గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 15 2026 8:00 AM | Updated on Oct 15 2026 8:00 AM

గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నేడు విజిలెన్స్‌ ఎదుట విచారణకు పదవీవిరమణ పొందిన ఈఎన్సీ, ఎస్‌ఈ ఆందోళన చెందుతున్న ఇతర అధికారులు భూ సేకరణ సమయంలో ఏఈ, డీఈఈల చేతివాటం!

విజిలెన్స్‌ పిలుపుతో

అధికారుల్లో గుబులు

రంగనాయకసాగర్‌ నిర్మాణంలో అవకతవకలపై ఫిర్యాదులు

సాక్షి, సిద్దిపేట: ఇరిగేషన్‌ అధికారుల్లో గుబులు మొదలైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రంగనాయకసాగర్‌ నిర్మించిన సమయంలో పనిచేసిన అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చిన్నకోడూరు మండలం చంద్లపూర్‌లో 3టీఎంసీల సామర్థ్యంతో 2019– 20లో రంగనాయకసాగర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌ నిర్మాణంతోపాటు భూసేకరణలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి వచ్చిన ఆరోపణల పై దర్యాప్తును ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్సీ), సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా పని చేసి పదవీవిరమణ చేసిన హరిరాం, ఆనంద్‌లను గురువారం విచారణకు పిలిచారు.

ఇప్పటికే వివరాల సేకరణ

రిజర్వాయర్‌ ఇన్వెస్టిగేషన్‌, సర్వే, ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌), ఫిజిబిలిటీ రిపోర్టు, అంచనాలు, ఒప్పందాలకు సంబంధించి పరిపాలన, సాంకేతిక అనుమతులు, మట్టి కట్ట నిర్మాణానికి అమోదించిన డిజైన్స్‌, డ్రాయింగ్స్‌, జియాలాజికల్‌ ఇన్వెస్టిగేషన్‌ వివరాలను తెప్పించుకున్నారు. నీటి లభ్యత వివరాలు, ఒరిజినల్‌ ఎలైన్‌మెంట్‌, మార్పు చేసి ఉంటే ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించింది. భూ సేకరణ, అటవీ భూమి మళ్లింపు, భూసేకరణ చేసిన వారికి చేసిన చెల్లింపుల వివరాలను ఇప్పటికే సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం.

విచారణకు పిలవడంతో..

రంగనాయకసాగర్‌ నిర్మాణంలో పై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆరు నెలలుగా విజిలెన్స్‌ విచారణ చేస్తున్నారు. ఇద్దరు అధికారులను విచారణకు పిలవడంతో గతంలో పని చేసిన ఇరిగేషన్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం సమయంలో పనిచేసిన ఏఈ, డీఈఈ, ఈఈలు తమ మేడకు ఎక్కడ చుట్టూకుంటుందో అని తలలు పట్టుకుంటున్నారు. భూసేకరణ సమయంలో ఏఈ, డీఈఈలు సైతం తమ చేతి వాటం ప్రదర్శించినట్లు చర్చసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement