలియని వారండరు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో సిద్ధహస్తుడు. సొంతూరు రాజవొమ్మంగి మండలం అనంతగిరి. రంపచోడవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవికి భర్త. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.కోటి వరకు గతంలో వసూలు చేశాడు.. ఆ సొమ్ముకోసం ఇప్పటికీ బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆయన నేరచరిత్ర కూడా పెద్దదే. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన పలు కేసుల్లో నిందితుడు. నిరుద్యోగులకు మంచి జరగాలంటే భార్య శిరీషాదేవికి ఓటేయాలని ఇప్పుడు అభ్యర్థిస్తున్నాడు. అతను మాటలు నమ్మితే మన్యాన్ని మడత పెట్టేస్తాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీకి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి మఠం భాస్కర్ రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లో నమోదైన పలు కేసుల్లో నిందితుడు. ఏజెన్సీలో గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం వారి నుంచి సుమారు రూ.కోటి వరకు డబ్బులు వసూలు చేశాడు. నియోజకవర్గంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, దేవీపట్నం, వీఆర్‌పురం, డొంకరాయి, అడ్డతీగల గ్రామాల్లో ఆయన ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది.రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామానికి చెందిన గిరిజన యువకుడికి ఓ ఎయిడెడ్ స్కూల్లో టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.3 లక్షల వరకు తన ఖాతాకు నగదు బదిలీ చేయించుకున్నట్టు సమాచారం. ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చే వరకు అడగవద్దని హెచ్చరించినట్టు తెలిసింది.అడ్డతీగల మండలం దుప్పులపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన యువకుల నుంచి సీఆర్టీ పోస్టు ఇప్పిస్తానని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పన మూడు లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా మరో యువకుడి నుంచి టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.లక్ష, గుమస్తా పోస్టుకు రూ. 60 వేలు మధ్యవర్తుల సమక్షంలో వసూలు చేసినట్టు సమాచారం. ఇలా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్న మఠం భాస్కర్ పూర్తిగా చెల్లించిన దాఖల్లాలేవు. ఉద్యోగాలు మాట దేవుడెరుగు మా డబ్బులు మాకివ్వండి అంటూ గిరిజన యువత గగ్గోలు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఎప్పటికైనా ఎంతో కొంత మొత్తం ఇస్తాడన్న ఆశతో వారు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పేందుకు రాలేకపోతున్నారు.అసెంబ్లీ అభ్యర్థి శిరీషాదేవి భర్త మఠం భాస్కర్‌కు నేర చరిత్ర కూడా ఉంది. రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.2016లో రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్Œ వద్ద విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏకే దొరపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న అతనిపై దాడికి దిగడంతో (ఎఫ్ఐఆర్: 50/2017) అదే పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2017లో అతని స్వగ్రామం అనంతగిరిలో జీడిమామిడి తోటను దగ్ధం చేశాడు. గ్రామస్తుల సమక్షంలో బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామపెద్దలు చెప్పినప్పటికీ అందుకు అంగీకరించనట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు (ఎఫ్ఐఆర్: 15/2017) రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయింది.2019లో జరిగిన ఎన్నికల సమయంలో రాజవొమ్మంగిలో గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడన్న అభియోగంపై (ఎఫ్ఐఆర్:47/2019) కేసు నమోదైంది.2022లో అనంతగిరి గ్రామ సమీపంలో అశ్లీల నృత్య ప్రదర్శన, పేకాట, గుండాట నిర్వహించాడన్న అభియోగం మేరకు అతనిపై రాజవొమ్మంగి పోలీసులు (ఎఫ్ఐఆర్: 10/2022) కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.ఇవి చదవండి: కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్ కళ్యాణ్ -
డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఎదురుదాడి విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా.. పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి హనుమాన్ ఆలయం ముందు మెట్లపై కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేసిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
కదిరి అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం జౌకల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్త నాగభూషణం (38) దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే ఈ పని చేసి ఉంటారని హతుడి సోదరి చంద్రమ్మ కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నాగభూషణం అవివాహితుడు. శుక్రవారం కూడా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రచారం ముగిశాక రాత్రి తన ఇంటిముందు నిద్రించాడు. గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేసి అతి దారుణంగా చంపేశారు. ఘటనాస్థలాన్ని కదిరి పట్టణ సీఐ పుల్లయ్య పరిశీలించారు. హతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన తమ్ముడు నాగభూషణాన్ని గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు జయచంద్రనాయుడు, గోవర్దన్‌నాయుడు, జయరాంనాయుడు, జయరాం చంపి ఉంటారని అతడి అక్క చంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్లంతా తనను గ్రామంలో ఉండనీయబోమని వీళ్లు బెదిరిస్తున్నట్లు హిందూపురంలో ఉన్న తనకు నాగభూషణం ఫోన్‌చేసి చెప్పినట్లు తెలిపారు. తాను వచ్చి మాట్లాడతానని సముదాయించానని, అంతలోపే కిరాతంగా చంపే«శారని విలపించారు. చంద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగభూషణం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద వైఎస్సార్ïÙపీ సీఈసీ సభ్యుడు, కదిరి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పూల శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నాగభూషణం హంతకుల్ని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట ఎంపీపీ అమరనాథ్‌రెడ్డి, జేఏసీ కన్వినర్ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. -
హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై తలకిందులైన కారు
బి.కొత్తకోట: ప్రకృతి అందాలు తిలకించి, చల్లటి వాతావరణం అనుభూతితో వెనుదిరిగిన ఓ కుటుంబ ఆనందం క్షణాల్లో ఆవిరైంది. ప్రయాణిస్తున్న కారు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో లోయలోకి పడకుండా చేసిన ప్రయత్నాల్లో కారు తలకిందులై పడింది. అందులోని ముగ్గురు సురక్షితంగా బయటపడగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. బి.కొత్తకోటకు 18 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలోని గౌనిపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి, రజిత భార్యాభర్తలు. వేసవి సెలవులు కావడంతో విహార యాత్రకు వెళ్లేందుకు వీరి కుమార్తె, కుమారుడు ఆరవ తరగతి చదువుతున్న గగన, ఒకటవ తరగతి చదువుతున్న సుజిత్రెడ్డిలతో కలిసి బుధవారం ఉదయం కారులో మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ వచ్చారు. కొండపై ప్రకృతి అందాలను తిలకించి చల్లటి వాతావరణంలో సేదతీరారు. కొన్ని గంటల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యేందుకు వెనుదిరిగారు.కొండపై నుంచి కిందకు వస్తుండగా రేణిమాను మలుపు ముందున్న మలుపు వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాసులురెడ్డి కారు బ్రేక్‌లు ఫెయిల్ అయినట్టు గుర్తించారు. ఎడమవైపు లోయలు ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశాలు గుర్తించి కారును కుడివైపు తిప్పారు. అప్పటికే చేతి బ్రేక్‌ను వేసి కారును నిలిపే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాలేదు. దీంతో కారును కుడివైపునకు మళ్లించి కొండను ఢీకొని నిలిపేలా ప్రయత్నించారు. అయితే కొండబండను ఢీకొన్న కారు ఒక్కసారిగా రోడ్డుపై తలకిందులుగా పడిపోయింది. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో అగ్నికి ఆహుతి అయ్యేలా ఉందని ఆందోళనకు గురైన శ్రీనివాసులురెడ్డి కారులోంచి బయటకు వచ్చేందుకు డోర్లు తెరచుకునే పరిస్థితి లేదని గుర్తించారు.దీంతో కుడికాలితో బలంగా తన్ని అద్దాలను పగులగొట్టారు. తర్వాత భార్య, పిల్లులు కారులోంచి బయటపడ్డారు. అద్దాలను తన్నడంతో శ్రీనివాసులురెడ్డి కుడి పాదానికి తీవ్ర గాయంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ప్రమాద ఘటనను గుర్తించి స్థానికులు బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. పాదానికి అయిన గాయానికి బ్యాండేజి కట్టి కారులో బి.కొత్తకోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. కాగా ప్రమాద సమయంలో కారులోనే ఉన్న భార్య రజిత, పిల్లలు గగన, సుజిత్రెడ్డిలకు ఎలాంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు కారు ఎడమవైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే కారు 30 అడుగులపైనుంచి కిందకు పడి ఉండేది. -
వివాహితపై అత్తింటివారి దాడి
మదనపల్లె: కాపురం చేసేందుకు అత్తారింటికి వచ్చిన భార్యపై భర్త, అత్తామామలు దాడిచేసి, విచక్షణారహితంగా కొట్టి గాయపరిచిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్‌లో నివాసం ఉంటున్న రెడ్డెప్ప, రామలక్ష్మమ్మల కుమారుడు ఎం.నరసింహులు(34)కు సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెకు చెందిన స్వప్న(28)తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా స్వప్న ఆరునెలలుగా పుట్టినింటిలోనే ఉంటోంది.ఈ క్రమంలో భర్త నరసింహులు, మౌనిక అనే వేరొక అమ్మాయిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని తెలియడంతో, కాపురం నిలబెట్టుకునే ఉద్దేశంతో తల్లి శకుంతల, అన్న మురళితో కలిసి బుధవారం భర్త నరసింహులు ఇంటికి వెళ్లింది. కోడలు స్వప్నను ఇంటిలోకి రానివ్వకుండా, గుమ్మంలోనే మామ రెడ్డెప్ప, అత్త రామలక్షుమ్మలు అడ్డుకున్నారు. ఇన్నాళ్లుకు మొగుడు గుర్తుకు వచ్చాడా... ఇంట్లోకి రానవసరం లేదంటూ బయటకు నెట్టేందుకు ప్రయతి్నంచారు. తన భర్త ఇంటిలోకి రావద్దని చెప్పడానికి మీరెవరని, స్వప్న మొండిగా లోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచడంతో అత్తమామలు, కోడలిపై దాడికి పాల్పడ్డారు.కుమార్తెను అత్తామామలు విచక్షణారహితంగా కొడుతుండటంతో అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి శకుంతలను సైతం వారు కాలితో తన్ని గెంటేయడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈలోపు అక్కడకు చేరుకున్న భర్త నరసింహులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేందుకు నీకెంత ధైర్యమంటూ రోడ్డుమీద అందరూ చూస్తుండగానే, కాలితో తన్నుతూ, కొడుతూ వీరంగం సృష్టించాడు. భార్య, అత్తను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. తల్లి శకుంతలకు కడుపునకు శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో బలంగా కాలితో తన్నడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తాలూకా సీఐ ఎన్.శేఖర్ తెలిపారు. -
చెక్‌పోస్టులో భారీగా మద్యం పట్టివేత
తడ (తిరుపతి జిల్లా): ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం పట్టుబడుతోంది. తాజాగా బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద బుధవారం పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్నారు. ఎస్ఈబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పుదుచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కేరళకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా మద్యం రవాణా బట్టబయలైంది. పట్టుకున్న లారీని బీవీపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంలోని ఎస్ఈబీ కార్యాలయానికి తరలించి సరుకు లెక్కించారు. లారీలో మొత్తం 300 కేసుల (14,400 బాటిళ్లు) క్వార్టర్ బాటిళ్ల మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7.42 లక్షలుగా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు లారీ, కేరళకు చెందిన డ్రైవర్ మహ్మద్ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సరుకు పుదుచ్చేరిలోని బాలాజీ ఎంటర్ ప్రైజెస్, గ్లోబల్ బేవరేజెస్ పరిశ్రమ నుంచి వస్తున్న ‘ఆల్వేస్ సూపర్ స్ట్రాంగ్’ పేరుతో ఉన్న బ్రాందీ. దీనిని ఏప్రిల్ 30వ తేదీన తయారు చేసినట్టు సీల్ ఉంది. ఈ బ్రాండ్ నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ మద్యం వ్యాపారిదిగా ఎస్ఈబీ సిబ్బంది గుర్తించారు. -
Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్ నగర్లో జరిగింది. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్‌సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం మేరకు.. విజయవాడ గురునానక్ నగర్‌లోని మారుతీ కో– ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్ శ్రీనివాస్ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్‌తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్ ధారవత్ శ్రీనివాస్ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.వారం క్రితమే దారుణానికి వ్యూహం తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్ శ్రీనివాస్ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్‌లోని సూపర్ మార్కెట్‌కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్‌కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.తన వాట్సాప్‌కు వాయిస్ మెసేజ్ ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శ్రీనివాస్ తన వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్‌లో వివరించారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీంను రప్పించారు. శ్రీనివాస్ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్ మార్కెట్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు డాక్టర్ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మోసాన్ని జీరి్ణంచుకోలేక..! ఆర్థోపెడిక్ సర్జన్‌గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్‌కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్‌ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్‌ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
కదిరి టీడీపీ అభ్యర్థి కారులో రూ.2 కోట్ల నగదు
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌కు చెందిన ఫార్చునర్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు మంగళవారం అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. స్థానిక విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. అనంతపురం టూటౌన్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల విధుల్లో భాగంగా అనంతపురం టూటౌన్ పోలీసులు స్పెషల్ పార్టీ, మొబైల్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఏపీ 39 ఆర్క్యూ 0999 ఫార్చునర్ వాహనాన్ని తనిఖీ చేశారు. మూడు బ్యాగుల్లో నగదు పట్టుబడింది. దాన్ని లెక్కించి రూ.1,99,97,500 ఉన్నట్టు నిర్ధారించారు. పంచనామా నిర్వహించి.. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేశారు. రామ్‌నగర్ నుంచి తరలిస్తూ.. కందికుంట వెంకటప్రసాద్ కారు డ్రైవర్ సోమవారం రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తిని పికప్ చేసుకుని అనంతపురం రాజు రోడ్డులోని టీడీపీ నాయకుడికి చెందిన మాసినేని హోటల్లో దించినట్టు సమాచారం. రాత్రి అక్కడే బస చేసిన డ్రైవర్ మంగళవారం ఉదయం అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ ఇంటి నుంచి మూడు బ్యాగుల్లో నగదు సమకూర్చుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యానగర్ రోడ్డు మీదుగా నేరుగా కదిరికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. తనిఖీలు ఉంటాయనే ఉద్దేశంతో విద్యుత్ నగర్ సర్కిల్ మీదుగా వాహనాన్ని మళ్లించారు. కానీ.. పోలీసులు విద్యుత్ నగర్ సర్కిల్లోనూ వాహన తనిఖీలు చేపట్టడంతో నగదు పట్టుబడింది. కారు కందికుంట పేరుతోనే.. ఏపీ 39 ఆర్క్యూ 0999 నంబర్ గల ఫార్చునర్ కారు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరుతోనే రిజి్రస్టేషన్ అయింది. నగదు పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే వెంకటప్రసాద్ నల్లచెరువు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని కదిరిలోని ఇంటికి వెళ్లిపోయారు. కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమనే సంకేతాలు వస్తుండటంతో కందికుంట అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లకు నగదు ఎర వేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం, ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తెప్పించుకుని కదిరిలో పంచేలా ప్రణాళిక రచించుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఆదాయపు పన్ను అధికారుల విచారణ వెంకటప్రసాద్ వాహన డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరిచ్చారు? ఇందుకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా నగదు తీసుకెళ్తూ పట్టుబడితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదును తరలించడానికి గల కారణాలు ఏమిటి? బ్లాక్ మనీ కాకపోతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం ఎవరి నుంచి తీసుకున్నారు? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో నగదు ఇవ్వాల్సి వచ్చింది? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నారు. -
విజయవాడలో విషాదం.. డాక్టర్ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ..
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని.. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో డాక్టర్ శ్రీనివాస్, ఆయన తల్లి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల మృతికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన శ్రీనివాస్.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆస్పత్రిని విజయవాడలో ప్రారంభించాడు. అయితే ఆ ఆస్పత్రి సరిగా నడవటం లేదు. దీంతో ఆయన డిప్రెషలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిని రెండు నెలల కిందట మరొకరికి అప్పగించనట్లు తెలుస్తోంది.మంగళవారం ఉదయం గురునానక్ నగర్‌లోని ఇంట్లో శ్రీనివాస్ కుటుంబం విగత జీవిగా కనిపించింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్ మృతదేహాం కొయ్యకు వేలాడుతూ కనిపించింది. దీంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేదంటే ఎవరైనా హత్య చేశారా?.. తాను ఆత్మహత్య చేసుకుని, అంతకు ముందు కుటుంబ సభ్యుల్ని శ్రీనివాస్ హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరిపాయి. అయితే.. తన కారు తాళం తన అన్నకు ఇవ్వాలంటూ ఎదురింటి వాళ్ల పోస్ట్ బాక్స్‌లో డాక్టర్ శ్రీనివాస్ పేరిట ఒక లెటర్ దొరికింది. దీంతో ఇది సూసైడ్ కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్ధరాత్రి టైంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్ తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు.తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం.:::సాక్షిటీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్‌కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్‌బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్‌కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్‌కుమార్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్‌లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ నవీన్‌కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్‌బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్‌కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్‌లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్‌కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్‌లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్‌లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
కొవ్వూరు: వేగంగా వెళ్తున్న లారీ సడన్‌గా బ్రేక్ వేసి రోడ్డు పక్కకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఐషర్ వ్యాన్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాపవరం సమీపంలో నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ దిగువన శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఏలూరు నగరానికి చెందిన మేడం వినోద్ (32) సభలకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేసే పనిచేస్తుంటాడు.వినోద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తన వృత్తిలో భాగంగా గుంటూరులో సభకు సౌండ్ సిస్టం అమర్చిన వినోద్ తిరిగి విశాఖపట్నం సమీపంలోని చోడవరంలో కార్యక్రమానికి సౌండ్ సిస్టంను తీసుకెళ్తున్నారు. ఈ సౌండ్ బాక్స్‌లను తీసుకుని ఏలూరుకు చెందిన మరో ఏడుగురితో చోడవరానికి ఐషర్ వ్యాన్‌లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు మండలం కాపవరం సమీపానికి వచ్చేసరికి హైవేపై ఫ్లైఓవర్ దిగువన జగ్గయ్యపేట నుంచి ఒడిశా రాష్ట్రానికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో పాటు, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా రోడ్డు మార్జిన్లోకి వెళ్లింది.అప్పటికే వెనుక ఉన్న ఐషస్ వ్యాన్ అదుపు తప్పి వెనుక నుంచి లారీని ఢీకొంది. ఈ ఘటనతో మేడం వినోద్, అతని సహచరుడు దారబోయన ప్రభాకర్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్‌లో ఉన్న ఏలూరు పట్టణానికి చెందిన మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు ప్రభాకర్‌కు ఇంకా వివాహం కాలేదు. అదే కారణం.. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. సడన్‌గా బ్రేక్ వేయడం, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకపోవడం, రోడ్డు మార్జిన్లోకి లారీని ఒక్కసారిగా తిప్పేయడంతో వెనుక వస్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని అంటున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించారు. -
భారీగా టీడీపీ మద్యం పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని మెట్లపల్లి శివారుల్లో టీడీపీ నేతలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన గోవా మద్యం నిల్వలను ఆదివారం పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన టీడీపీ నేతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెట్లపల్లి శివారులో గన్నవరం మాజీ సర్పంచి, టీడీపీ నేత గూడపాటి తులసీమోహన్ సోదరుడైన దుర్గాప్రసాద్‌కు చెందిన శ్రీనివాస గార్డెన్స్‌లో భారీగా మద్యం నిల్వచేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరి ఆదేశాల మేరకు హనుమాన్‌జంక్షన్ సీఐ నరసింహమూర్తి, ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్ఐ రామాంజనేయ, సెబ్ అధికారులు సంయుక్తంగా గార్డెన్స్‌లోని గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు. అక్కడ గోవా రాష్ట్రానికి చెందిన స్టీకర్స్‌తో మొత్తం 1,210 కేసుల్లో 58,032 క్వార్టర్ సీసాల మద్యం నిల్వల్ని గుర్తించి సీజ్ చేశారు. వీటివిలువ సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన శ్రీనివాస గార్డెన్స్ యాజమాని, టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్‌ను, వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ, నేతల్లో ఆందోళన ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఈ మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గూడ్స్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి న ఈ మద్యాన్ని ఇక్కడినుంచి గ్రామాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.మద్యం పట్టుబడ్డడంతో యార్లగడ్డతో పాటు ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాడిచేసిన విషయం తెలుసుకున్న యార్లగడ్డ వర్గానికి చెందిన టీడీపీ నేతలు పొట్లూరి బసవరావు, జాస్తి శ్రీధర్‌బాబు, దొంతు చిన్నా, కేసరపల్లి ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిషోర్ గంటల వ్యవధిలోనే ఆ గ్రామానికి చేరుకున్నారు. -
దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
సబ్బవరం: సాలాపువానిపాలెంలో ఓ యువకుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ప్రియుడిపై మోజులో మరో ఇద్దరితో కలిసి కోడలే కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన మండలంలోని గోటివాడ శివారు సాలాపువానిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ పిన్నింటి రమణ శనివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం... సాలాపు శ్రీనివాసరావు (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించడం... అనంతరం కలిసి జీవించడం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా... అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకుని మంచం కోడితో తలపై దాడి చేశారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతోపాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా... శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో పడి వున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు శ్రీనివాసరావును హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు తలపై మంచం కోడితో దాడి చేసిన తర్వాత... సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. -
Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం : వారు ప్రయాణిస్తున్న కారు యమదూతలా మారింది.. టైరు రూపంలో యమపాశం విసిరింది.. జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదం రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు హరించింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలివి. జీవీఎంసీ 91వ వార్డు గవరవీధి, ఎన్ఏడీ జంక్షన్, కూర్మనపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు కారులో శనివారం ఉదయం కాకినాడ బయలు దేరారు. శరగడం వెంకటలక్ష్మి (37) తన కొడుకు వికాస్, మేనమామ కొడుకు దాడి గగన్ (15)లతో కలిసి వ్యక్తిగత పనిమీద కారులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు వికాస్ స్నేహితుడైన సుంకర మధుకర్(27) బయలుదేరాడు.పాయకరావుపేటలో వెంకటలక్ష్మి తల్లిని చూసి అక్కడ నుంచి కాకినాడ వెళ్లాలనుకున్నారు. కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు చేరుకునే సరికి హఠాత్తుగా టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతల రూట్లోకి దూసుకుపోయింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు టాప్ పైకి లేచిపోయింది. డోర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వికాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల్లో జర్మనీ వెళ్లాల్సి ఉండగా.... వికాస్ స్నేహితుడైన మధుకర్ విశాఖ స్టీల్‌ప్టాంట్‌లో మెకానికల్ విభాగంలో అప్రెంటీస్ చేస్తున్నట్టు తెలిసింది. తుని ప్రాంతానికి చెందిన అతడు ఎన్ఏడీ జంక్షన్లో ఉంటున్నాడు. అతడు రెండు నెలల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని రోదించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.గవరవీధిలో విషాదఛాయలు గోపాలపట్నం: వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుమారుడు వికాస్ గాయాలపాలవడంతో గవరవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గవరవీధిలో ఉంటున్న శరగడం నర్సింగరావు సప్లయర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడి భార్య వెంకటలక్ష్మి మృతి చెందగా కుమారుడు వికాస్ గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇంటికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాడి గగన్ది కూర్మన్నపాలెం కాగా.. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద కారు ఎక్కాడు.