ఇంట్లోనే ఉండండి.. ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి: స్టార్‌ మా | Intlone Undandi Online Lo Billu Kattandi Star Maa Consumer Safety Campaign | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే ఉండండి.. ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి: స్టార్‌ మా

May 2 2020 12:16 PM | Updated on May 2 2020 12:43 PM

Intlone Undandi Online Lo Billu Kattandi Star Maa Consumer Safety Campaign - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సంక్షోభ సమయంలో దేశమంతా ఏకతాటిపైకి వచ్చిన వేళ, కోట్లాది(నెలకు 700 మిలియన్ల) మందికి పైగా వీక్షకులను చేరుకునే స్టార్ ఇండియా నెట్‌వర్క్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తమ వినియోగదారుల భద్రతను లక్ష్యంగా చేసుకుని..  'ఇంట్లోనే ఉండండి, ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి' పేరిట ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా తమ వీక్షకులకు నిరంతర వినోదానికి భరోసా కల్పిస్తుంది. ఈ ప్రచారంతో భద్రత పట్ల అవగాహన మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. అదే సమయంలో కుటుంబాలకు వినోదాన్నీ అందిస్తూ... టీవీ బిల్లు చెల్లింపులకు సైతం బయటకు వెళ్లకుండా.. సమస్యలను ఇంటి బయటే వదిలేయమని ​కోరుతోంది. ఇందుకోసం వినూత్నమైన.. సృజనాత్మకతతో ​​కూడిన ఆన్‌లైన్ సదుపాయాలను వినియోగించుకోవాల్సిందిగా వీక్షకులను అభ్యర్థిస్తోంది.

ఈ విషయం గురించి స్టార్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ హెడ్- డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ గుర్జీవ్ సింగ్ కపూర్ మాట్లాడుతూ.. "మా ప్రచారం ద్వారా వినియోగదారులను ఇంటివద్దనే ఉండండి. సురక్షితంగా ఉండండి అని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. అదే సమయంలో వారు తమకు కావాల్సిన వినోదాన్ని పొందుతూనే ఆన్‌లైన్‌లో టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బిల్లులను చెల్లించాల్సిందిగానూ చెబుతున్నాం. బహుళభాషలలో మా ప్రాచుర్యం పొందిన జీఈసీ, కిడ్స్, మూవీస్, స్పోర్ట్స్ ఛానెల్స్ యొక్క చేరికపై ఆధారపడి  ఈ సంక్షోభ సమయంలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాం'' అని అన్నారు. " ఈ ఆపద సమయంలో కూడా ఆన్‌గ్రౌండ్ పనిచేస్తున్న మా కేబుల్, డీటీహెచ్ భాగస్వాములకు చెందిన సాహసోపేత బృందాలను ప్రశంసిస్తున్నాము. అదే విధంగా వీక్షకుల కోసం సేవల పరంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు భరోసా కల్పించేందుకు చేస్తున్న వారి ప్రయత్నాలను అభినందిస్తున్నాము'' అని కొనియాడారు. 

ఇక స్టార్ మా నెట్‌వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్.. మాట్లాడుతూ... "బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటుగా సెలబ్రిటీ హోమ్ వీడియోలను అద్భుతంగా మిళితం చేసి మన తెలుగు వీక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించడానికి స్టార్ మా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. మా వినియోగదారుల భద్రత, ఆరోగ్యం తొలి ప్రాధాన్యమై ఈ కీలక సమయంలో, మేము ప్రతి ఒక్కరినీ తమ కేబుల్/డీటీహెచ్ బిల్లులు లేదా మరేదైనా యుటిలిటీ బిల్లును ఆన్‌లైన్ విధానంలో చెల్లించమని కోరుతున్నాం. అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా మరికొంత కాలం ఇళ్లలోనే ఉండాల్సిందిగానూ అభ్యర్థిస్తున్నాం. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అంటూ చెప్పేందుకు మనకోసం మా ప్రయత్నం'' అని అన్నారు.

కాగా స్టార్ ఇండియా తమ నెట్‌వర్క్ ఛానెల్స్‌ ప్రేక్షకులకు అనంతమైన వినోదాన్ని పంచుతున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన క్లాసిక్ షోస్ అయినటువంటి మహాభారత్ మొదలు ఎన్నో ఆసక్తికరమైన షోలను తీసుకువచ్చాయి. ఇక స్టార్ మా టీవీ వీక్షకులు ఇప్పుడు తమ అభిమాన సీరియల్స్ కార్తీక దీపం, వదినమ్మ, గృహలక్ష్మి ఇలా మరెన్నో నాన్- ఫిక్షన్ సీరియళ్లతో పాటుగా నూతన, ఉత్సాహభరితంగా సాగే ప్రీమియర్స్‌ను వీక్షించవచ్చు. ఈ ఛానెల్ ఇప్పుడు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సినిమాలను ప్రసారం చేస్తుండటంతో పాటుగా ప్రతి శుక్రవారం ఫ్యామిలీ మూవీస్‌ను ప్రసారం చేస్తుంది. 

చిన్నారుల కోసం
ఇక ఈ లాక్‌డౌన్ వేళ తమ వీక్షకులతో అనుసంధానించబడటానికి కొన్ని నాన్- ఫిక్షన్ ఫార్మాట్లను సైతం ఛానెల్‌ తీసుకువచ్చింది. వీకెండ్ బ్లాక్‌బస్టర్ షోకు కొనసాగింపుగా ఇస్మార్ట్ జర్నీ మరియు పూర్తి సరికొత్త రూపులో బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్ వంటివి సైతం వీటిలో ఉన్నాయి. ఈ బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్‌లో స్టార్ మా సెలబ్రిటీలు ఇంటి పనులతో ఒకరినొకరు సవాల్ విసురుకుంటుంటారు. స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ సైతం కొన్ని ఆసక్తికరమైన సినీ పండుగలను సృష్టించాయి. సినీ వినోదసాగరంలో తేలియాడుతూ ఇళ్లలోనే కుటుంబాలు ఉంటాయన్న భరోసానూ ఇవి అందిస్తాయి. స్టార్ మూవీస్ ఇప్పుడు చిన్నారులకు ఇష్టమైన చిత్రాలైనటువంటి మేరీ పాపిన్స్ రిటర్న్స్, డుంబో మరియు నట్‌క్రాకర్ మరియు ఫోర్ రియల్మ్స్ ఆన్ ప్లేడేట్ ప్రదర్శిస్తుంది. వీటితో పాటుగా అత్యంత ప్రాచుర్యం పొందిన మార్వెల్ మూవీ సెలక్షన్, అత్యుత్తమ యాక్షన్ బ్లాక్‌బస్టర్స్ ను యాక్షన్ ఎట్ 9తో వీక్షించవచ్చు. 

అదే విధంగా వీక్షకులు అత్యుత్తమ ఇంగ్లీష్ వినోదానికై అమెరికన్ ఐడల్, కాఫీ విత్ కరణ్, మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా అత్యుత్తమ ఎపిసోడ్స్ చూడవచ్చు. కిడ్స్ నెట్‌వర్క్‌పై 100 గంటలకు పైగా తాజా కంటెంట్‌ను జోడించారు. డిస్నీ ఛానెల్ మరియు హంగామా టీవీ లపై సమ్మర్ బొనాంజాను వీరు వీక్షించవచ్చు. వీటిలో దేశీయంగా తీర్చిదిద్దిన బాపు - తెలివైన నాయకుని యొక్క స్వచ్ఛమైన మరియు సానుకూల కథ.. దీనితో పాటుగా సంతోషకరమైన సర్కస్ ట్రూప్‌లోని స్నేహితులతో కూడిన జంతువుల కథ -గుడ్డు మరియు సృజనాత్మక గాడ్జెట్స్‌తో కూడిన సాఫ్ట్ టాయ్ - గాడ్జెట్ గురు విత్ గణేశాఆ వంటివి వీక్షించవచ్చు. చిన్నారులు వీటితో పాటుగా హగేమారు షోను సైతం వీక్షించవచ్చు. దీనిలో అల్లరి హగేమారు యొక్క కథను తెలుపుతారు.అంతేగాక వీటితో పాటుగా సెల్ఫీ విత్ భజరంగ్, డోరెమాన్, చాచా చౌదరి, మిరాక్యులస్‌లో నూతన ఎపిసోడ్స్‌ను సైతం వీక్షించవచ్చు.

క్రీడాభిమానుల కోసం
క్రీడాభిమానులు ఇప్పడు క్రికెట్ కనెక్టడ్‌ను ఆస్వాదించవచ్చు. దీనిలో క్రికెట్ లెజండ్స్ తమ అభిమానులతో వీడియో కాల్స్ ద్వారా ప్రతి వారమూ మాట్లాడవచ్చు. అలాగే ఐపీఎల్‌లో అత్యుత్తమ మ్యాచ్‌లు సైతం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌పై చూడవచ్చు. ఇంటరాక్టివ్ గేమ్స్‌తో తమ మెదడుకు వ్యాయామాన్ని అందించడంతో పాటుగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌పై వచ్చే బ్రెయిన్ బూస్టర్స్‌తో ప్రయోగాలూ చేయవచ్చు. అలాగే నూతన షో లాక్‌డౌన్ ఇండియాస్ ఫైట్ ఎగైనెస్ట్ కరోనా వైరస్ ద్వారా అత్యంత భయంకరమైన వైరస్‌పై భారతదేశపు పోరాటాన్ని చూడవచ్చు. ఓ నెట్‌వర్క్‌గా స్టార్ టీవీ, భావోద్వేగ పరంగా కోట్లాది మంది భారతీయులకు 25 సంవత్సరాలుగా కనెక్ట్ అయింది. ఈ కష్టకాలంలో తమ పూర్తి మద్దతును అందించడాన్ని కొనసాగిస్తుంది. ఇంట్లోనే ఉండండి, ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి క్యాంపెయిన్ వీడియో కోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement