మల్లన్న సన్నిధిలో కోదండరాం | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సన్నిధిలో కోదండరాం

Oct 15 2026 8:00 AM | Updated on Oct 15 2026 8:00 AM

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని శాసన మండలి సభ్యుడు ప్రొఫెసర్‌ కోదండరాం కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదం, చిత్రపటం అందించారు. కార్యక్రంమలో ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్‌, ప్రధానార్చకులు మహదేవుని శ్రీనివాస్‌, పర్యవేక్షకులు నీల శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న సేవలోనే ఒగ్గు పూజారులు

మల్లికార్జున స్వామి సేవలోనే ఒగ్గుపూజారులు ఉన్నారని, నిత్యం స్వామి వారికి పూజలు చేస్తున్నామని ఒగ్గు పూజారుల యాదవ సంఘం అధ్యక్షుడు బొద్దుల కనకయ్య వెల్లడించారు. బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మల్లన్న పట్నం.. మళ్లీ బేరం’ కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. మల్లన్న ఆలయంలో నూతన ఒగ్గుపూజారుల నియామకంలో డబ్బు వసూళ్ల పై సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్నా రు. కొంత మంది బయటి వ్యక్తులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయని అన్నారు.

టెన్త్‌ విద్యార్థినికి

జాతీయ అవార్డు

దుబ్బాక: పట్టణంలోని పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాల టెన్త్‌ విద్యార్థిని కాల్వ రేణుశ్రీ ఉత్తమ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ జాతీయ అవార్డును మంత్రి వివేక్‌ చేతుల మీదుగా అందుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో మానక్‌ మహోత్సవ ప్రపంచ ప్రమాణాల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో ప్రతినెలా నిర్వహించే క్విజ్‌ పోటీలలో రేణుశ్రీ బహుమతులు గెలుచుకున్నారు. ఇందుకు గాను రేణుశ్రీకి ఉత్తమ అవార్డును మంత్రి వివేక్‌ అందజేశారు. రేణుశ్రీ అవార్డు అందుకోవడంపై హెచ్‌ఎం పట్నం భూపాల్‌, ఉపాధ్యాయురాలు సంతోషం వ్యక్తం చేశారు.

ఉన్నత లక్ష్యాలు సాధించాలి

న్యాయమూర్తి తరణి

సిద్దిపేటజోన్‌: విద్య ద్వారా ఆత్మ విశ్వాసం పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి తరణి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని సందర్శించారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల సదనంలోని పిల్లలతో ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హక్కులు, విద్య ప్రాముఖ్యత, బాలికల భద్రత, చట్టపరమైన రక్షణల గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రవికుమార్‌, న్యాయవాది నాగపూజ, సూపరింటెండెంట్‌ ప్రతిభ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement