తాళికట్టు శుభవేళ.. వేలికి సిరా గుర్తు

Brides And Grooms Caste There Vote Rights in Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: ఎన్నికల రోజున పలు చోట్ల పెళ్లిళ్లు జరిగాయి. ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని కొత్త దంపతులు కొందరు పెళ్లికి ముందే ఓటేస్తే, మరికొందరు తాళి కట్టి బయల్దేరారు.  
దక్షిణ కన్నడ జిల్లాలోని విట్లాలో ఉదయాన్నే వధువు శ్రుతి పెళ్లి మంటపానికి వెళ్లకముందు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి క్యూలో నిలబడి ఓటేశారు.  
అదే జిల్లా పుత్తూరులో వధువు హేమలత, బెళ్తంగడి తాలూకాలో తణ్ణీరుపంథలో పెళ్లికూతుళ్లు అశ్విని, అక్షత ఓటు వేశారు.  
బంట్వాళలో నవజంట సుమిత్‌ పూజారి, ప్రతిజ్ఞ మొదట ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ఆ తర్వాత పోళలి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top