బయట తిరగనివ్వవు ఇంట్లో ఉండనివ్వవు | - | Sakshi
Sakshi News home page

బయట తిరగనివ్వవు ఇంట్లో ఉండనివ్వవు

Oct 15 2026 8:00 AM | Updated on Oct 15 2026 8:00 AM

రోడ్డుపై నడవాలంటే వణుకే కర్రలతో కాపలా కాస్తున్న మహిళలు తమను రక్షించాలంటూ మొరపెట్టుకుంటున్న చిన్నారులు హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో కిష్కింధకాండ

హుస్నాబాద్‌: అడవిలో ఉండాల్సిన కోతులు.. జనావాసాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. నడిచి వెళ్తున్న బాటసారులు, చిన్నారులపై, వృద్ధులు, మహిళలపై వానరాలు దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయి. హుస్నాబాద్‌ పట్టణంలో ఏ వీధి చూసినా కోతుల గుంపులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇంట్లో ఉన్న సామానులను చిందరవందర చేస్తూ తినే ఆహారాన్ని సైతం ఎత్తుకెళ్తున్న దుస్థితి. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని వెంటాడుతున్నాయి. కోతుల దాడులతో గాయాలపాలై ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

గుడి, బడిని సైతం..

ఎక్కడ చూసినా మేమే అన్నట్లుగా ప్రతి చోట వానర సైన్యం కాపు కాస్తోంది. దైవ కార్యం కోసం గుడులకు వెళ్లిన భక్తులపై కోతులు దాడులు చేస్తున్నాయి. పూజా సామగ్రి, నైవేద్యాన్ని చూసి దాడులకు తెగబడతున్నాయి. కోతుల భయంలో ఆచితూచి జాగ్రత్తలు తీసుకొని దర్శనం చేస్తుకుంటున్నారు.

నివారణకు చర్యలేవి...

హుస్నాబాద్‌ పట్టణంలో కోతులు, పందులు, కుక్కల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు నెలల క్రితం మున్సిపల్‌ ఆధ్వర్యంలో కోతుల పట్టేవారిని పిలిచి రెండు, మూడు రోజులు పట్టే ప్రయత్నం చేశారు. వారు వెళ్లిపోవడంతో మళ్లీ కోతుల గురించి పట్టించుకోవడం మానేశారు. మున్సిపల్‌ పాలకవర్గ సమావేశంలో కోతులను నివారించాలని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని తీర్మానం చేస్తున్నారు. తీర్మానాలకే పరిమితం తప్ప ఆచరణలో శూన్యం.

పేట్రేగుతున్న కోతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement